Share News

Non-stick: నాన్ స్టిక్ పాత్రలు వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

ABN , Publish Date - Aug 05 , 2024 | 07:26 AM

ఆధునిక ప్రపంచంలో అందరూ నాన్ స్టిక్ పాత్రలు వాడేందుకు ఇష్టపడుతున్నారు. ఇవి చూసేందుకు ఆకర్షణీయంగా ఉండడం, అలాగే వంటగదిలో పెట్టినప్పుడు అందంగా కనిపించడంతో వీటి వాడకం వైపే మెుగ్గు చూపుతున్నారు. అయితే ఈ పాత్రల్లో చేసిన ఆహారం తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Non-stick: నాన్ స్టిక్ పాత్రలు వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

ఆధునిక ప్రపంచంలో అందరూ నాన్ స్టిక్ పాత్రలు వాడేందుకు ఇష్టపడుతున్నారు. ఇవి చూసేందుకు ఆకర్షణీయంగా ఉండడం, అలాగే వంటగదిలో పెట్టినప్పుడు అందంగా కనిపించడంతో వీటి వాడకం వైపే మెుగ్గు చూపుతున్నారు. అయితే ఈ పాత్రల్లో చేసిన ఆహారం తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నాన్ స్టిక్ పాత్రల్లో రెగ్యులర్‌గా వంట చేసుకుని తింటే టెఫ్లాన్ ఫ్లూ వస్తున్నట్లు హెచ్చరిస్తున్నారు. తాజాగా అమెరికాలో ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు తాజా అధ్యయనాల్లో గుర్తించినట్లు చెబుతున్నారు.


యుఎస్‌లో కేసులు నమోదు..

నాన్ స్టిక్ కుక్ వేర్‌ను 500 డిగ్రీల ఫారిన్ హీట్ వద్ద వేడి చేసినప్పుడు దానిలోని టెఫ్లాన్ కోటింగ్ దెబ్బతింటుంది. ఆ సమయంలో అందులోని కెమికల్ పార్టికల్స్ ఆహారంలో కలుస్తాయి. దాన్ని మనం తినడం వల్ల టెఫ్లాన్ ఫ్లూ వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అమెరికాలో ఇప్పటికే 3,600 రిపోర్టుల్లో పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ కెమికల్ కోటింగ్‌తో కనెక్ట్ అయిన ఫీవర్ కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. దీనికి టెఫ్లాన్ ఫ్లూగా పేరు పెట్టినట్లు తెలిపారు. 2023లోనూ దీనికి సంబంధించి 267కేసులు నమోదు అయినట్లు వాషింగ్టన్ పోస్టు ప్రచురించింది.


నాన్ స్టిక్ పాత్రలపై చిన్న గీత పడినా ప్రమాదమే..

పాత్రలపై టెఫ్లాన్ కోటింగ్ కాస్తపోయినా ఆ పాత్రలు వాడొద్దని వైద్యులు చెబుతున్నారు. అలాంటి పాత్రలను వేడి చేయడం వల్ల విషపూరితమైన కెమికల్స్ ఉత్పత్తి అవుతాయని వెల్లడించారు. వాటిని ఓవర్ హీట్ చేయడం చాలా డేంజర్ అని చెబుతున్నారు. అంతేకాకుండా కోటింగ్ పోయిన పాత్రలనూ అస్సలు వాడొద్దని హెచ్చరిస్తున్నారు. చిన్న గీత ఉన్న నాన్ స్టిక్ పాత్రలు వేడిచేసినప్పుడు 9వేల కెమికల్ పార్టికల్స్ ఆహారంలో కలుస్తాయని తెలిపారు. వీటిలో వండిన ఆహారం తింటే కిడ్నీ సంబంధిత సమస్యలు అలాగే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నాన్ స్టిక్ పాత్రలకు దూరంగా ఉండడం మంచిదని చెప్తున్నారు.

Updated Date - Aug 05 , 2024 | 07:35 AM