Share News

UK Elections 2024: నన్ను క్షమించండి.. రిషి సునాక్ కీలక ప్రకటన..

ABN , Publish Date - Jul 05 , 2024 | 10:23 AM

UK Elections 2024: ఇంగ్లండ్ ఎన్నికలలో లేబర్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఎన్నికల ఫలితాల్లో 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్‌లో 326 చోట్ల మెజార్టీలో కొనసాగుతోంది. దీంతో ఇంగ్లండ్‌లో లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుత ప్రధాన మంత్రి రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటీవ్ పార్టీ కేవలం 68 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉండి ఘోర ..

UK Elections 2024: నన్ను క్షమించండి.. రిషి సునాక్ కీలక ప్రకటన..
UK Elections 2024

UK Elections 2024: ఇంగ్లండ్ ఎన్నికలలో లేబర్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఎన్నికల ఫలితాల్లో 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్‌లో 326 చోట్ల మెజార్టీలో కొనసాగుతోంది. దీంతో ఇంగ్లండ్‌లో లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుత ప్రధాన మంత్రి రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటీవ్ పార్టీ కేవలం 68 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉండి ఘోర పరాజయం పాలైంది. లేబర్ పార్టీ తరఫున కైర్ స్టార్మర్‌ బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.


ఇదిలాఉంటే.. ఓట్ల లెక్కింపు ట్రెండింగ్స్ లేబర్ పార్టీకి భారీ మెజార్టీ సూచించడంతో.. ప్రధాని రిషి సునాక్ తమ ఓటమిని అంగీకరించారు. ‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. వారి విజయానికి అభినందనలు తెలియజేస్తున్నాను. సర్ కైర్ స్టార్మర్‌కు ఫోన్ చేసి అభినందించాను. ఇప్పుడు లండన్ వెళ్తున్నాను. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఫలితాల అనంతరం మళ్లీ మాట్లాడుతాను. ప్రధాన మంత్రిగా దేశం కోసం నేను చేయాల్సిందంతా చేశాను.’ అని రిషి సునాక్ ఒక ప్రకటన విడుదల చేశారు.


లేబర్ పార్టీ భారీ మెజార్టీ..

ఎగ్జిట్ పోల్ ప్రకారం.. లేబర్ పార్టీకి భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. లేబర్ 410 సీట్లను గెలుచుకుంటుందని.. మెజారిటీకి అవసరమైన 326 మార్కును సునాయాసంగా దాటుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రకటించాయి. కాగా, లేబర్ పార్టీ ఇప్పటి వరకు 133 సీట్లలో విజయం సాధించగా.. కన్జర్వేటీ పార్టీ 18 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కేబినెట్ మంత్రులు సైతం ఓటమిపాలయ్యారు.

Also Read: అమరావతికి కేంద్ర సంస్థల క్యూ!


సీనియర్ కన్జర్వేటివ్‌లలో ఒకరైన కామన్స్ నాయకుడు పెన్నీ మోర్డాంట్ మాట్లాడుతూ.. ‘దేశ వ్యాప్తంగా నియోజకవర్గాలలో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూస్తోంది. రక్షణ కార్యదర్శి గ్రాంట్ షాప్స్ వెల్విన్ హాట్‌ఫీల్డ్‌లో ఓడిపోయారు. జస్టిస్ సెక్రటరీ అలెక్స్ చాక్ చెల్టెన్‌హామ్‌లో ఓడిపోయారు. మాజీ న్యాయ కార్యదర్శి సర్ రాబర్ట్ బక్లాండ్ కూడా తన సీటును కోల్పోయారు.’ అని అన్నారు.

Also Read: ఇదొక వింత రెస్టారెంట్.. ప్లేట్‌లను వాడరు..


సారీ చెప్పిన రిషి సునాక్..

బ్రిటన్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన రిషి సునాక్.. తన పార్టీకి క్షమాపణలు చెప్పారు. రిచ్‌మండ్‌లో తన మద్ధతుదారులను ఉద్దేశించి మాట్లాడిన రిషి సునాక్.. ‘నన్ను క్షమించండి. ఈ ఘోర పరాజయానికి నేనే బాధ్యత వహిస్తున్నాను.’ అని ప్రకటించారు. ఇంగ్లండ్‌లో కన్జర్వేటీవ్ పార్టీ ఓటమికి.. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థం, ప్రజా సేవలు నెమ్మదించడం, పడిపోతున్న జీవన ప్రమాణాలే ప్రధాన కారణాలుగా చెబుతున్నారు విశ్లేషకులు. ఇక ఇప్పుడు అధికారంలోకి వస్తున్న కైర్ స్టార్మర్ వీటిని ఎలా ఎదుర్కొంటారనేదే అసలైన సవాల్.

For More International News and Telugu News..

Updated Date - Jul 05 , 2024 | 11:23 AM