Share News

Cyber ​​criminals: డెలివరీ లొకేషన్‌ షేర్‌ చేయమంటూ సందేశం పంపి..

ABN , Publish Date - Sep 24 , 2024 | 11:48 AM

ఇప్పటి వరకు ఫెడెక్స్‌, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేరుతో కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌ పేరును కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మీ పార్సిల్‌ డెలివరీ చేసేందుకు లొకేషన్‌ షేర్‌ చేయమంటూ సందేశం పంపిన సైబర్‌ నేరగాళ్లు బాధితుడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ. 1.55 లక్షలు కాజేశారు. మీకు వచ్చిన పార్సిల్‌ కోసం డెలివరీ లొకేషన్‌ షేర్‌ చేయమని, లేకపోతే పార్సిల్‌ రిటర్న్‌ అవుతుందని నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఫోన్‌కు సందేశం వచ్చింది.

Cyber ​​criminals: డెలివరీ లొకేషన్‌ షేర్‌ చేయమంటూ సందేశం పంపి..

- ఇండియన్‌ పోస్టల్‌ శాఖ పేరుతో లింక్‌

- మొబైల్‌ హ్యాక్‌ చేసి, రూ. 1.55 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: ఇప్పటి వరకు ఫెడెక్స్‌, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేరుతో కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌ పేరును కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మీ పార్సిల్‌ డెలివరీ చేసేందుకు లొకేషన్‌ షేర్‌ చేయమంటూ సందేశం పంపిన సైబర్‌ నేరగాళ్లు బాధితుడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ. 1.55 లక్షలు కాజేశారు. మీకు వచ్చిన పార్సిల్‌ కోసం డెలివరీ లొకేషన్‌ షేర్‌ చేయమని, లేకపోతే పార్సిల్‌ రిటర్న్‌ అవుతుందని నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఫోన్‌కు సందేశం వచ్చింది. పార్సిల్‌ కోసం ఎదురుచూస్తున్న అతడు లింక్‌ ఓపెన్‌ చేశాడు.


ఇండియన్‌ పోస్టల్‌ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశాడు. డెలివరీ కోసం రూ. 25 క్రెడిట్‌ కార్డు నుంచి చెల్లించాడు.

కొద్దిసేపటి తర్వాత మీ ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయ్యాయన్న సందేశం రాగానే క్రెడిట్‌ కార్డును బ్లాక్‌ చేశాడు. బ్యాంకు అధికారులను సంప్రదించగా.. గుర్తుతెలియని వ్యక్తులు అతడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ. 1.55 లక్షలు కాజేసి దుబాయ్‌లో ఉన్న ఖాతాలో జమ చేశారు. సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారని తెలుసుకున్న బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


........................................................

ఈ వార్తను కూడా చదవండి:

.......................................................

Hyderabad: గంజాయి విక్రయాల్లో ఆరితేరిన లేడీ డాన్‌..

- సంధ్యాబాయి అరెస్ట్‌..

-2 కిలోల సరుకు స్వాధీనం

city6.jpg

హైదరాబాద్‌ సిటీ: గంజాయి విక్రయాల్లో ఆరితేరి ధూల్‌పేట లేడీ డాన్‌(Dhulpet Lady Don)గా పేరుగాంచిన సంధ్యాబాయిని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె వద్ద నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సంధ్యాబాయి(Sandhyabai) గత కొంతకాలంగా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి కొనుగోలు చేసి ధూల్‌పేట కేంద్రంగా విక్రయిస్తోంది. ధూల్‌పేటలో పోలీసుల దాడులు పెరగడంతో ఆమె మకాం మార్చి ఐటీ కారిడార్‌లో గంజాయి విక్రయాలు చేస్తోంది. సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.

city6.2.jpg

Updated Date - Sep 24 , 2024 | 11:48 AM