Share News

Lok Sabha Election 2024: భైంసా రోడ్ షో‌లో కేటీఆర్‌కు నిరసన సెగ

ABN , Publish Date - May 09 , 2024 | 08:25 PM

నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌కు(Lok Sabha Polling 2024) మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) అగ్రనాయకత్వం ప్రచారం దూసుకెళ్తుంది. బుధవారం నిర్మల్‌ జిల్లాలోని భైంసాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో అనుకోని పరిణామం ఎదురైంది.

Lok Sabha Election 2024: భైంసా రోడ్ షో‌లో కేటీఆర్‌కు నిరసన సెగ
KTR

నిర్మల్: నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌కు(Lok Sabha Polling 2024) మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) అగ్రనాయకత్వం ప్రచారం దూసుకెళ్తుంది. బుధవారం నిర్మల్‌ జిల్లాలోని భైంసాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో అనుకోని పరిణామం ఎదురైంది. ఒక్కసారిగా కేటీఆర్‌పై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. కేటీఆర్ ప్రసంగిస్తుండగా టమాటోలు, ఉల్లి గడ్డలు ఆందోళన కారులు విసిరారు. ఆందోళన కారులను పోలీసులు,సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ప్రసంగం ముగించుకొని నిర్మల్‌కు కేటీఆర్ బయలు దేరారు.


రాముని గుడి కడితే బీజేపీకి ఓటు వేయాలా..?

రాముని గుడి కడితే బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అలా అంటే మాజీ సీఎం కేసీఆర్ కూడా యాదాద్రి ఆలయాన్ని నిర్మించారని గుర్తుచేశారు. ఆధునిక దేవాలయాల లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ఎత్తి పోతల నిర్మించారని ఉద్ఘాటించారు. పదేళ్లలో చేసిందేమి చెప్పుకోలేకనే దేవుడి పేరుతో మోదీ ఓట్లు అడుగుతున్నారని విరుచుకుపడ్డారు. రాముడు అందరి వాడు, ఒక బీజేపీ నేతలకు మాత్రమే దేవుడు కాదని హితవు పలికారు. మత రాజకీయం చేస్తున్న బీజేపీని ప్రజలు చిత్తు చిత్తుగా ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలని కేటీఆర్ హెచ్చరించారు.

Loksabha Polls: పెద్దపల్లిలో కీ ఓటర్స్ వీరే..?

Read latest Telangana News And Telugu News

Updated Date - May 09 , 2024 | 08:39 PM