Share News

AP Elections: మహిళలు బయటకు రావాలంటే జంకుతున్నారు: అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Apr 13 , 2024 | 08:35 PM

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీఎం జగన్ తల్లిని, చెల్లిని పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం జగన్‌ను ఆదర్శంగా తీసుకొని వైసీపీ శ్రేణులు మహిళలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి ఇలాంటి చర్యలకు తెగబడుతున్నారని విమర్శించారు.

AP Elections: మహిళలు బయటకు రావాలంటే జంకుతున్నారు: అచ్చెన్నాయుడు
Kinjarapu Atchannaidu Slams YS Jagan Rule In Andhra Pradesh

అమరావతి: ఏపీ సీఎం జగన్‌పై (Jagan) టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీఎం జగన్ తల్లిని, చెల్లిని పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం జగన్‌ను ఆదర్శంగా తీసుకొని వైసీపీ శ్రేణులు మహిళలపై పెట్రోల్ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మీకు ఉన్న బ్రహ్మాస్త్రం ఓటు హక్కుతో జగన్‌‌కు (Jagan) బుద్ధి చెప్పాలని కోరారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి ఇలాంటి చర్యలకు తెగబడుతున్నారని విమర్శించారు.


Pawan Kalyan: జనసేన పార్టీ యూట్యూబ్ చానెల్ హ్యాక్

విశాఖపట్టణం జిల్లా గాజువాకలో జరిగిన ఘటనను అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. జులుమూరి రాధ అనే మహిళపై 65వ వార్డు వైసీపీ అధ్యక్షుడు లోకనాథం దాడి చేశారని వివరించారు. ఆ తర్వాత మంటల్లో నెట్టి హతమార్చేందుకు ప్రయత్నించాడని తెలిపారు. వైసీపీ పాలనలో జరిగిన తప్పులను ఎత్తి చూపడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని గుర్తుచేశారు. ఇంటి పట్టాకi లంచం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. వైసీపీ శ్రేణుల వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదన్నారు.


AP Election 2024: ఎన్నికలకు 6 నెలల ముందు జగన్ నిద్ర లేచాడు: వైఎస్ షర్మిల

సీఎం జగన్‌కు తల్లి, చెల్లి అనే సెంటిమెంట్ లేదన్నారు. రాష్ట్రంలోని మహిళల సమస్యలను లెక్క చేయడని వివరించారు. వైసీపీ హయాంలో జరుగుతోన్న దాడులతో మహిళలు భయపడుతున్నారని పేర్కొన్నారు. దీంతో బయటకు రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొందని అంటున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Apr 13 , 2024 | 08:35 PM