Budget 2024: బడ్జెట్‌కు రాష్ట్రపతి ఆమోదం.. పార్లమెంట్‌లో చిట్టా విప్పనున్న కేంద్రమంత్రి
ABN , Publish Date - Feb 01 , 2024 | 09:59 AM
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. డిజిటల్ రూపంలోనే బడ్జెట్ సమర్పించనున్నారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. డిజిటల్ రూపంలోనే బడ్జెట్ సమర్పించనున్నారు. ఉదయం కేంద్ర ఆర్ధిక శాఖ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకోనున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. బడ్జెట్ కు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్రపతికి వివరించారు. అనుమతి తీసుకున్నాక నేరుగా పార్లమెంట్ కు వెళ్లి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఎన్నికల ఏడాదిలో ప్రవేశపెడుతున్న ఈ బడ్దెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాగా.. వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అరుదైన ఘనత సాధించనున్నారు. ఈ మధ్యంతర బడ్జెట్‌లో దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు ఎన్నికలపరంగా ముఖ్యమైన రైతులు, మహిళలకు సంబంధించిన ప్రకటనలు ఉండవచ్చన్న అంచనాలున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.