Ayodhya: అయోధ్యలో ఉగ్రదాడి జరగొచ్చు..! ఐబీ హెచ్చరికలతో యోగి సర్కార్ అలర్ట్
ABN , Publish Date - Jan 11 , 2024 | 04:55 PM
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22వ తేదీన జరగనుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. అయోధ్యలో ఓ ఉగ్రవాది దాది ఉన్నారని సమాచారం ఇచ్చాయి. రాజకీయ నేతలు, అధికారులపై దాడి చేసి అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తారని తెలిపాయి.
అయోధ్య: అయోధ్యలో (Ayodhya Ram Mandir) రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22వ తేదీన జరగనుంది. వేలాది మంది అతిథులు హాజరవనున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. అయోధ్యలో (Ayodhya) ఓ ఉగ్రవాది దాది ఉన్నారని సమాచారం ఇచ్చాయి. రాజకీయ నేతలు, అధికారులపై దాడి చేసి అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తారని తెలిపాయి.
అప్రమత్తం
ఇజ్రాయెల్- హమాస్ ఘర్షణలో భారత్ ఇజ్రాయెల్ వైపు నిలబడిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వ వైఖరి ఉగ్రవాదులు దాడి చేసేందుకు ఉసిగొల్పి ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఐబీ హెచ్చరికలతో ఉత్తరప్రదేశ్ అధికారులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రామ జన్మభూమి ప్రారంభ వేడుకల కోసం విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు.
మిగిలిన చోట్ల కూడా
అయోధ్యతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని మిగిలిన చోట్ల కూడా దాడులు చేయాలని ఉగ్రవాదులు వ్యుహారచన రచించాయని ఐబీ అధికారులు సమాచారం ఇచ్చారు. అంతర్జాతీయ సమాజంలో భారత్‌ను తక్కువ చేసే ప్రయత్నాల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పలు పోస్టులు సిద్దం చేశారని వెల్లడించారు.
1500 సీసీ కెమెరాలు
ఐబీ హెచ్చరికలతో అయోధ్యలో 1500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయోధ్యలో యెల్లో జోన్‌లో ఫేస్ రిగక్నిషన్ టెక్నాలజీతో కూడిన 10,715 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు అమర్చారు. వీటిని ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్‌తో అనుసంధానించారు. సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తారు. వైమానిక దాడుల నుంచి రక్షణ కోసం యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉపయోగిస్తున్నారు. దీనిని ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా దళం (ఎస్ఎస్ఎఫ్) పర్యవేక్షిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.