Share News

Eggs: కోడిగుడ్లు అధికంగా తినే వారికి హెచ్చరిక.. ఈ విషయాలు తెలుసుకోకపోతే అంతే..

ABN , Publish Date - Sep 20 , 2024 | 07:37 AM

సాధారణంగా ఒక పూర్తి గుడ్డును తింటే మన శరీరానికి 13గ్రాముల ప్రోటీన్ అందుతుంది. అలాగే తెల్లసొన మాత్రమే తింటే 6గ్రాముల ప్రోటీన్ అందుతుంది. దీని ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు లభించమే కాకుండా, అనేక వ్యాధుల బారి నుంచి రక్షించబడతాం. అయితే వీటిని అధికంగా తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని వైద్యులు చెప్తున్నారు.

Eggs: కోడిగుడ్లు అధికంగా తినే వారికి హెచ్చరిక.. ఈ విషయాలు తెలుసుకోకపోతే అంతే..

ఇంటర్నెట్ డెస్క్: కోడిగుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అవి మన శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు అందించి పుష్టిగా ఉండేందుకు దోహదపడతాయి. ప్రభుత్వాలు కూడా రోజుకు ఒక గుడ్డు తినాలంటూ పెద్దఎత్తున ప్రచారాలు సైతం చేస్తున్నాయి. గుడ్లు తినడం ద్వారా మన శరీరానికి తగినంత ప్రోటీన్ అందుతుంది. అయితే కోడిగుడ్లు మంచిది కదా అని అతిగా తింటే మాత్రం తిప్పలు తప్పవని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. మన అనారోగ్య సమస్యలు, చేసే పనులను బట్టి తగినన్ని మాత్రమే తినాలని చెప్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


ఆరోగ్యంగా ఉన్న వారు ఎన్ని గుడ్లు తినొచ్చంటే..

సాధారణంగా ఒక పూర్తి గుడ్డును తింటే మన శరీరానికి 13గ్రాముల ప్రోటీన్ అందుతుంది. అలాగే తెల్లసొన మాత్రమే తింటే 6గ్రాముల ప్రోటీన్ అందుతుంది. దీని ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు లభించమే కాకుండా, అనేక వ్యాధుల బారి నుంచి రక్షించబడతాం. అయితే వీటిని అధికంగా తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని వైద్యులు చెప్తున్నారు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి వారానికి కేవలం ఏడు నుంచి పది గుడ్లు తినొచ్చని, అంతకు మించి తినొద్దని చెప్తున్నారు.


శారీరక శ్రమ చేసే వారు ఎన్ని గుడ్లు తినొచ్చంటే..

ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఒక గుడ్డు తింటే సరిపోతుంది. అయితే ఇదే సూత్రం వ్యాయామం చేసేవారు, అథ్లెట్‌లకు వర్తించదు. వారు ఎక్కువగా శారీరక శ్రమ చేస్తారు కాబట్టి సాధారణ వ్యక్తుల కంటే వారికి పోషకాహారం అధికంగా అవసరం అవుతుంది. అలాంటి వారు రోజుకు నాలుగు నుంచి ఐదు గుడ్లు వరకూ తినొచ్చని వైద్యులు చెప్తున్నారు. కోడిగుడ్డు మన శరీరంలోని మంచి కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహిస్తుంది. అలాగని ఇష్టం వచ్చినన్ని గుడ్లు తినకూడదని చెప్తున్నారు.


అనారోగ్య సమస్యలు ఉన్న వారు..

ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు ఒక గుడ్డు తినాలి. అయితే అనారోగ్య సమస్యలకు ఉన్నవారికి ఇది వర్తించదు. వారి సమస్యల దృష్ట్యా రోజుకు లేదా వారానికి ఎన్నిగుడ్లు తినాలనేది వైద్యులు సంప్రదించి తెలుసుకుంటే మంచిది. వారి సూచనల మేరకే గుడ్డును ఆహారంలో భాగం చేసుకోవాలి. డయాబెటిస్, హై బీపీ ఉన్న వారు వారానికి రెండు లేదా మూడు గుడ్లు తీసుకోవడం వల్ల ఎలాంటి హానీ జరగదని వైద్యులు చెప్తున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారు గుడ్డు జోలికి వెళ్లకపోవడం ఉత్తమమని, ఒకవేళ ఎప్పుడైనా తినాలనిపిస్తే కేవలం తెల్లసొన మాత్రమే తీసుకోవాలని చెప్తున్నారు. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కోడిగుడ్లు తినడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.


కోడిగుడ్లు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నప్పటికీ వీటిని అధికంగా తినడం మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. వారి అనారోగ్య సమస్యల దృష్ట్యా తగినన్ని మాత్రమే, వైద్యుల సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - Sep 20 , 2024 | 07:37 AM