Share News

Bengaluru: రేణుకాస్వామి హత్య కేసులో మరో ఐదుగురికి బెయిల్‌

ABN , Publish Date - Dec 25 , 2024 | 01:49 PM

త్రదుర్గ రేణుకా స్వామి(Renuka Swamy) హత్యకేసులో విచారణ ఖైదీలుగా కొనసాగుతున్న మరో ఐదుగురికి బెయిల్‌ మంజూరైంది. బెంగళూరు సెషన్స్‌ కోర్టు సోమవారం తీర్పును ప్రకటించింది. దీంతో హత్యకేసును ఎదుర్కొంటున్న మొత్తం 17మంది బెయిల్‌పై బయటకు వచ్చినట్ట య్యింది.

Bengaluru: రేణుకాస్వామి హత్య కేసులో మరో ఐదుగురికి బెయిల్‌

బెంగళూరు: చిత్రదుర్గ రేణుకా స్వామి(Renuka Swamy) హత్యకేసులో విచారణ ఖైదీలుగా కొనసాగుతున్న మరో ఐదుగురికి బెయిల్‌ మంజూరైంది. బెంగళూరు సెషన్స్‌ కోర్టు సోమవారం తీర్పును ప్రకటించింది. దీంతో హత్యకేసును ఎదుర్కొంటున్న మొత్తం 17మంది బెయిల్‌పై బయటకు వచ్చినట్ట య్యింది. వీరిలో రాజరాజేశ్వరినగర్‌లోని స్టోని బ్రూక్‌ రెస్టారెంట్‌ యజమాని వినయ్‌, పవిత్రగౌడ అసిస్టెంట్‌ పవన్‌, చిత్రదుర్గకు చెందిన దర్శన్‌ అభిమానసంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర, వినయ్‌, నందీశ్‌లకు బెయిల్‌ మంజూరైంది.

ఈ వార్తను కూడా చదవండి: Bengaluru: గులాబ్‌జామ్‌.. రసగుల్లా.. ఆమె ఫోన్‌లో మాజీ మంత్రి, బీజేపీ నాయకుడి పేర్లు ఇవి..


pandu4.2.jpg

పవిత్రగౌడ ఇంట్లో పనిచేసే పవన్‌ వాట్సప్‌ మెసేజ్‌లు చేసిన రేణుకాస్వామిని గుర్తించడంలో కీలక భూమికగా వ్యవహరించగా చిత్రదుర్గ నుంచి బెంగళూరు(Bengaluru)కు తీసుకురావడంలో దర్శన్‌ అభిమానసంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర వ్యవహరించారు. హత్య జరిగిన రోజు దర్శన్‌తోపాటు పలు వురు స్టోని బ్రూక్‌ రెస్టారెంట్‌లో గడిపిన విషయం తెలిసిందే. ఇలా కేసుతో సంబంధం ఉన్న మేరకు సుదీర్ఘకాలంపాటు జైలులో గడిపారు.


pandu4.3.jpg

ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: తప్పయిపోయింది!

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: తప్పు జరిగితే.. వేటు తప్పదు!

ఈవార్తను కూడా చదవండి: నేడు, రేపు మోస్తరు వర్షాలు

ఈవార్తను కూడా చదవండి: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 25 , 2024 | 01:49 PM