CM Jagan: పది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధమంటూ.. పాత పాటే అందుకున్న జగన్
ABN , Publish Date - May 03 , 2024 | 01:00 PM
పథకాల కొనసాగింపుపై జగన్ మళ్లీ పాత పాటే అందుకున్నారు. నరసాపురం సభలో జగన్ మాట్లాడుతూ.. పథకాలు కొనసాగాలంటే తనకు ఓటు వేయాలని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలకు ముగింపు పలుకుతారని తెలిపారు. పది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని.. గతంలో ఎన్నడూ జరగని.. చూడని విధంగా ఇంటికే మూడు వేల చొప్పున పెన్షన్లు ఇచ్చామన్నారు.
ఏలూరు: పథకాల కొనసాగింపుపై జగన్ (CM Jagan) మళ్లీ పాత పాటే అందుకున్నారు. నరసాపురం సభలో జగన్ మాట్లాడుతూ.. పథకాలు కొనసాగాలంటే తనకు ఓటు వేయాలని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలకు ముగింపు పలుకుతారని తెలిపారు. పది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని.. గతంలో ఎన్నడూ జరగని.. చూడని విధంగా ఇంటికే మూడు వేల చొప్పున పెన్షన్లు ఇచ్చామన్నారు. తమ ప్రభుత్వం అమలుచేసిన పథకాలనే తిరిగి సీఎం జగన్ ఏకరవు పెట్టారు. జగన్ పథకాల ప్రసంగంపై ప్రజల నుంచి ఎలాంటి స్పందనా కనిపించలేదు.
AP Election 2024: పిఠాపురంలో పవన్ పోటీపై ముద్రగడ కూతురు సంచలన వ్యాఖ్యలు.. జగన్‌కు ఊహించని షాక్
ప్రజలకు ఈ 58 నెలల కాలంలోనే అందరికీ లబ్ది చేకూర్చామని జగన్ తెలిపారు. స్వయం ఉపాధి కోసం పథకాలు అమలు చేశఆమంటూ తాను అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ ఏకరువు పెట్టారు.130 సార్లు బటన్ నొక్కి, 2.70 లక్షల రుపాయలను అక్కా చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం అంటూ పాడిన పాటనే మళ్లీ పాడారు. 2014లో సీఎం చంద్రబాబు డ్వాక్రా రుణాలు రద్దు చేసినప్పటికీ.. ఒక్క రూపాయి కూడా రద్దు చేయలేదని జగన్ అబద్ధాలు చెబుతున్నారు. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు పాలనపై విమర్శలు చేయడానికే జగన్ ప్రసంగమంతా పరిమితమైంది. 2019 నుంచి తన పాలన గురించి ప్రజలు, రైతుల్లో ఉన్న వ్యతిరేకతను ఏమాత్రం జగన్ పట్టించుకోకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి...
AP Election 2024: పిఠాపురంలో పవన్ పోటీపై ముద్రగడ కూతురు సంచలన వ్యాఖ్యలు.. జగన్‌కు ఊహించని షాక్
Hyderabad: వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా ఎస్సైనే బెదిరించి దోచుకున్నారు..
Read Latest AP News And Telugu News