Share News

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి.. ఎటాక్ అందుకేనా..

ABN , Publish Date - Jun 28 , 2024 | 09:32 AM

ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ఢిల్లీ ఇంటిపై(Delhi house) దాడి (attack) జరిగింది. కొందరు గుర్తుతెలియని దుండగులు ఆయన ఇంటి నేమ్‌ ప్లేట్‌, గేటుపై నల్ల ఇంకును(black ink) విసిరి ఆయన పేరు కనిపించకుండా చేశారు.

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి.. ఎటాక్ అందుకేనా..
Asaduddin Owaisi Delhi house attack

ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ఢిల్లీ ఇంటిపై(Delhi house) దాడి (attack) జరిగింది. కొందరు గుర్తుతెలియని దుండగులు ఆయన ఇంటి నేమ్‌ ప్లేట్‌, గేటుపై నల్ల ఇంకును(black ink) విసిరి ఆయన పేరు కనిపించకుండా చేశారు. ఈ సంఘటన గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో కొన్ని పోస్టర్లను కూడా అతికించారు. అందులో 'భారత్ మాతా కీ జై' అని రాసి ఉంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఒవైసీ ఓ వీడియో పోస్ట్ తెలుపడం విశేషం.


అమిత్ షా

అంతేకాదు ఇలాంటి పిరికిపంద చర్యలకు తాను భయపడనని ఒవైసీ చెప్పారు. తన ఢిల్లీ నివాసాన్ని ఎన్నిసార్లు టార్గెట్ చేశారో ఇప్పుడు లెక్క కోల్పోయానని ఒవైసీ అన్నారు. ఇది ఎలా జరుగుతుందని ఢిల్లీ పోలీసు అధికారులను అడిగితే వారు నిస్సహాయత వ్యక్తం చేశారని ఆరోపించారు. ఇది అమిత్ షా పర్యవేక్షణలో జరుగుతోందని ఆరోపించారు. ఓం బిర్లా దయచేసి ఎంపీల భద్రతకు ఏం హామీ ఇస్తారో చెప్పాలని ఈ సందర్భంగా కోరారు. ఇలాంటివి తనను భయపెట్టవని, పిరికి చర్యలను ఆపాలని వెల్లడించారు.


దేశంలో ఉండొద్దు

అయితే అసదుద్దీన్ ఒవైసీ బుధవారం లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా 'జై పాలస్తీనా' అంటూ నినాదాలు చేశారు. అప్పటి నుంచి మంది నేతలతోపాటు పలువురు సాధారణ ప్రజలు కూడా ఆయన నినాదాలను వ్యతిరేకించారు. దేశంలో ఉంటూ ఇక్కడే తిండి తింటూ పాలస్తీనాకు మద్దతు పలకడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు అసలు దేశంలో ఉండకూడదని మరికొంత మంది అంటున్నారు. ఇలా చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంకొంత మంది చెబుతున్నారు. అంతేకాదు గతంలో కూడా ఒవైసీ భారతదేశం, భారతమాత పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.


ఒవైసీపై రాష్ట్రపతికి ఫిర్యాదు

మరోవైపు ఒవైసీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. ఒవైసీ 'జై పాలస్తీనా' నినాదం చేసిన నేపథ్యంలో కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో ఒవైసీ ఎంపీ సభ్యత్వాన్ని తొలగించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరిశంకర్ జైన్ రాష్ట్రపతిని కోరారు.


ఇవి కూడా చదవండి:

Airport Roof Collapse: కూప్పకూలిన ఎయిర్‌పోర్ట్‌ పైకప్పు.. నలుగురికి గాయాలు, కార్లు ధ్వంసం

T20 World Cup 2024: ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా..రేపు ఫైనల్లో..


President Draupadi Murmu : పేపర్‌ లీకేజీలపై కఠిన చర్యలు


Read Latest National News and Telugu News

Updated Date - Jun 28 , 2024 | 09:38 AM