నూతన వైమానిక దళాధిపతిగా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్
ABN , Publish Date - Sep 22 , 2024 | 04:27 AM
యుద్ధ విమాన పైలట్, 5000 గంటలు విమానాన్ని నడిపిన విశేష అనుభవం కలిగిన ఫైటర్ పైలట్ ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్‌ను నూతన వైమానిక దళాధిపతిగా ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: యుద్ధ విమాన పైలట్, 5000 గంటలు విమానాన్ని నడిపిన విశేష అనుభవం కలిగిన ఫైటర్ పైలట్ ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్‌ను నూతన వైమానిక దళాధిపతిగా ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చతుర్వేది ఈ నెల 30 పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘ప్రస్తుతం వైస్ చీఫ్‌గా సేవలందిస్తున్న ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, పీవీఎ్‌సఎం, ఏవీఎ్‌సఎంను ఎయిర్ చీఫ్ మార్షల్‌గా నియమిస్తున్నాం. ఈ నియామక ఉత్తర్వులు సెప్టెంబరు 30 మధ్యాహ్నం నుంచి అమలులోకి వస్తాయి’ అని రక్షణ శాఖ ప్రకటించింది. గొప్ప వ్యూహకర్తగా పేరున్న ఎయిర్ మార్షల్ అమర్ సింగ్ గత జూలైలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘రక్షణ రంగంలో స్వయం సమృద్ధి భావన దేశ రక్షణను పణంగా పెట్టకూడదు’ అని వ్యాఖ్యానించారు.