Fire Accident: డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం..ఘటనా స్థలానికి 10 ఫైర్ ఇంజన్లు
ABN , Publish Date - Apr 22 , 2024 | 06:39 AM
ఢిల్లీ(Delhi) ఘాజీపూర్(Ghazipur)లోని డంపింగ్ యార్డు(landfill)లో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భారీగా నల్లని పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
ఢిల్లీ(Delhi) ఘాజీపూర్(Ghazipur)లోని డంపింగ్ యార్డు(landfill)లో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భారీగా నల్లని పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. భారీగా మంటలు ఎగిసిపడటంతో దాదాపు 10 అగ్నిమాపక శకటాలు(Fire engines) మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత 12 గంటలుగా డంపింగ్ యార్డు నుంచి మంటలతో పాటు పొగలు కూడా వ్యాపిస్తున్నాయి.
వేడి, పొడి వాతావరణమే అగ్నిప్రమాదానికి కారణమని అధికారులు(officers) చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే అది చల్లారడానికి సమయం పట్టవచ్చని, పై నుండి మంటలు ఆరిపోయిన తర్వాత కూడా, లోపల మంటలు చాలా కాలం పాటు మండుతూనే ఉంటాయని అధికారులు అంటున్నారు.
మంటల నుంచి వెలువడిన పొగ కారణంగా సమీప కాలనీలలో నివసించే ప్రజలు కళ్ల మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. దీంతో అక్కడ నివసించే వారి జీవనం కష్టంగా మారిందని స్థానిక నివాసులు పేర్కొన్నారు. ప్రభుత్వం దృష్టి కేవలం ఎన్నికలపైనే ఉందని, మేము ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ మేయర్(delhi mayor) షెల్లీ ఒబెరాయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఘాజీపూర్ ల్యాండ్‌ఫిల్ సైట్‌లో అగ్ని ప్రమాదంలో మంటలు చెలరేగాయని, అధికారులంతా అక్కడికక్కడే ఉన్నారని పేర్కొన్నారు. పరిస్థితి అదుపులో ఉందన్నారు. అంతేకాదు ఘాజీపూర్ డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదంపై రాజకీయాలు కూడా ప్రారంభమయ్యాయి.
గత ఏడాది డిసెంబర్ 31లోగా ఘాజీపూర్ డంపింగ్ యార్డు స్థలాన్ని ఖాళీ చేస్తామని ఆప్ హామీ ఇచ్చిందని ఢిల్లీ బీజేపీ(BJP) అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు ఏమీ జరగలేదని ఢిల్లీ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించాయని, దీంతో అక్కడ నివసించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి:
కాంగ్రెస్ గెలిస్తే.. మీ సంపదను ముస్లింలకు పంచేస్తారు
మరిన్ని జాతీయ వార్తల కోసం