Haryana Central Observers: హర్యానాకు కేంద్ర పరిశీలకులుగా అమిత్‌షా, ఎంపీ సీఎం మోహన్ యాదవ్
ABN , Publish Date - Oct 13 , 2024 | 08:41 PM
హర్యానా బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు కేంద్ర పరిశీలకులను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు.
న్యూఢిల్లీ: హర్యానా (Haryana) బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు కేంద్ర పరిశీలకులుగా హోం మంత్రి అమిత్‌షా (Amit shah), మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (Mohan Yadav) నియమితులయ్యారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎంపికైన వ్యక్తి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారు. హర్యానాతో పాటు ఇటీవలే ఎన్నికలు జరిగిన జమ్మూకశ్మీర్‌కు పార్టీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి ప్లహ్లాద్ జోషి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.
Uddhav Thackeray: సీఎం అభ్యర్థి ఎవరో ముందు వాళ్లను తేల్చుకోనీయండి
హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదలయ్యారు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. 90 సీట్లలో 48 సీట్లను బీజేపీ గెలుచుకుని మోజారిటీ మార్క్ (46)ను అధిగమించింది. కాంగ్రెస్ 37 సీట్లు, ఇండిపెండెంట్లు 3 సీట్లు, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ) రెండు సీట్లు దక్కించుకున్నాయి. అటు, జమ్మూకశ్మీర్‌లో 370వ అధికరణ రద్దు చేసిన తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి విజయాన్ని సొంతం చేసుకుంది. 90 అసెంబ్లీ సీట్లలో ఎన్‌సీ-కాంగ్రెస్ 48 సీట్లు దక్కిచుకున్నాయి. ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. బీజేపీ 29 సీట్లు గెలుచుకుని జమ్మూకశ్మీర్‌లో రెండో అతిపెద్ద పార్టీగా రికార్డు సృష్టించింది.
Read More National News and Latest Telugu News
ఈ వార్తలు కూడా చదవండి:
Baba Siddique murder: దసరా బాణసంచా పేలుళ్ల మధ్య సిద్ధిఖిపై కాల్పులు
Baba Siddique: అందుకే బాబా సిద్ధిఖీని హత్య చేశారా?