Himachal Pradesh: రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి.. హిమాచల్ ప్రదేశ్ కోర్టులో అభిషేక్ పిటిషన్
ABN , Publish Date - Apr 06 , 2024 | 08:37 PM
రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోవడంపై కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వీ కోర్టును ఆశ్రయించారు. రాజ్యసభ ఎన్నికల్లో తన ప్రత్యర్థికి సరైన బలం లేదని, అయినా గెలిచారని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులకు ఓకే సంఖ్యలో ఓట్లు వస్తే లాటరీ ద్వారా డ్రా తీయడం కరెక్ట్ కాదని అభిప్రాయ పడ్డారు.
సిమ్లా: ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోవడంపై కాంగ్రెస్ (Congress) అభ్యర్థి, సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వీ (Abhishek Manu Singhvi) కోర్టును ఆశ్రయించారు. రాజ్యసభ ఎన్నికల్లో తన ప్రత్యర్థికి సరైన బలం లేదని, అయినా గెలిచారని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులకు ఓకే సంఖ్యలో ఓట్లు వస్తే లాటరీ ద్వారా డ్రా తీయడం కరెక్ట్ కాదని అభిప్రాయ పడ్డారు. ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా తీయడం సరికాదని సింగ్వీ అంటున్నారు. ఇలా అభ్యర్థి విజయాన్ని ఖరారు చేయాలని చట్టంలో లేదని వివరించారు. ఆ నియమాన్ని తాను కోర్టులో సవాల్ చేశానని పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే..?
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి సింగ్వీ, బీజేపీ నుంచి హర్ష్ మహాజన్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. ఇద్దరికీ సమాన ఓట్లు రావడంతో లాటరీ తీశారు. హర్ష్ మహాజన్ పేరు రావడంతో విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆ అంశాన్ని సింగ్వీ కోర్టులో సవాల్ చేశారు.
ఇవి కూడా చదవండి:
West Bengal: దీదీతో గొడవకు కారణం ఆ మంత్రే.. బెంగాల్ గవర్నర్ సంచలనం
Maharashtra: కల్యాణ్ నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలోకి షిండే కుమారుడు..? ఫడ్నవీస్ ఏమన్నారంటే..?
మరిన్ని జాతీయ వార్తల కోసం