Share News

Elections 2024: రైతులకు రుణమాఫీ.. బీజేపీ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Nov 10 , 2024 | 10:26 AM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇన్నాళ్లూ రైతు రుణమాఫీకి వ్యతిరేకంగా ఉంటూ వచ్చింది. కానీ ఈ విషయంలో మోడీ సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

Elections 2024: రైతులకు రుణమాఫీ.. బీజేపీ సంచలన నిర్ణయం

Maharashtra Assembly Elections: ఇప్పుడు దేశం చూపంతా మహారాష్ట్ర మీదే ఉంది. దేశంలో ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమె బెంగాల్ తర్వాత అతిపెద్ద రాష్ట్రం కావడంతో ఈ స్టేట్‌లో జరుగుతున్న ఎన్నికల సమరంపై అందరూ ఫోకస్ పెడుతున్నారు. స్థానిక పార్టీలతో కాంగ్రెస్, బీజేపీ జట్టు కట్టడంతో ఏ కూటమి నెగ్గుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి బీజేపీ-మహాయుతి తీర్మానం లేఖను విడుదల చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సంకల్ప్ పత్ర పేరుతో రిలీజ్ చేసిన ఈ లెటర్‌లో తాము అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి క్లారిటీ ఇచ్చారు. షా విడుదల చేసిన కూటమి మ్యానిఫెస్టోలో అసలు ఏం ఉందో ఇప్పుడు చూద్దాం..


25 లక్షల ఉద్యోగాలు

ఇన్నాళ్లూ రైతు రుణమాఫీకి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ.. తొలిసారి దీనిపై సానుకూలంగా స్పందించింది. మహారాష్ట్ర ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ-మహాయుతి కూటమి అన్నదాతలకు రుణమాఫీని ప్రకటించింది. అలాగే ఇప్పటివరకు లడ్కీ బహిన్ యోజన కింద ఇస్తున్న మొత్తాన్ని రూ.1,500 నుంచి రూ.2,100కు పెంచుతున్నట్లు తెలిపింది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌లను కూడా రూ.1500 నుంచి రూ.2,100కి పెంచుతున్నట్లు కూటమి నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. తమ సర్కారులో 25 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామన్నారు. పవర్‌లోకి వచ్చిన 100 రోజుల్లో టెక్నాలజీ బలోపేతం కోసం విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తామని వ్యాఖ్యానించారు.


మాట మీద నిలబడతాం

అంతరిక్షం, ఏరోనాటిక్స్, ఫిన్‌టెక్ రంగాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తామని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఏఐ ట్రెయినింగ్ ల్యాబ్స్‌ ఏర్పాటు మీద ఫోకస్ పెడతామని పేర్కొన్నారు. యువకులకు స్వామి వివేకానంద ఫిట్‌నెస్, ఆరోగ్య కార్డులను జారీ చేస్తామని చెప్పుకొచ్చారు. మహారాష్ట్రను నంబర్ వన్ స్టేట్‌ చేయడమే తమ టార్గెట్ అని స్పష్టం చేశారు. దేశంలో మొదటి 1 ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. వికసిత్ భారత్, వికసిత్ మహారాష్ట్రే ధ్యేయంగా ముందుకెళ్తామని వివరించారు ఫడ్నవీస్. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని అమిత్ షా అన్నారు. మాటపై నిలబడతామన్నారు. రైతుల, మహిళల సాధికారత కోసం కృషి చేస్తామన్నారు.


Also Read:

ప్రముఖ నటుడు కన్నుమూత.. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

సారీ నాన్నా అమ్మను చంపేశా

యడియూరప్ప, శ్రీరాములుపై న్యాయ విచారణ!

For More National And Telugu News

Updated Date - Nov 10 , 2024 | 11:52 AM