Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Sep 11 , 2024 | 07:09 AM

Breaking News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-09-11T22:01:38+05:30

    మంత్రి నారాయణ కామెంట్స్

    • విజయవాడ: రేపు మధ్యాహ్నానికి వరద నీరు బయటికి వెళ్లేలా ఏర్పాట్లు

    • అంబాపురం పైపుల రోడ్డులో ఉన్న వరద నీటిని బయటికి పంపించేందుకు 7 గండ్లు ఏర్పాటు

    • నీటి పంపింగ్ పనులను పర్యవేక్షించిన మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, మంత్రి నారాయణ కుమార్తె సింధూర

    • కొన్ని ప్రాంతాల్లో మినహా దాదాపు అన్ని డివిజన్లలో వరద నీరు తగ్గిపోయింది.

    • మరో 24 గంటల్లో మొత్తం నీరు బయటికి వెళ్ళిపోయేలా ఏర్పాట్లు చేశాం.

    • వరద తగ్గిన అన్ని ప్రాంతాల్లో శానిటేషన్ కూడా పూర్తికావస్తుంది.

  • 2024-09-11T22:00:16+05:30

    పరారీలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయపాల్

    • నోటీసులు ఇచ్చేందుకు వెళ్తే ఇంటికి వేసి ఉన్న తాళం

    • ముందస్తు బెయిల్ పొందేందుకు విజయాపాల్ అనర్హుడని హైకోర్టులో వాదనలు

    • రఘురామ కృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హై కోర్టును ఆశ్రయించిన విజయ పాల్

    • హైకోర్టులో విచారణ, దర్యాప్తుకు సహకరించని వాళ్ళు ముందస్తు బెయిల్‌కు అనర్హులు అని ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లుథ్రా వాదనలు

    • కేసులో బాధితుడిగా తనకు ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని రఘురామ రాజు పిటిషన్

    • రఘురామ రాజు ఇంప్లీడ్ పిటిషన్ అనుమతించిన హైకోర్ట్

    • వాదనలు వినిపించేందుకు సమయం కావాలని కోరిన రఘురామ రాజు తరపు న్యాయవాది

    • కేసు విచారణ వారం రోజులకు వాయిదా.

  • 2024-09-11T21:58:48+05:30

    • మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి

    • హైదరాబాద్: శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్నిక

    • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనా చారిని గుర్తిస్తూ బులిటెన్ విడుదల

  • 2024-09-11T20:40:09+05:30

    • కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

    • 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ వర్తింపు

    • 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది

    • రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందే అవకాశం

  • 2024-09-11T18:31:38+05:30

    ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17

    • ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17ను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం

    • జాతీయ జెండాను ఎగరవేయనున్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు

    • కాంగ్రెస్ పాలనలో సెప్టెంబర్17ను ప్రజా పాలన దినోత్సవంగా అధికారిక కార్యక్రమాలు

    • 32 జిల్లాల వారీగా పాల్గొనేవారి లిస్ట్ విడుదల, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

    • అన్ని ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థల కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం ఆదేశం.

    • బీఆర్ఎస్ హయాంలో జాతీయ సమైక్యత దినోత్సవంగా సెప్టెంబర్17.

  • 2024-09-11T18:25:33+05:30

    నివేదిక అందజేత

    • ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్.

    • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టంపై ప్రాథమిక నివేదిక సమర్పించిన శివరాజ్ సింగ్.

    • ప్రభావిత ప్రాంతాల్లో త్వరలో కేంద్ర బృందం పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తోంది: శివరాజ్ సింగ్ చౌహాన్.

    • అమిత్ షాను కలిసి నివేదిక సమర్పించిన విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించిన శివరాజ్ సింగ్ చౌహాన్.

  • 2024-09-11T18:05:24+05:30

    అరుదైన అవకాశం

    • ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఛైర్మన్‌గా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

    • ఢిల్లీలో జరిగిన 2వ ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్‌లో ఎన్నిక

    • ఏపీఎంసీ చైర్మన్‌‌గా రామ్మోహన్ నాయుడు పేరు ప్రతిపాదించిన సింగపూర్

    • భూటాన్ దేశం మద్దతు.. రామ్మోహన్ నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్న మిగిలిన దేశాల ప్రతినిధులు

    • దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని బాధ్యతగా స్వీకరిస్తా: రామ్మోహన్ నాయుడు

    • రామ్మోహన్ నాయుడుని ఏకగ్రీవంగా ఎన్నుకున్న 40 సభ్య దేశాల ప్రతినిధులు

    • పౌర విమానయానాన్ని మరింత సులభతరం చేస్తానని రామ్మోహన్ నాయుడు ప్రకటన

    • విమానయాన రంగాన్ని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకొస్తా

    • సభ్య దేశాల మధ్య రవాణా సులభతరం చేసేందుకు కృషి చేస్తా

  • 2024-09-11T17:57:57+05:30

    గణేశ్ నిమజ్జనం

    • హైదరాబాద్: ట్యాంక్ బండ్‌పై కోలాహలంగా నిమర్జనం

    • ఐదో రోజు జోరుగా వినాయక నిమజ్జనాలు

    • నిమజ్జనంపై ఆంక్షలు అని తెలియడంతో జనం ఆందోళన

    • కోర్టు ఆదేశాలతో యథావిధిగా నిమజ్జనం

      ganesh-1.jpg

  • 2024-09-11T16:26:43+05:30

    • ఊరట లభించేనా

    • ఢిల్లీ: సుప్రీంకోర్టుకు వైసీపీ నేత జోగి రమేశ్

    • చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేశ్‌కు ముందస్తు బెయిల్ నిరాకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

    • ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసిన జోగి రమేశ్

    • రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించే అవకాశం

  • 2024-09-11T15:35:51+05:30

    తమిళ హీరో జీవాకు ప్రమాదం

    • చెన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద ఘటన

    • బైక్‌ను తప్పించబోయి బారికేడ్‌ను ఢీకొన్న జీవా కారు

    • ప్రమాదంతో నుజ్జునుజ్జయిన కారు ముందు భాగం

      car.jpg

  • 2024-09-11T13:09:12+05:30

    Big Breaking: స్టార్ హీరోయిన్ తండ్రి ఆత్మహత్య..

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో గల తన నివాసం పై నుంచి ఆయన దూకినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, ఎలాంటి సూసైడ్ నోటీసు లభించలేదని పోలీసులు చెప్పారు. అనిల్ అరోరా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. కాగా, ఘటనా సమయంలో మలైకా అరోరా పూణెలో ఉన్నారు. విషయం తెలుసుకున్న మలైకా.. ముంబైకి బయలుదేరారు.

  • 2024-09-11T11:55:19+05:30

    హైకోర్టులో జగన్‌కు రిలీఫ్..

    • అమరావతి: పాస్‌పోర్ట్ విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు హైకోర్టులో కొంతమేర రిలీఫ్ దొరికింది.

    • విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్ట్ విధించిన పాస్‌పోర్ట్ కాలపరిమితిని ఒక ఏడాది నుంచి 5 ఏళ్లకు పెంచింది.

    • ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది.

    • అయితే, విజయవాడ కోర్టు ఆదేశించిన విధంగా ప్రజాప్రతినిధుల కోర్టుకు స్వయంగా వెళ్లి రూ. 20 వేల పూచీకత్తు చెల్లించాలని ఆదేశించింది.

    • ట్రయల్ కోర్టు విధించిన మిగతా షరతులన్నీ యధావిధంగా ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.

  • 2024-09-11T11:00:15+05:30

    తెలంగాణ పోలీసుల దాతృత్వం.. 11 కోట్ల విరాళం..

    వరద బాధితులకు తెలంగాణ పోలీసులు అండగా నిలిచారు. వారికి సహాయార్థం సీఎంఆర్ఎఫ్‌కు భారీగా విరాళం అందజేశారు. వరద బాధితులకు సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పోలీసులు తమ ఒక్క రోజు జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన మొత్తం రూ. 11,06,83,571 చెక్కును డీజీపీ జితేందర్, పోలీస్ ఉన్నతాధికారులు కలిసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.

  • 2024-09-11T10:53:43+05:30

    ఓ ఇంట్లో అడ్డంగా బుక్కైన యువతీ యువకులు..

    • గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రెవ్ పార్టీని భగ్నం చేసిన ఎస్ఓటి పోలీసులు.

    • గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ఓ గెస్ట్ హౌస్‌లో రేవు పార్టీ నిర్వహించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.

    • రేవ్ పార్టీలో ఆరుగురు అమ్మాయిలు, 12 మంది అబ్బాయిలు.

    • గంజాయి లిక్కర్ తాగుతుండగా పట్టుకున్న పోలీసులు.

    • వారి నుంచి 45 గ్రాముల గంజాయి ఫ్యాకేట్స్, ఇ-సిగిరెట్స్, మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు.

    • వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించిన మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు.

    • కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు.

    • 18 మందికి 41 నోటీసులు ఇస్తామని తెలిపిన గచ్చిబౌలి పోలీసులు.

  • 2024-09-11T09:50:41+05:30

    సీఎం రేవంత్‌తో ఏపీ డీసీఎం పవన్ కల్యాణ్ భేటీ..

    • హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.

    • తాను ప్రకటించినట్లుగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. కోటి విరాళం అందించారు పవన్ కళ్యాణ్.

    • ఇందుకు సంబంధించిన చెక్‌ను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు పవన్ కల్యాణ్.

  • 2024-09-11T09:21:58+05:30

    విశాఖ స్టీల్ ప్లాంటు అంశంపై ఢిల్లీలో కీలక సమావేశం

    • నేడు విశాఖ స్టీల్ ప్లాంటుపై ఢిల్లీలో కీలక సమావేశం.

    • స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం సహా వివిధ ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి.

    • ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు.

    • పెట్టుబడుల ఉపసంహరణపై రాష్ట్ర ప్రభుత్వం సహా పలు రాజకీయ పార్టీల వ్యతిరేకత.

    • నష్టాల్లో కొనసాగుతున్న స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలని గతంలో నిర్ణయం.

    • స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును నిర్ణయించేందుకు ఢిల్లీలో సమీక్ష.

    • ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి అధ్యక్షతన సమావేశం.

    • సమావేశానికి హాజరుకానున్న ఆర్ఐఎన్ఎల్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) డైరెక్టర్లు.

  • 2024-09-11T09:14:41+05:30

    వినాయక నిమజ్జనంపై కీలక సూచనలు..

    • అమలాపురం: గోదావరి వరదల నేపథ్యంలో వినాయక నిమజ్జనాలు అధికారులు సూచించిన ప్రదేశాలలోనే చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు.

    • వరద సమయంలో సుడిగుండాలు ఏర్పడతాయి కాబట్టి అధికారులు నిర్దేశించిన ప్రదేశంలోనే వినాయక నిమజ్జనాలు చేయాలి.

    • మూడు అడుగుల కన్నా ఎత్తు ఏర్పాటు చేసిన విగ్రహాలను గుర్తిస్తున్నాము.

    • వినాయక నిమజ్జనం అందరూ ఎంతో ఆనందంగా చేసుకుంటారు. దానికోసం ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది.

    • నిమజ్జనం కోసం నిర్దేశించిన ప్రదేశాలలో లైఫ్ జాకెట్టు, గజతగాళ్లు, అవసరాన్ని బట్టి క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది.

    • వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆనందంగా గణేష్ నిమజ్జనం జరుపుకునేందుకు అధికారులకు సహకరించండి.

  • 2024-09-11T07:39:45+05:30

    వశిష్ట గోదావరి ఉగ్రరూపం

    • పశ్చిమగోదావరి ఆచంట మండలంలో వశిష్ట గోదావరి ఉగ్రరూపం.

    • ఆచంట మండలంలో లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

    • అనగార్లంక, పుచ్చలంక అయోధ్య లంక, మర్రి మూల, కోడేరు లంక, పెదమల్లం లంక గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు.

    • ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల మధ్య రాకపోకలు బంద్.

    • లంక గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలు.

  • 2024-09-11T07:37:36+05:30

    నేడు కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..

    • కాకినాడ: నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక.

    • మధ్యాహ్నం 1.45గంటలకు సామర్లకోటలో దిగనున్న సీఎం.

    • అక్కడినుంచి వరదలో చిక్కుకున్న కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో పర్యటన.

    • బాధితులతో ముఖాముఖి.

    • అనంతరం సామర్లకోటలో వరద ప్రభావం పై ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన.

    • ఆతర్వాత అధికారులతో సమీక్ష.

  • 2024-09-11T07:15:27+05:30

    ఏపీలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి..

    Road-Accident.jpg

    • తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

    • జీడిగింజలు లోడుతో వెళ్తున్న డిసిమ్ లారీ బోల్తా.

    • ప్రమాదంలో ఏడుగురు మృతి.

    • ఒక వ్యక్తికి గాయాలు.

    • టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుండి జీడిగింజల లోడుతో నిడదవోలు మండలం తాడిమల్ల వెళ్తుండగా ఘటన.

    • చిన్నయగూడెం శివారులో అదుపు తప్పి పంట కాలువలో బోల్తా పడిన వాహనం.

    • వ్యాన్‌లో 10 మంది ప్రయాణం.

    • జీడీ గింజల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక ఏడుగురు మృతి.

    • కేబిన్లో ఉన్న వారు సురక్షితం.

    • స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీసిన దేవరపల్లి పోలీసులు.

    • మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

    మృతులు నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామానికి చెందినవారు..

    1. తమ్మి రెడ్డి సత్యనారాయణ (45)

    2. దేశాభత్తుల వెంకటరావు (40)

    3. బొక్కా ప్రసాద్ (32)

    4. పెనుగుర్తి చిన్న ముసలయ్య (35)

    5. కత్తివ కృష్ణ (40)

    6. కత్తివ సత్తిపండు (40)

    7. తాడి కృష్ణ (45)

  • 2024-09-11T07:11:35+05:30

    నేడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

    • అమరావతి: కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలో అధిక వర్షాలు, వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వస్తున్న కేంద్ర ప్రభుత్వం.

    • గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో కృష్ణాజిల్లా వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నష్టం వివరాలు తెలపనున్న అధికారులు.

    • ఎన్టీఆర్ జిల్లా కష్టానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు.

    • ఉమ్మడి కృష్ణా జిల్లాలో క్షేత్రస్థాయిలో వరద వల్ల దెబ్బ తిన్న పంట పొలాలు, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించనున్న కేంద్ర బృందం.

  • 2024-09-11T07:09:19+05:30

    పొంగి ప్రవహిస్తున్న వాగులు..

    • అల్లూరి జిల్లా.. విలీన మండలాల్లో శబరి, సీలేరు ఉపనదులతో పాటు పొంగి ప్రవహిస్తున్న వాగులు.

    • భద్రాచలం-కూనవరం మధ్య నిలిచిపోయిన రాకపోకలు.

    • పాఠశాలలకు సెలవులు.

    • మూడు రోజుల నుంచి నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు రాకపోకలు.

    • కూనవరంలో శబరి, గోదావరి సంగమం వద్ద ఉన్న వంతెనను తాకిన వరద నీరు.

    • పొంగిప్రవహిస్తున్న సోకిలేరు, చంద్రవంక, చీకటివాగు, కుయుగూరు వాగులు.

    • చింతూరు మండలంలో 22 గ్రామాలు జలదిగ్బందం.

    • వీఆర్‌ పురం మండలం మండలంలోని ప్రధాన రహదారులపై ప్రవహిస్తున్న వరదనీరు 30 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు.