Share News

Arvind Kejriwal: అమిత్ షాకి అరవింద్ కేజ్రీవాల్ లేఖాస్త్రాం

ABN , Publish Date - Dec 14 , 2024 | 01:49 PM

70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం లేఖాస్త్రాం సంధించారు.

Arvind Kejriwal: అమిత్ షాకి అరవింద్ కేజ్రీవాల్ లేఖాస్త్రాం

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: దేశ రాజధాని న్యూఢిల్లీలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయని మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతోన్న నేరాల్లో ఢిల్లీ మహానగరం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 19 మెట్రో నగరాలు ఉంటే.. వాటిలో నేరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో నిలిచిందన్నారు. ఇది కలవరపాటుకు గురి చేస్తుందని తెలిపారు. ఎయిర్‌పోర్టులు, స్కూళ్లకు బాంబు బెదిరింపులు పెరిగాయని.. అలాగే బెదిరించి డబ్బులు దండుకొనే గ్యాంగ్‌లు సైతం అధికమయ్యాయని.. అలాగే మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలు 350 శాతం మేర ఢిల్లీలో పెరిగాయని గుర్తు చేశారు.

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో అమిత్ షా పర్యటన


ఇవి ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై కలిసి చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షాకు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్జప్తి చేశారు. ఈ మేరకు శనివారం కేంద్ర మంత్రి అమిత్ షాకు అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఢిల్లీలోని శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించడమే కాకుండా.. నేరాల రాజధానిగా మారిపోయిందని అమిత్ షాకు రాసిన లేఖలో కేజ్రీవాల్ అభివర్ణించారు.

Also Read: అద్వానీకి మళ్లీ అనారోగ్యం.. ఆసుపత్రికి తరలింపు


మరోవైపు ఈ వారం ప్రారంభంలో అమిత్ షా లక్ష్యంగా చేసుకొని ట్విట్టర్ వేదికగా అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అమిత్ షా ఢిల్లీని నాశనం చేశారన్నారు. ఢిల్లీని జంగిల్ రాజ్‌గా మార్చారని విమర్శించారు. ఎక్కడ చూసినా ప్రజలు.. భయానక జీవితాన్ని గడుపుతున్నారన్నారు. ఢిల్లీలో శాంతి భద్రతలను సరిగ్గా నిర్వహించే లేకపోతుందంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: అల్లు అర్జున్ అరెస్ట్‌పై చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు


2025, ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి ఢిల్లీలో పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు కేజ్రీవాల్ పాలనకు గండి కొట్టాలని బీజేపీ సైతం ఓ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. అలాంటి వేళ.. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ 39 మంది అభ్యర్థులతో వరుసగా రెండు జాబితాలను విడుదల చేసింది.

Also Read: పోలీస్ వాహనంపై దాడి.. ప్రధాన నిందితుడిని ఎత్తుకెళ్లిన ముఠా

Also Read: తాటిపండు (తాటికాయ) వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


మరో జాబితాను సైతం విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. నాటి నుంచి ఆయన తీహాడ్ జైల్‌లోనే ఉన్నారు. ఇటీవల ఆయనకు కోర్టు కండిషన్ బెయిల్‌ మంజూరుచేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఢిల్లీ సీఎంగా అతిషిని ఆప్ నేతలు ఎన్నుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చే తీర్పునకు శిరసావహిస్తానని.. ఆ క్రమంలోనే ఢిల్లీ సీఎంగా మళ్లీ బాధ్యతలు చేపడతానని కేజ్రీవాల్.. తన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం విధితమే.

Also Read: దుర్గమ్మను దర్శించుకొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్.. మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు


ఇక ఢిల్లీలోని ఆప్ ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీకి సంబంధించిన ఓట్లు గల్లంతు చేస్తున్నారంటూ.. బీజేపీపై కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సైతం కలిసి ఆప్ అగ్రనేతలు ఫిర్యాదు చేసిన విషయం విధితమే.

For National News And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 01:49 PM