Share News

Hyderabad: పోలీస్‌ శాఖకూ ‘సైబర్‌’ ముప్పు.. ‘హాక్‌ ఐ’ యాప్‌ హ్యాక్‌

ABN , Publish Date - Jun 12 , 2024 | 10:56 AM

సైబర్‌ సెక్యూరిటీలో లోపాలు.. పోలీస్‌ డిపార్టుమెంట్‌(Police Department)కు సవాల్‌గా మారాయి. దేశంలోనే మొదటిసారిగా, ఎవరూ అందుబాటులోకి తేని విధంగా సైబర్‌ సెక్యూరిటీబ్యూరోను అందుబాటులోకి తెచ్చినట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు గతేడాది గొప్పగా చెప్పారు. ఎలాంటి సైబర్‌ ముప్పునైనా ముందే గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కొనేంత అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.

Hyderabad: పోలీస్‌ శాఖకూ ‘సైబర్‌’ ముప్పు.. ‘హాక్‌ ఐ’ యాప్‌ హ్యాక్‌

- సైబర్‌ సెక్యూరిటీకి సవాల్‌ విసిరిన నేరగాళ్లు

- ‘హాక్‌ ఐ’ యాప్‌ హ్యాక్‌

- సెక్యూరిటీ లోపాలపై దృష్టిపెట్టిన ఐటీ సెల్‌

- కొన్నిరోజులుగా పనిచేయని మూడు కమిషనరేట్ల వెబ్‌సైట్లు

హైదరాబాద్‌ సిటీ: సైబర్‌ సెక్యూరిటీలో లోపాలు.. పోలీస్‌ డిపార్టుమెంట్‌(Police Department)కు సవాల్‌గా మారాయి. దేశంలోనే మొదటిసారిగా, ఎవరూ అందుబాటులోకి తేని విధంగా సైబర్‌ సెక్యూరిటీబ్యూరోను అందుబాటులోకి తెచ్చినట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు గతేడాది గొప్పగా చెప్పారు. ఎలాంటి సైబర్‌ ముప్పునైనా ముందే గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కొనేంత అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఇటీవల ‘హాక్‌ ఐ’ యాప్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేసినా ముందే పసిగట్టలేకపోయారు. పోలీస్‌ డిపార్టుమెంట్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజోపయోగం కోసం అందుబాటులోకి తెచ్చిన అప్లికేషన్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేసి, లక్షలాది మంది డేటా చోరీ చేయడంతో కంగుతున్నారు. ఉరుకులు పరుగులతో రంగంలోకి దిగిన పోలీస్‌ ఉన్నతాధికారులు బృందాలుగా ఏర్పడి టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన హ్యాకర్‌ను అరెస్టు చేశారు. అప్పటికే డేటాను చోరీ చేసిన సైబర్‌ నేరగాడు ఆ డేటాను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఫేస్‌బుక్‌లో పరిచయమై.. రూ. 41.28లక్షలకు కుచ్చుటోపి


ఐటీ సెల్‌ దిద్దుబాటు చర్యలు..

హాక్‌ ఐ యాప్‌ హ్యాక్‌కు గురైనప్పటి నుంచి ఐటీ సెల్‌ ఉన్నతాధికారులు సైబర్‌ సెక్యూరిటీ లోపాలపై దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసింది. దాంతో పోలీస్‌ శాఖలో వినియోగిస్తున్న అప్లికేషన్స్‌తో పాటు.. వివిధ కమిషనరేట్‌ల వెబ్‌సైట్లలో ఉన్న సెక్యూరిటీ లోపాలను సరిచేస్తున్నట్లు తెలిసింది. దాంతో కొన్నిరోజులుగా హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌(Hyderabad, Rachakonda, Cyberabad) పోలీస్‌ కమిషనరేట్ల వెబ్‌సైట్లు(Websites) పనిచేయడం లేదు. వాటితో పాటు పోలీస్‌ శాఖ అధ్వర్యంలో వినియోగంలో ఉన్న అప్లికేషన్స్‌, ఇతర సైట్లలో లోపాలను ఐటీ అధికారులు సరిచేస్తున్నట్లు సమాచారం.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 12 , 2024 | 10:56 AM