Share News

Bus Caught Fire: ఈ డ్రైవర్‌కి హ్యాట్సాఫ్.. బస్సులో మంటలు చెలరేగిన వెంటనే..

ABN , Publish Date - Jul 09 , 2024 | 03:37 PM

తాము ఏదైనా ప్రమాదంలో ఉన్నామని సంకేతాలు అందితే చాలు.. వెంటనే తమ ప్రాణాలు కాపాడుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు. మిగతా వాళ్ల గురించి పట్టించుకోకుండా.. తాము సురక్షితంగా బయటపడ్డామా? లేదా?

Bus Caught Fire: ఈ డ్రైవర్‌కి హ్యాట్సాఫ్.. బస్సులో మంటలు చెలరేగిన వెంటనే..
Bus Caught Fire

తాము ఏదైనా ప్రమాదంలో ఉన్నామని సంకేతాలు అందితే చాలు.. వెంటనే తమ ప్రాణాలు కాపాడుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు. మిగతా వాళ్ల గురించి పట్టించుకోకుండా.. తాము సురక్షితంగా బయటపడ్డామా? లేదా? అనేది మాత్రమే పట్టించుకుంటారు. కానీ.. కొందరు అలా ఉండరు. ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొని, ధైర్యంగా ముందుకెళ్లి ఇతరుల్ని కాపాడుతారు. ఇలాంటి హీరోయిక్ సంఘటనలు గతంలో చాలానే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా కర్ణాటకలోనూ (Karnataka) ఈ తరహా ఘటనే వెలుగు చూసింది. ఓ బస్సు డ్రైవర్ చేసిన పనికి.. అందరూ అతడ్ని ప్రశంసిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..


బెంగళూరు నగరంలో ప్రయాణికులతో నిండిన ఓ పబ్లిక్ బస్సు ఉన్నపళంగా ఆగిపోయింది. దీంతో డ్రైవర్ దాన్ని తిరిగి స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే బస్సులో మంటలు చెలరేగాయి. క్రమంగా అది బస్సు మొత్తం వ్యాప్తి చెందడం మొదలైంది. ఈ విషయాన్ని గ్రహించిన డ్రైవర్.. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. బస్సులో మంటలు చెలరేగాయని, వెంటనే అందరూ దిగిపోవాలని సూచించాడు. ఏ ఒక్క ప్యాసింజర్ కూడా లోపల చిక్కుకోకుండా, అందరినీ బస్సు దించేశాడు. ఎవరూ లేరని నిర్ధారించుకొని, చివర్లో తాను బస్సు దిగాడు. అనంతరం మంటలు మరింత వ్యాపించి.. బస్సు మొత్తం తగలబడిపోయింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని, మంటలు ఆర్పేసింది.


అయితే.. ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని.. ఈ ప్రమాదానికి గల కారణాలేంటో పరిశీలిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా.. ఇంజిన్ ఓవర్‌హీట్ అవ్వడం వల్లే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే.. పూర్తి నివేదిక వచ్చేదాకా ఏదీ క్లారిటీ తేల్చలేమన్నారు. నివేదిక వచ్చాకే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటన ఎంజీ రోడ్డులో చోటు చేసుకుంది. ఈ బస్సు బస్సు కోరమంగళ డిపోకు చెందినదిగా అధికారులు గుర్తించారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 09 , 2024 | 03:37 PM