Shooting: పార్టీలో కాల్పులు.. ఇద్దరు మృతి, 19 మందికి గాయాలు
ABN , Publish Date - Jul 08 , 2024 | 08:39 AM
అగ్రరాజ్యం అమెరికా(america)లో మరోసారి కాల్పుల(shooting) ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా డెట్రాయిట్(Detroit)లోని బ్లాక్ పార్టీలో ఓ 22 ఏళ్ల వ్యక్తి కాల్పులు జరుపగా ఇద్దరు మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు.
అగ్రరాజ్యం అమెరికా(america)లో మరోసారి కాల్పుల(shooting) ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా డెట్రాయిట్(Detroit)లోని బ్లాక్ పార్టీలో ఓ 22 ఏళ్ల వ్యక్తి కాల్పులు జరుపగా ఇద్దరు మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. మిచిగాన్ రాష్ట్ర పోలీసులు సోమవారం ఈ ఘటనకు సంబంధించి సమాచారం ఇచ్చారు. అయితే ఈ కాల్పులకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన మిచిగాన్ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయడంలో డెట్రాయిట్ పోలీసు విభాగానికి సపోర్ట్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఫోరెన్సిక్ సిబ్బంది అందుబాటులో ఉన్న ఆధారాలను సేకరిస్తున్నారు.
ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అమెరికా మీడియా(us media) పేర్కొంది. కాల్పులు జరిగిన జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ప్రతినిధి మే జియోన్ ఈ ఘటనపై విచారణం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వారాంతంలో ఇలా జరగడం బాధాకరమైనదని అన్నారు. మా ఇంటికి అతి సమీపంలోనే ఈ హింసాత్మక ఘటన జరిగిందన్నారు. ఈ క్రమంలోనే బ్లాక్ పార్టీలకు సంబంధించి DPD కొత్త వ్యూహాన్ని రూపొందిస్తుందని డెట్రాయిట్ పోలీసులు వెల్లడించారు.
అమెరికాలో తుపాకీ హింసాత్మక(gun shots) ఘటనలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ చట్టాల అమలుపై పరిశోధకులచే అధ్యయనాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. దాదాపు ప్రతివారం కూడా యూఎస్‌లో కాల్పుల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే వీటిలో ఎక్కువగా మద్యం సేవించడం వంటి అనేక అంశాల కారణంగా ఇవి చోటుచేసుకుంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి:
PM Modi: నేడు రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. మొదటిసారిగా ఆ దేశానికి..
Adult Content: అశ్లీల వీడియోలు చూస్తున్నారా.. ఇకపై ఈ పని చేయాల్సిందే!
Read Latest International News and Telugu News