Share News

Congress: ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వివాదాస్పద హామీ

ABN , Publish Date - May 10 , 2024 | 09:09 AM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు ప్రజలకు ఇస్తున్న హామీలు శృతిమించుతున్నాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఏకంగా ఒక ముందడుగేసి.. ఇద్దరు భార్యలకు స్కీం ప్రకటించారు.

Congress: ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వివాదాస్పద హామీ

రత్లాం: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు ప్రజలకు ఇస్తున్న హామీలు శృతిమించుతున్నాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఏకంగా ఒక ముందడుగేసి.. ఇద్దరు భార్యలకు స్కీం ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

కేంద్ర మాజీ మంత్రి, రత్లాం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కాంతిలాల్ బహురియా గురువారం సైలనాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వస్తే మహాలక్ష్మీ పథకం కింద ఇచ్చే రూ.లక్షను ఇద్దరు భార్యలుంటే ఇరువురికీ వర్తింపజేస్తామని వివాదాస్పద హామీ చేశారు.


ఈ కామెంట్స్ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. కాంతిలాల్ వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఎన్నికల కమిషన్ కాంతిలాల్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.

"కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏటా ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్ష వేస్తామని హామీ ఇచ్చాం. ఇద్దరు భార్యలు ఉంటే ఇరువురికీ చెరో లక్ష చొప్పున రూ.2 లక్షలు వేస్తాం" అని కాంతిలాల్ అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా భూరియా కాంతిలాల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఎన్నికల సంఘానికి ట్యాగ్ చేశారు. కాంతిలాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. రత్లాంలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.

Read Latest News and National News Click Here..

Updated Date - May 10 , 2024 | 09:09 AM