Rains: 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. మరో 11 రాష్ట్రాలకు అలర్ట్
ABN , Publish Date - Jul 08 , 2024 | 07:46 AM
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 3 రోజులపాటు వర్షాలు(rains) కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతోపాటు నేడు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో(11 states) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ(IMD) హెచ్చరికలు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 3 రోజులపాటు వర్షాలు(rains) కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్(andhra pradesh)లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉంది. రాయలసీమతోపాటు మరికొన్ని చోట్ల భారీ వర్షాలతోపాటు ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది.
ఎల్లో అలర్ట్
ఈ క్రమంలోనే తెలంగాణ(telangana)లోని దాదాపు అన్ని జిల్లాల్లో సోమ, మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐఎండీ హైదరాబాద్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో జూలై 8న ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, మల్కాజిగిరి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, నల్గొండ, మహబూబాబాద్, కొత్తగూడెంలలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది.
నేడు 11 రాష్ట్రాల్లో
ఈ నేపథ్యంలో నేడు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో(11 states) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ(IMD) హెచ్చరికలు జారీ చేసింది. వాటిలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవా ఉన్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్(uttarakhand)లో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్, బద్రీనాథ్ హైవే సహా 115కు పైగా రహదారులు మూతపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో చాలా రహదారులు మూసుకుపోగా, కొన్ని కొట్టుకుపోయాయి. ఇప్పటికే చార్ ధామ్ యాత్రను నిలిపివేశారు. దీంతో వివిధ ప్రాంతాల్లో 6 వేల మంది భక్తులు చిక్కుకుపోయారు.
నేషనల్ పార్క్‌లో
అసోంలో(assam) వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆదివారం వరదల్లో మరో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుపాను కారణంగా మృతుల సంఖ్య 78కి చేరింది. కజిరంగా నేషనల్ పార్క్‌లో 128 జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. 28 జిల్లాల్లోని 3,446 గ్రామాల్లో 22.74 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు.
ఇక హిమాచల్ ప్రదేశ్(himachal pradesh)లో కూడా భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడటంతో 76 చోట్ల రోడ్లు మూసుకుపోయాయి. జూలై 1 నుంచి జూలై 7 మధ్య రాష్ట్రంలో 72.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ కాలంలో సాధారణ వర్షపాతం కంటే ఇది 66% ఎక్కువ కావడం విశేషం. దీంతో 69 మంచినీటి పథకాలు, 34 విద్యుత్ సరఫరా పథకాలకు అంతరాయం ఏర్పడింది.
ఇది కూడా చదవండి:
చార్‌ధామ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత
Read Latest National News and Telugu News