Share News

Bihar: ఘోరాతిఘోరం.. యువకుడి ప్రైవేట్‌ పార్ట్‌ను తుపాకీతో కాల్చేశాడు..!

ABN , Publish Date - Jun 07 , 2024 | 10:18 PM

Bihar News: కోడలిపై కన్నేసిన మామ.. ఏకంగా అల్లుడి ప్రాణాలను మింగేశాడు. తుపాకీతో ప్రైవేట్ పార్ట్‌ వద్ద కాల్చడంతో.. తీవ్రంగా గాయపడిన అల్లుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఓ యువతి తన తాతయ్య ఇంటికి వచ్చింది. అయితే, ఆమెపై కన్నేసిన మామ వరుస అయిన బంధువు కన్నుపడింది.

Bihar: ఘోరాతిఘోరం.. యువకుడి ప్రైవేట్‌ పార్ట్‌ను తుపాకీతో కాల్చేశాడు..!

Bihar News: కోడలిపై కన్నేసిన మామ.. ఏకంగా అల్లుడి ప్రాణాలను మింగేశాడు. తుపాకీతో ప్రైవేట్ పార్ట్‌ వద్ద కాల్చడంతో.. తీవ్రంగా గాయపడిన అల్లుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఓ యువతి తన తాతయ్య ఇంటికి వచ్చింది. అయితే, ఆమెపై కన్నేసిన మామ వరుస అయిన బంధువు కన్నుపడింది. ఈ క్రమంలో హ్యాండ్ పంప్ వద్ద సరదాగా స్నానం చేస్తుండగా.. వికాస్ మండల్ తప్పుడు ఉద్దేశంతో ఆమెపై బురద చల్లాడు.

దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. రెచ్చిపోయిన వ్యక్తి.. ఆమెను నేరుగా వేధించసాగాడు. కొట్టాడు. కాల్చిపడేస్తానంటూ యువతిని బెదిరింపులకు గురి చేశాడు. అంతటితో ఆగకుండా.. రాత్రి సమయంలో వారి ఇంట్లోకి దూరి.. యువతి కుటుంబ సభ్యలతో ఘర్షణకు దిగాడు. వారితో గొడవ పడి.. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న తుపాకీతో యువతి తండ్రిపై, ఆమె సోదరుడిపై కాల్పుడు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన తండ్రీ కొడుకులను చికిత్స నిమిత్తం జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.


అయితే, యువకుడి ప్రైవేట్ పార్ట్‌కి బుల్లెట్ తగలడంతో.. చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. తండ్రి పరిస్థితి కూడా విషమంగా ఉందని పాట్నా పీఎంసీహెచ్‌కు తరలించారు. ఈ ఘటన సుల్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగనియా ఫతేపూర్‌లో చోటు చేసుకోగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

For National News and Telugu News..

Updated Date - Jun 07 , 2024 | 10:18 PM