Share News

Terrorist Attack: చర్చిలు, పోలీస్ స్టేషన్లపై ఉగ్రదాడి.. 15 మంది మృతి, 20 మందికి గాయాలు

ABN , Publish Date - Jun 24 , 2024 | 06:50 AM

ఉగ్రవాదుల దాడులతో(Terrorist attack) రష్యా(Russia) ఉలిక్కిపడింది. రష్యా డాగేస్తాన్‌లోని రెండు ప్రధాన ప్రాంతాలైన డెర్బెట్, మఖచ్కలాలో ఆదివారం పెద్ద ఎత్తున ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు అందుకున్న సమాచారం ప్రకారం 15 మంది పోలీసులు మరణించగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు.

Terrorist Attack: చర్చిలు, పోలీస్ స్టేషన్లపై ఉగ్రదాడి.. 15 మంది మృతి, 20 మందికి గాయాలు
Terrorist attacks on russia

ఉగ్రవాదుల దాడులతో(Terrorist attack) రష్యా(Russia) ఉలిక్కిపడింది. రష్యా డాగేస్తాన్‌లోని రెండు ప్రధాన ప్రాంతాలైన డెర్బెట్, మఖచ్కలాలో ఆదివారం పెద్ద ఎత్తున ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు అందుకున్న సమాచారం ప్రకారం 15 మంది పోలీసులు మరణించగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రవాదులు ప్రధానంగా చర్చిలు, ప్రార్థనా స్థలాలు, పోలీసు స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి ఉగ్రదాడుల్లో పాల్గొన్న వ్యక్తులను నిర్ధారిస్తున్నామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రష్యా ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ తెలిపింది.


చర్చి ఫాదర్ హత్య

డెర్బెట్ చర్చిలోని ప్రార్థనా మందిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని డాగేస్తాన్ పబ్లిక్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ షామిల్ ఖదులేవ్ తెలిపారు. అదే సమయంలో మఖచ్‌కలలోని ఒక ప్రార్థనా సమావేశం, పోలీసు పోస్ట్‌పై కూడా కాల్పులు జరిగాయని వెల్లడించారు. ఆ క్రమంలో ఉగ్రవాదులు చర్చి ఫాదర్ నికోలాయ్‌ను గొంతు కోసి హత్య చేశారని అన్నారు. ఒక భద్రతా సిబ్బంది కూడా హత్యకు గురయ్యారని ఆయన చెప్పారు.

డాగేస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం చంపబడిన అధికారులలో ఒకరు పోలీసు డిపార్ట్‌మెంట్ చీఫ్ మావ్లుడిన్ ఖిదిరాన్‌బీవ్ కూడా ఉన్నారు. అదే సమయంలో ఈ ఘటనలో రష్యా వార్తా సంస్థ TASS ప్రకారం ఆరుగురు ఉగ్రవాదులు కూడా మరణించారు.


పెద్ద సంఖ్యలో ప్రజలు

పలువురు దుండగులు రష్యాలో సామాజిక పరిస్థితులను అస్థిరపరిచేందుకు ప్రయత్నించారని రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్ అధిపతి సెర్గీ మెలికోవ్ అన్నారు. ఈ క్రమంలో భద్రతా దళాలు ఉగ్రవాదులను గుర్తిస్తున్నాయని చెప్పారు. దాడి జరిగిన ప్రదేశం డాగేస్తాన్‌లోని డెర్బెట్ నగరంలో ఉండగా ఈ ప్రాంతం ముస్లిం ఆధిక్యత కలిగి ఉంది. ఇక ఉత్తర కాకసస్‌లో యూదు సమాజానికి చెందిన ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చిన మెలికోవ్, భయాన్ని వ్యాప్తి చేయడానికే ఉగ్రవాదులు ఇక్కడకు వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.


ఇది కూడా చదవండి:

Hinduja Family: భారతీయ సిబ్బందికి శునకాల కంటే తక్కువ జీతం.. హిందుజా ఫ్యామిలీలో నలుగురికి జైలుశిక్ష

బ్యాంక్‌, ఐటీ రంగాల్లో బేరి్‌షనెస్‌!


Read Latest International News and Telugu News

Updated Date - Jun 24 , 2024 | 07:50 AM