Share News

Rains: సముద్రాన్ని తలపిస్తున్న ముంబై మహానగరం..

ABN , Publish Date - Jul 08 , 2024 | 09:36 AM

ముంబయి మహానగరం సముద్రంగా మారింది. భారీ వర్షాలతో ఎక్కడ చూసినా వాణిజ్య నగరంలోని రహదారులపై వరద నీరు కనిపిస్తోంది. వర్షం నీటిలో వాహనాలు మునిగిపోతున్నాయి.

Rains: సముద్రాన్ని తలపిస్తున్న ముంబై మహానగరం..
Heavy Rains

ముంబయి మహానగరం సముద్రంగా మారింది. భారీ వర్షాలతో ఎక్కడ చూసినా వాణిజ్య నగరంలోని రహదారులపై వరద నీరు కనిపిస్తోంది. వర్షం నీటిలో వాహనాలు మునిగిపోతున్నాయి. ముంబై (Mumbai) మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. రుతుపవనాలు విస్తరించడంతో మహారాష్ట్ర రాజధాని ముంబైలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లపై వరద నీరు కనిపిస్తోంది. రోడ్ల నుండి రైలు పట్టాల వరకు అన్ని చోట్లా నీరు నిల్వ ఉంది. దీంతో వాహనాలు గమ్యస్థానాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. పలు రైళ్లను రైల్వేశాఖ (Indian railway)దారిమళ్లించింది. రైలు పట్టాలపై భారీగా నీరు, మట్టి చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరో రెండు రోజులపాటు ముంబై మహానగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండి తెలిపింది.

కెనడాలో ఇళ్ల సంక్షోభం


కూలిన చెట్లు..

భారీ వర్షాల కారణంగా ముంబై మహానగరంలోని పలు రైల్వేస్టేషన్లలో పట్టాలపై చెట్టు పడిపోవడంతో కసర, టిట్వాలా స్టేషన్ల మధ్య లోకల్ రైలు సర్వీసులను నిలిపివేశారు. అట్గావ్, థాన్సిట్ స్టేషన్ల మధ్య ట్రాక్‌లపై నీరు, మట్టి పేరుకుపోయింది. ఈ మార్గంలో రైల్వే ట్రాక్‌లపై చెట్టు పడిపోయాయి. దీంతో వశింద్ రైల్వే స్టేషన్‌ను అధికారులు బ్లాక్ చేశారు. ఈ స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించారు.

చార్‌ధామ్‌ యాత్ర తాత్కాలిక నిలిపివేత


అధ్వాన్నంగా రోడ్లు..

రైల్వేస్టేషన్‌తో పాటు రోడ్ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. కొన్ని అడుగుల ఎత్తు వరకు నీరు నిండిపోయింది. రోజూ వాహనాలు నడిచే రోడ్లపై నీరు నిలవడంతో వాహనాలు మునిగిపోతున్నాయి. ఎక్కువసేపు ట్రాఫిక్ జామ్‌‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, ముంబైలోని అన్ని బీఎంసీ(బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్), ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ హర్షణీయం: వెంకయ్య


రెయిన్ అలెర్ట్

రానున్న మూడు నాలుగు రోజుల పాటు ముంబై వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 8 నుంచి 10వ తేదీ వరకు మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడాలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముంబై, దాని పరిసర ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురవచ్చని తెలిపింది. పూణే, నాసిక్, సతారా, కొల్హాపూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఛత్రపతి సంభాజీనగర్, జాల్నా, లాతూర్, ధరాశివ్, నాందేడ్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ముంబైతో పాటు థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.


రష్యాపై ఉక్రెయిన్‌ దాడులు.. వొరెనెజ్‌లో ఎమర్జెన్సీ

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 08 , 2024 | 09:36 AM