Share News

Bihar: 30వేల కోట్లు ఇవ్వండి..

ABN , Publish Date - Jul 11 , 2024 | 05:40 AM

బిహార్‌కు ప్రత్యేక హోదాతో పాటు కేంద్ర బడ్జెట్‌లో రూ.30వేల కోట్ల నిఽఽధులను కేటాయించాలని ఆ రాష్ట్ర సీఎం, జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ కోరారు.

Bihar: 30వేల కోట్లు ఇవ్వండి..

  • కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌

న్యూఢిల్లీ, జూలై 10: బిహార్‌కు ప్రత్యేక హోదాతో పాటు కేంద్ర బడ్జెట్‌లో రూ.30వేల కోట్ల నిఽఽధులను కేటాయించాలని ఆ రాష్ట్ర సీఎం, జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ కోరారు. అలాగే రాష్ట్ర రుణపరిమితిని కూడా పెంచాలన్నారు. కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన జేడీయూ అధినేత తమ కోరికల జాబితాను గత నెలలో జరిగిన ‘బడ్జెట్‌ ముందు సమావేశం’లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు అందించినట్లు సమాచారం.


బిహార్‌లో 9 విమానాశ్రయాలు నిర్మించాలని, 4 కొత్త మెట్రో లైన్లు నిర్మించాలని జాబితాలో పేర్కొన్నారు. 7 వైద్య కళాశాలలు మంజూరు చేయాలన్నారు. ఽభారీ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌కు నిధులు సమకూర్చాలని కోరారు

Updated Date - Jul 11 , 2024 | 05:40 AM