Hair Care Tips: ఈ సమయంలో జుట్టుకు నూనె పెడితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది..!
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:29 PM
Hair Oil: జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే.. తలకు నూనె పెట్టాలి. జుట్టుకు నూనె రాయడం వల్ల స్కాల్ప్ పొడిబారదు, దాని వల్ల జుట్టు నిర్జీవంగా మారదు. కొంతమంది తల స్నానానికి ముందు నూనె అప్లై చేస్తే.. మరికొందరు తల స్నానం చేసిన తరువాత నూనె అప్లై చేస్తుంటారు.
Hair Oil: జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే.. తలకు నూనె పెట్టాలి. జుట్టుకు నూనె రాయడం వల్ల స్కాల్ప్ పొడిబారదు, దాని వల్ల జుట్టు నిర్జీవంగా మారదు. కొంతమంది తల స్నానానికి ముందు నూనె అప్లై చేస్తే.. మరికొందరు తల స్నానం చేసిన తరువాత నూనె అప్లై చేస్తుంటారు. తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు నూనె అప్లై చేస్తే జిగటగా ఉంటుందని కొందరు అలా చేస్తే.. జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని మరికొందరు ఇలా చేస్తారు.
వాస్తవానికి జుట్టుకు ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే నూనె వాడే సరైన విధానాన్ని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీ జుట్టుకు నూనెను సరిగ్గా అప్లై చేయకపోతే ఆ జుట్టు బలహీనంగా, నిర్జీవంగా మారుతుంది. మరి జుట్టుకు ఏ సమయంలో నూనెను అప్లై చేస్తే మేలు జరుగుతుంది. ఎప్పుడు రాయకూడదు? కీలక వివరాలు మీకోసం..
ఏ సమయంలో నూనె రాయాలి..
జుట్టుకు నూనె రాసుకోవాలంటే తలస్నానానికి ముందు అప్లై చేయడం ఉత్తమం. తల స్నానం చేయడానికి, జుట్టును కడగడానికి ముందు కనీసం 1 గంట ముందు నూనె రాయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయట. ఇది జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాకుండా.. నిర్జీవమైన జుట్టు సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.
జుట్టు కోసం ప్రోటీన్..
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్లు చాలా ముఖ్యం. షాంపూ ఉపయోగించడానికి ముందు కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల తలపై రక్షణ పొర ఏర్పడుతుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి ప్రోటీన్ లోపాన్ని తొలగిస్తాయి. జుట్టులో ప్రోటీన్ లేకపోవడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
జుట్టు పెరుగుతుంది..
షాంపూతో తల స్నానం చేయడానికి 1 గంట ముందు జుట్టుకు నూనె రాయడం వలన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. తలపై రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు కుదుళ్లు చురుగ్గా మారి పొడవుగా పెరుగుతుంది.
జుట్టు బలం..
జుట్టుకు నూనె రాయడం వల్ల బలంగా మారుతుంది. స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ మెరుగ్గా ఉండటం వల్ల వెంట్రుకల మూలాలకు ఆక్సిజన్, రక్తం బాగా సరఫరా అవుతుంది. ఇది జుట్టుకు సరైన పోషకాహారాన్ని అందించడంతో పాటు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
గమనిక: ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య నిపుణులు, బ్యూటీషీయన్స్ అందించిన సమాచారం మేరకు ఈ వార్తను పబ్లిష్ చేయడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.