Share News

Pensions: తగ్గని పెన్షనర్ల కష్టాలు.. బ్యాంకుల వద్ద నరకం చూస్తున్న వృద్ధులు

ABN , Publish Date - May 03 , 2024 | 12:24 PM

Andhrapradesh: ఏపీలో పెన్షన్‌దారులకు రెండో రోజు కూడా తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రెండవ రోజు కూడా ఫించన్‌దారులు బ్యాంకుల చుట్టూ తిరుతున్నారు. పెన్షన్‌దారులకు ఉన్న బ్యాంకు అకౌంట్లలో సగానికిపైగా ఇన్ఆపరేటివ్ అయి ఉన్నాయి. దీంతో అకౌంట్లను ఆపరేషన్‌లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

Pensions: తగ్గని పెన్షనర్ల కష్టాలు.. బ్యాంకుల వద్ద నరకం చూస్తున్న వృద్ధులు
Old People Struggle for Pension in AP

అమరావతి, మే 3: ఏపీలో పెన్షన్‌దారులకు (AP Pensions) రెండో రోజు కూడా తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రెండవ రోజు కూడా ఫించన్‌దారులు బ్యాంకుల చుట్టూ తిరుతున్నారు. పెన్షన్‌దారులకు ఉన్న బ్యాంకు అకౌంట్లలో సగానికిపైగా ఇన్ఆపరేటివ్ అయి ఉన్నాయి. దీంతో అకౌంట్లను ఆపరేషన్‌లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దరఖాస్తు ఇచ్చిన వారిని వారం రోజులు తరువాత రావాలని కొన్ని బ్యాంక్‌ల యాజమాన్యాలు చెబుతున్నారు. దరఖాస్తులు నింపడం కూడా చేతకావడం లేదని పెన్షన్ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్


బ్యాంక్‌లకు వస్తున్న సాధారణ ఖాతాదారులను దరఖాస్తులు నింపాలని పెన్షన్‌దారులు ప్రాధేయపడుతున్న పరిస్థితి. రెండవరోజు కూడా బ్యాంక్‌ల వద్ద పెన్షనర్లు పడిగాపులు కాస్తున్నారు. మండుటెండలో తిరగలేక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అల్లాడిపోతున్నారు. తమకు ఈ ఇబ్బందులు రావడానికి చంద్రబాబే కారణమని వాలంటీర్లు చెప్పారని పెన్షన్ దారులు చెబుతున్నారు. అధికారంలో ఉంది జగన్ అని అందువలన తమ ఇబ్బందులకు కారణం జగన్ అని మరికొందరు చెబుతున్నారు. తమను ఇన్ని కష్టాలు పెడుతున్న వారికి తమ ఉసురు తగులుతుందని పెన్షన్‌దారుల శాపనార్థాలు పెడుతున్నారు.


ఇవి కూడా చదవండి...

AP Election 2024: పిఠాపురంలో పవన్ పోటీపై ముద్రగడ కూతురు సంచలన వ్యాఖ్యలు.. జగన్‌కు ఊహించని షాక్

Hyderabad: వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా ఎస్సైనే బెదిరించి దోచుకున్నారు..

Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2024 | 12:27 PM