Amit Shah : అండర్ ట్రయల్ ఖైదీలకు శుభవార్త!
ABN , Publish Date - Nov 21 , 2024 | 04:05 AM
దేశవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీలకు శుభవార్త. వారి విడుదలకు ముహూర్తం ఖరారైంది.
26వ తేదీలోగా వారి విడుదల
శిక్షపడే కాలంలో మూడోవంతు జైల్లోనే మగ్గినవారికి అవకాశం: అమిత్‌షా
గాంధీనగర్, నవంబరు 20: దేశవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీలకు శుభవార్త. వారి విడుదలకు ముహూర్తం ఖరారైంది. వారిపై మోపిన అభియోగాల ప్రకారం గరిష్ఠంగా ఎంత శిక్ష పడుతుందో.. అందులో మూడోవంతు జైల్లోనే గడిపిన వారిని ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం జరుపుకొనే లోపు విడుదల చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట కాలావధిలోగా పూర్తిచేసేందుకు 60 నిబంధనలను న్యాయస్థానాలు, ప్రాసిక్యూషన్, పోలీసుల ముందు ఉంచామన్నారు. నిర్దిష్ట కాలం తర్వాత కోర్టు విచారణ ముందుకు సాగని కేసుల్లో జైలు అధికారే కోర్టులో బెయిల్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మంగళవారం గాంధీనగర్‌లో అఖిల భారత పోలీసు సైన్స్ కాన్ఫరెన్స్(ఏఐపీఎ్‌ససీ)లో ఆయన ప్రసంగించారు. శిక్ష పడే కాలంలో మూడో వంతు జైల్లోనే మగ్గినా ఇప్పటికీ న్యాయం అందని ఖైదీలు.. రాజ్యాంగ దినోత్సవంలోపు ఒక్కరు కూడా జైల్లో ఉండకూడదన్నది తమ అభిమతమన్నారు.