Share News

Arvind Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆప్ ఆందోళన

ABN , Publish Date - Jun 23 , 2024 | 06:54 AM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది. లిక్కర్ స్కామ్‌లో అరెస్టైనప్పటి నుంచి భారీగా బరువు తగ్గారని అంటోంది. మూడు నెలలో 8 కిలోల బరువు తగ్గారని వివరించింది.

Arvind Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆప్ ఆందోళన
Arvind Kejriwal

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోగ్య పరిస్థితిపై ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది. లిక్కర్ స్కామ్‌లో అరెస్టైనప్పటి నుంచి భారీగా బరువు తగ్గారని అంటోంది. మూడు నెలలో 8 కిలోల బరువు తగ్గారని వివరించింది. ‘మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ 70 కిలోల బరువు ఉన్నారు. జూన్ 22వ తేదీకి అది 62 కిలోలకు పడిపోయింది. కంటిన్యూగా బరువు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంది. దాంతో కేజ్రీవాల్ బరువు తగ్గడానికి గల కారణం తెలియనుంది అని’ ఆప్ స్పష్టం చేసింది.


ఎందుకంటే..?

జైలులో ఉన్న కేజ్రీవాల్ బరువు తగ్గడానికి కారణం ఆహార విషయంలో తేడా జరుగుతుందని ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ బరువు తగ్గడంతో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మెడికల్ బోర్డు కీలక సూచనలు చేసిందని గుర్తుచేసింది. ఆహారంలో పరాటా, పూరీ చేర్చాలని కోరిందని వివరించింది. అలా చేయడంతో బరువు తగ్గబోరని సూచించింది. అమలు చేయకపోవడంతో కేజ్రీవాల్ బరుతు తగ్గుతూనే ఉన్నారు.


అందుకే పొడగింపు

ఆరోగ్య పరిస్థితుల వల్ల కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌ పొడగించాలని కోర్టును కోరామని పేర్కొంది. కేజ్రీవాల్‌కు కొన్ని వైద్య పరీక్షలు చేయించాలని మ్యాక్స్ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారని వివరించింది. గుండె సంబంధిత పరీక్షలు, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించాల్సి ఉందని పేర్కొంది. లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.

Updated Date - Jun 23 , 2024 | 06:54 AM