Lok Sabha Election 2024: దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది.. మోదీపై కేసీఆర్ విసుర్లు
ABN , Publish Date - May 07 , 2024 | 09:18 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆరోపించారు.కామారెడ్డిలో కార్నర్ మీటింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కామారెడ్డి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆరోపించారు. కామారెడ్డిలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.కామారెడ్డి జిల్లా ఉండాలంటే కచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపీగా గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టే అస్కారం ఉంటుందని అన్నారు. మోదీ 150 హామీలు ఇచ్చారని..ఒక్కటీ కూడా ఎందుకు నెరవేర్చలేదని కేసీఆర్ ప్రశ్నించారు.
KTR: పిరమైన మోదీ గారూ.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..!
కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యేను గెలిపించారని మీ ఖాతాల్లో రూ. 30 లక్షలు వేశాడట.. వచ్చాయా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మోదీ వల్లే నవోదయ, మెడికల్ కాలేజీలు రాలేదని మండిపడ్డారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ అంటాడని విమర్శించారు. తెలంగాణ గురించి మోదీ దిక్కుమాలిన మాటలు మాట్లాడతారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే వేస్ట్.. మన నదులు పోవుడు తప్ప వచ్చేదేమీ లేదని అన్నారు. కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఓటేస్తే రైతుబంధు రాదన్నారు.
BJP: కాంగ్రెస్ వస్తే మళ్లీ దేశమంతా బాంబులు పేలుతాయి: రఘునందన్‌రావు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కరెంటు కోతలు పెరిగాయని.. మంచినీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తానని రేవంత్ అన్నారని.. ఇంకెప్పుడూ చేస్తారని ప్రశ్నించారు. ఆయన ఎక్కడికి పోతే అక్కడ దేవుడి మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు.. అదే ఆయన పని విమర్శించారు. అసమర్థులు, పని చేతకాని వారు అధికారంలో ఉంటే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. కామారెడ్డి చైతన్య వంతమైన గడ్డ అని తెలిపారు.
కాంగ్రెస్ మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మోదీ.. అబ్ కీ బార్ 400 పార్ అంటున్నారని.. ఆయనను మరోసారి గెలిపిస్తే దేశం ఇంకా నష్టపోతుందని విరుచుకుపడ్డారు. కేంద్రంలో ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జహీరాబాద్‌లో బీజేపీ మూడో స్థానంలో ఉందన్నారు. దేశంలో బీజేపీకి 200 ఎంపీ సీట్లు కూడా రావని కేసీఆర్ పేర్కొన్నారు.
Secunderabad: రోజుకో కండువా.. పూటకో గుర్తు
Read Latest Telangana News And Telugu News