Share News

Amit Shah: ఆ చట్టాలపై 30 గంటలు చర్చ జరిగింది.. విపక్షాల ప్రశ్నల నడుమ అమిత్ షా ఎదురుదాడి

ABN , Publish Date - Jul 01 , 2024 | 06:02 PM

కొత్త క్రిమినల్ చట్టాలు(New Criminal Laws) సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన విషయం విదితమే. అయితే ఈ చట్టాలు అమలు చేసే ముందు ఉభయ సభల్లో సరైన చర్చ జరగలేదని విపక్షాల నుంచి ప్రధానంగా ఎదురవుతున్న ఆరోపణ. ఈ ఆరోపణల్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఖండించారు.

Amit Shah: ఆ చట్టాలపై 30 గంటలు చర్చ జరిగింది.. విపక్షాల ప్రశ్నల నడుమ అమిత్ షా ఎదురుదాడి

ఢిల్లీ: కొత్త క్రిమినల్ చట్టాలు(New Criminal Laws) సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన విషయం విదితమే. అయితే ఈ చట్టాలు అమలు చేసే ముందు ఉభయ సభల్లో సరైన చర్చ జరగలేదని విపక్షాల నుంచి ప్రధానంగా ఎదురవుతున్న ఆరోపణ. ఈ ఆరోపణల్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఖండించారు. లోక్ సభలో ఆయన ఇవాళ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఆరోపణల్లో పస లేదన్నారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో కొత్త క్రిమినల్ చట్టాలపై చర్చించినంతగా ఏ చట్టాలపైనా చర్చ జరగలేదని పేర్కొన్నారు.

118 చర్చల్లో స్వయాన తానే పాల్గొన్నట్లు షా తెలిపారు. 30 గంటలపాటు చర్చలు జరిగాయని, అందులో 34 మంది సభ్యులు పాల్గొన్నారని వివరించారు. 77 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత, నేర న్యాయ వ్యవస్థ ప్రస్తుతం పూర్తిగా స్వదేశీమయం అయిందని, అనువనువునా భారతీయత్వాన్ని కలిగి ఉందని షా పేర్కొన్నారు.


ఇండియా కూటమి ఆరోపణ ఇదే..

2023లో 140 మందికి పైగా ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి కొత్త క్రిమినల్ చట్టాలను ఉభయ సభల్లో ఆమోదింపజేశారని ప్రతిపక్ష ఇండియా కూటమి ఆరోపిస్తోంది. చట్టాలపై చర్చించడానికి ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీ కూడా లోతైన చర్చ జరపలేదని అంటోంది. అయితే అన్ని పార్టీల సూచనలను పరిగణలోకి తీసుకుని, చట్టాల్లో మార్పులు చేర్పులు చేసినట్లు అమిత్ షా వివరించారు.

ప్రతిపక్షాలు రాజకీయాలకు అతీతంగా ఈ చట్టాలకు మద్దతు తెలపాలని కోరారు. కొత్త చట్టాల పేర్లు కూడా మార్చడానికి తాము సిద్ధమే అని స్పష్టం చేశారు. కొత్త చట్టాలకు హిందీ పేర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలు కూడా చట్టాలకు హిందీ పేర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాయి.


ఇంకా ఏమన్నారంటే..

కొత్త క్రిమినల్ చట్టాలతో ఇకపై బాధితులకు సత్వర, వేగవంతమైన న్యాయం జరుగుతుందని షా అన్నారు. "స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్ల తరువాత స్వదేశీ న్యాయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు. వలస రాజ్యాల చట్టాల స్థానంలో భారత పార్లమెంటు రూపొందించిన ఈ చట్టాలు ఎన్నో రకాలుగా ఆలోచించి తెచ్చినవి. ఈ చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న పోలీసుల హక్కులతో పాటు బాధితుల, ఫిర్యాదుదారుల హక్కులు కూడా రక్షించబడతాయి" అని షా వెల్లడించారు.

For Latest News and National News click here

Updated Date - Jul 01 , 2024 | 06:02 PM