3 నెలల్లో వందేభారత్ స్లీపర్ రైళ్లు
ABN , Publish Date - Sep 02 , 2024 | 03:20 AM
వందేభారత్ స్లీపర్ ట్రైన్ కోసం బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) కంపెనీలో తయారు చేస్తున్న బోగీల నమూనా ఫొటోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం విడుదల చేశారు.
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
రైలు బోగీల నమూనా ఫొటోలు విడుదల
న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: వందేభారత్ స్లీపర్ ట్రైన్ కోసం బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) కంపెనీలో తయారు చేస్తున్న బోగీల నమూనా ఫొటోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం విడుదల చేశారు. ఈ రైలు మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. రైలులో మొత్తం 16 బోగీలు(823 బెర్తులు) ఉంటాయని చెప్పారు. మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకొని ఈ రైలును రూపొందిస్తున్నారని, టికెట్ రేట్లు రాజధాని ఎక్స్ప్రెస్ స్థాయిలో ఉంటాయని మంత్రి వివరించారు. వందేభారత్ స్లీపర్ రైలు బోగీల్లో ఆక్సిజన్ సరఫరా, వైరస్ వ్యాప్తిని నియంత్రించే వ్యవస్థలతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన టాయిలెట్లు, వేడి నీటి సదుపాయం, అగ్ని నిరోధక వ్యవస్థ.. ఇలా ఇంకా చాలా వసతులు ఉంటాయని చెప్పారు. కవచ్ వ్యవస్థ కూడా ఇందులో ఉంటుందన్నారు.