-
-
Home » Mukhyaamshalu » Today Latest Breaking News and Live updates Telangana Assembly Parliament Winter Session Live in Telugu 19th December 2024 Siva
-

Today Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Dec 19 , 2024 | 10:25 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2024-12-19T14:04:11+05:30
రాహుల్ గాంధీకి కేటీఆర్ మరో సంచలన లేఖ..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు.
అదానీ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ద్వంద వైఖరి ఎందుకు అవలంబిస్తోంది.
మీరేమో.. మోదీ, అదానీ ఒకటే అంటున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం అదానీకి రెడ్ కార్పెట్ వేస్తున్నాడు.
రూ. 100 కోట్లు తిరిగి ఇచ్చుడు కాదు. తెలంగాణలో కుదుర్చుకున్న 12,400 కోట్ల రూపాయలు ఒప్పందాల్ని రద్దు చేసుకోవాలి.
అప్పుడే అదానీ విషయంలో మీ స్టాండ్‌ను నమ్ముతాం.
తెలంగాణలో అదానీ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు.
అదానీ విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటో మీ సొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకోండి.
ప్రధాని విషయంలో మీ ద్వంద వైఖరి పట్ల తెలంగాణ సమాజం నవ్వుతోంది.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని చర్చించండి.
-
2024-12-19T13:45:51+05:30
రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్..
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
పార్లమెంట్ తోపులాట ఘటనపై పోలీసులకు బిజెపి ఫిర్యాదు.
ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బిజెపి ఎంపీలు అనురాగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్.
ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.
-
2024-12-19T13:08:11+05:30
రాహుల్ గాంధీ భౌతిక హింసకు పాల్పడ్డారు..
పార్లమెంట్ తోపులాట ఘటనపై స్పందించిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవల్.
తోపులాటలో ఇద్దరు నేతలకు గాయాలయ్యాయి.
తోపులాట ఘటన పై 4-5 మంది ఎంపీలు ఫిర్యాదు చేశారు.
నిరసన తెలిపే హక్కు అందరికి ఉంది.
రాహుల్ గాంధీ భౌతిక హింసకు పాల్పడ్డారు.
కాంగ్రెస్ అంబేద్కర్‌కి ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉంది.
ఎప్పుడూ ఆయన్ను అవమానిస్తూనే ఉన్నారు.
ఆసుపత్రి నివేదిక ప్రకారం తోపులాట ఘటన బాద్యులపై చర్యలు తీసుకుంటాం.
-
2024-12-19T12:12:11+05:30
శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్..
రుణమాఫీపై సీఎం ఇచ్చిన హామీలపై విమర్శలు.
తేదీలతో సహా.. రేవంత్ రెడ్డి కామెంట్స్‌ను గుర్తుచేసిన కవిత.
ఏడుపాయల దుర్గమ్మ - ఏప్రిల్ 20, 2024
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి - ఏప్రిల్ 21, 2024
బాసర సరస్వతి అమ్మవారి - ఏప్రిల్ 22, 2024
జోగులాంబ అమ్మవారు -ఏప్రిల్ 23, 2024
రామప్ప దేవాలయం శివయ్య - ఏప్రిల్, 2024
ఆర్మూర్ సుద్ధలగుట్ట - మే 9, 2024
రైతులకు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ళ సాక్షిగా హామీ ఇచ్చారు.
సీఎం హామీని నెరవేర్చనందుకే ఆకుపచ్చ కండువాలతో మండలికి వచ్చాం.
హామీని నెరవేర్చనందుకు మీద్వారా మా నిరసన తెలియజేస్తున్నాం.
-
2024-12-19T12:07:19+05:30
పేర్ని నాని భార్య అరెస్ట్ తథ్యమా..!
కృష్ణా: మాజీమంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.
తమ గోడౌన్‌లలో రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధపై కేసు నమోదు చేశారు పోలీసులు.
తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరిన ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్.
ఈ లోపు జయసుధను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తొందర పాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇవ్వాలని కోరిన జయసుధ తరపు న్యాయవాదులు.
అలా ఇవ్వలేమని చెప్పిన కోర్ట్.
తమకు సోమవారం వరకు సమయం కావాలని కోరిన ప్రాసిక్యూటిన్స్ జాయింట్ డైరెక్టర్.
విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన బందర్ కోర్ట్.
-
2024-12-19T12:04:48+05:30
మధ్యాహ్నం 12.30 గంటలకు అసెంబ్లీలో కాంగ్రెస్ నేతల నిరసన
అసెంబ్లీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నిరసన తెలపనున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
అంబేద్కర్‌పై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు.
అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు.
-
2024-12-19T12:03:32+05:30
శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 317జీవో తెచ్చుకున్నాం.
317 జీవో వల్ల సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు.
సమస్యలు ఉన్నాయని చెప్పడమే కాదు పరిష్కారం కూడా చూపండి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది మీరు ఏం చేస్తున్నారు.
ఇంకా మమ్మల్ని పాయింటవుట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది.
-
2024-12-19T11:59:14+05:30
ఢిల్లీ: లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా.
విపక్షా ఎంపీల ఆందోళన నడుమ లోక్ సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా.
-
2024-12-19T11:57:41+05:30
జమ్మలమడుగులో ఘోరం..
కడప : జమ్మలమడుగులో ధారుణ ఘటన.
ముద్దనూరు రోడ్డులోని నీళ్ల ట్యాంక్ సమీపంలో ముళ్లపొదల్లో పసికందు.
ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు.
తెల్లవారుజామున ఆరుబయ టకు వెళ్లిన నెల్సన్ అనేయువ కుడికి పసికందు ఏడుపు వినిపించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు.
పసికందును అక్కున చేర్చుకొని, అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.
పసికందును వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వాఆసుపత్రికి తరలింపు.
-
2024-12-19T10:52:51+05:30
అంబటి రాంబాబుపై కేసు.. ఎందుకంటే..
గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు.
పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో అంబటితో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు.
పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు.
తమ ఫిర్యాదులపై కేసు నమోదు చేయాలని పట్టాబిపురం స్టేషన్‌లో నిరసన.
నిరసనలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, పలువురు వైసిపి నేతలు.
-
2024-12-19T10:51:31+05:30
జీడిమెట్ల: కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు సీజ్..
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ బస్తీలో ఓ కిరణా షాప్‌పై బాలనగర్ ఎస్ఓటి పోలీసుల దాడి.
కిరాణా షాప్‌లో అక్రమంగా నిల్వ చేసిన (61ఫ్యాకెట్ల), 13కేజిల గంజాయి చాక్లెట్ల సీజ్.
దుకాణా నిర్వాహకుడు బీహర్‌కి చెందిన సునీల్ కుమార్ ఝా అరెస్ట్.
13కేజిల గంజాయి(2400)చాక్లెట్లు సీజ్.
వలస కూలీలకు ఒక్కో గంజాయి చాక్లెట్ 40 రుపాయలకు అమ్ముతున్నట్లు వెల్లడి.
సీజ్ చేసిన గంజాయి చాక్లెట్ల విలువ రూ. 1 లక్ష ఉంటుందని పోలీసుల అంచనా.
జగద్గిరిగుట్ట పియస్‌కి అప్పగింత..కేసు నమోదు.
-
2024-12-19T10:32:28+05:30
ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్ ఆగ్రహం..
ప్రతిపక్షాలపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్.
మనం పెట్టుకున్న రూల్స్ మనమే బ్రేక్ చేసుకుంటున్నామన్న స్పీకర్.
సభలో ప్ల కార్డులతో రావడం నినాదాలు ఇవ్వడం మంచి పద్ధతి కాదన్న స్పీకర్.
-
2024-12-19T10:31:31+05:30
క్వశ్చన్ అవర్‌లో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటన్న హరీష్ రావు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నోత్తరాల్లో మాట్లాడడంపై హరీష్ రావు అభ్యంతరం.
హరీష్ రావు ఏ హోదాలో అడుగుతున్నారని ప్రశ్నించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
హరీష్ రావు అందరిలాగే ఎమ్మెల్యే.
ఎల్వోపి లీడర్ సభకు రాడు.
హరీష్ రావు ఎల్వోపి కాదు.. డిప్యూటీ లీడర్ కూడా కాదు.
ఆయనకు పదే పదే మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నారు.
-
2024-12-19T10:25:12+05:30
తెలంగాణలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
అసెంబ్లీకి గంట ముందుగానే వచ్చిన సీఎం రేవంత్
భూ భారతి, రైతు బరోసా,తదితర అంశాలపై సభలో చర్చ ఉన్న నేపథ్యంలో పార్టీ నేతలు, అధికారులతో డిస్కస్ చేయనున్న సీఎం