TG Politics: రేవంత్, కేటీఆర్ తోడు దొంగలు.. దృష్టి మరల్చేందుకు సవాళ్లు: లక్ష్మణ్
ABN , Publish Date - Apr 14 , 2024 | 05:48 PM
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ గట్టు మీద ప్రధాన పార్టీల అధినేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేపీ ముఖ్య నేత లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి మాట్లాడుతూ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ గట్టు మీద ప్రధాన పార్టీల అధినేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేపీ ముఖ్య నేత లక్ష్మణ్ (Laxman) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి మాట్లాడుతూ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వారి కుట్రలను ప్రజలు గమనించారని, ప్రధాని మోదీపై (PM Modi) జనం దృష్టిని మరల్చేరని స్పష్టం చేశారు.
BRS: అవన్నీ అంబేద్కర్ ఆలోచన నుంచి వచ్చినవే: కేటీఆర్
‘ఫోన్ ట్యాపింగ్ అంశం టీవీ సీరియల్ మాదిరిగా కొనసాగిస్తున్నారు. ఇందుకు కారణం ఉంది. నిజమైన నేరస్థులను అరెస్ట్ చేయకుండా కావాలని టైమ్ పాస్ చేస్తున్నారు. ట్యాపింగ్‌తో సంబంధం లేదంటూనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కేటీఆర్ అంటున్నారు. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించ లేదు. డ్రగ్స్ కేసులో డీఎన్ఏ టెస్ట్‌కు సిద్ధమా అని కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ సమయంలో కేటీఆర్ రియాక్ట్ కాలేదు. ఇలా ఇద్దరు గేమ్ ఆడుతున్నారు అని’ లక్ష్మణ్ మండిపడ్డారు.
TG Politics: తప్పుడు మార్గంలో రాజకీయాలు చేయొద్దు: వెంకట్ రాంరెడ్డి
రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకరిపై ఒకరు సవాళ్లు చేసుకొని దృష్టిని తమవైపు మళ్లించుకున్నారు. దాంతో బీజేపీ వైపు జనం చూడరని, పట్టించుకోరని అనుకున్నారు. రేవంత్, కేటీఆర్ కుట్రను ప్రజలు గమనించారని వివరించారు. ప్రధాని మోదీపై ప్రజల దృష్టిని మరల్చలేరని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసుల్లో లై డిటెక్టర్, డీఎన్ఏ టెస్ట్‌లను తాము ఏర్పాటు చేస్తామని లక్ష్మణ్ వివరించారు. రేవంత్, కేటీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే పరీక్షకు రావాలని లక్ష్మణ్ సవాల్ విసిరారు.
TG Politics: తప్పుడు మార్గంలో రాజకీయాలు చేయొద్దు: వెంకట్ రాంరెడ్డి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం