Lok Sabha Election 2024: కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: గోనె ప్రకాష్ రావు
ABN , Publish Date - May 08 , 2024 | 06:00 PM
లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ (KCR) కి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) అన్నారు. కేసీఆర్‌కి సిగ్గు, లజ్జ ఉందా ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ చావు నోట్లో తల ఎక్కడ పెట్టారని నిలదీశారు. ఆయన ప్రజల్లో నిరాదరణకు గురి అయ్యారని... కేసీఆర్ కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లారని చెప్పుకొచ్చారు.
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ (KCR) కి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) అన్నారు. కేసీఆర్‌కి సిగ్గు, లజ్జ ఉందా ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ చావు నోట్లో తల ఎక్కడ పెట్టారని నిలదీశారు. ఆయన ప్రజల్లో నిరాదరణకు గురి అయ్యారని... కేసీఆర్ కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లారని చెప్పుకొచ్చారు. ప్రజలను కేసీఆర్ మోసం చేయడానికి మళ్లీ బయటకు వచ్చారన్నారు. ఉద్యమకాలంలో ప్రజలను కేసీఆర్ ఏవిధంగా మోసం చేశారో ఇప్పుడు అలా తిరుగుతున్నారని చెప్పారు.
V.Hanumanthrao: మరోసారి మోదీ వస్తే... అదానీ, అంబానీలను కోటీశ్వరులను చేస్తారు తప్ప..
తెలంగాణ ఉద్యమ సమయంలో ఖమ్మంలో దొంగదీక్ష చేసి జ్యూస్ తీసుకున్నారని ఆరోపించారు. మల్టీ విటమిన్ జ్యూస్ తీసుకొని ఆయన దొంగ దీక్ష చేశారని అన్నారు. కేసీఆర్ దీక్షలో ఫ్లూయిడ్స్ వాడి దీక్ష చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్‌రావు అమాయకులను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చావుకు కేసీఆర్ కారణం అయ్యారని ఆరోపించారు. హరీష్ రావుకు 60 లీటర్ల పెట్రోల్ దొరికింది... కానీ అర్థరూపాయి అగ్గిపెట్టె దొరకలేదా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కి నీతి, నిజాయితీ ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని అన్నారు. దొంగ దీక్షపై కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Narendra Modi: రాష్ట్రపతిగా ముర్మును ఎందుకు వ్యతిరేకించారో తర్వాత అర్థమైంది
పదే పదే చావునోట్ల తల పెట్టిన అని కేసీఆర్ దొంగ మాటలు చెబుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని కేసీఆర్ ఒప్పుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్‍లో 100 శాతం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ జైలుకు వెళ్తారని చెప్పారు. ఓటుకు నోటు, ఫాం హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఎందుకు బ్రీఫ్ ఇచ్చారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు.
అందుకే చర్లపల్లి జైల్లో కేసీఆర్‌కు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని రేవంత్ అంటున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌లో అందరూ బాధ్యులేనని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అధికారులు జైలుకు వెళ్తారని అన్నారు. కేసీఆర్ తన తప్పులను తెలుసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ ఈ నాలుగు రోజులు చావు నోట్ల తలపెట్టిన అని మాట్లాడొద్దు...ప్రజలను మభ్య పెట్టొద్దని హితవు పలికారు. కేసీఆర్ ఎన్నడూ కూడా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు పెట్టలేదన్నారు. సర్పంచ్ ఎన్నికలకు కూడా కేసీఆర్ హెలికాప్టర్‌లో తిరిగారని.. గత పదేళ్లలో అన్ని ఎన్నికలకు హెలికాప్టర్‌లో తిరిగారని విమర్శించారు. ప్రజల్లో కేసీఆర్ మీద ఆదరణ తగ్గిన తర్వాత ఇప్పుడు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
Komatireddy Venkatreddy: వచ్చే పదేళ్లు రేవంతే సీఎం.. జూన్ 5కి వారంతా కాంగ్రెస్‌లోకి..
Read Latest Telangana News And Telugu News