Share News

BJP: అసెంబ్లీ ఎన్నికల్లోగా డీఎంకే ఫైల్‌-3 రెడీ..

ABN , Publish Date - Dec 11 , 2024 | 10:53 AM

అధికార డీఎంకే నేతలు, అమాత్యులు అవినీతి అక్రమాలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(K. Annamalai) దృష్టిసారించారు. డీఎంకే ఫైల్స్‌ పేరుతో ఈ అవినీతి చిట్టా తయారు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.

BJP: అసెంబ్లీ ఎన్నికల్లోగా డీఎంకే ఫైల్‌-3 రెడీ..

- బీజేపీ నేత అన్నామలై

చెన్నై: అధికార డీఎంకే నేతలు, అమాత్యులు అవినీతి అక్రమాలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(K. Annamalai) దృష్టిసారించారు. డీఎంకే ఫైల్స్‌ పేరుతో ఈ అవినీతి చిట్టా తయారు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రచార అస్త్రంగా ఈ అవినీతి చిట్టాను ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో ఆయన ఉన్నారు. నిజానికి 2023 నుంచి ఆయన డీఎంకే నేతలు, మంత్రుల అవినీతి చిట్టాను బహిర్గతం చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఢిల్లీ అసెంబ్లీ బరిలో మజ్లిస్‌..


nani1.2.jpg

ఇందులో డీఎంకే ఎంపీ జగద్రక్షకన్‌, మంత్రి దురైమురుగన్‌, ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) కుటుంబ సభ్యులకు సంబంధించిన అవినీతిని ఆయన బహిర్గతం చేశారు. అదే యేడాది జూలైలో రెండో అవినీతి జాబితా వెల్లడించగా, అందులో ప్రభుత్వ కాంట్రాక్టుల కేటాయింపుల్లో జరిగిన అవినీతిని బహిర్గతం చేశారు. ఆ తర్వాత డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు(DMK MP TR Balu), మాజీ డీజీపీ జాఫర్‌ సేఠ్‌ల మధ్య జరిగిన సంభాషణల ఆడియోను లీక్‌ చేశారు. ఈ యేడాది ఫిబ్రవరి 4 న మరో ఆడియో రిలీజ్‌ చేయగా, ఇందులో డీఎంకే ఎంపీ ఏ.రాజా, జాఫర్‌ సేఠ్‌ మధ్య జరిగిన సంభాషణలున్నాయి..


అదేసమయంలో ఆస్తుల జాబితాను అన్నామలై బహిర్గతం చేయడంతో టీఆర్‌ బాలు పరువునష్టం దావా వేశారు. ఆ కేసు సైదాపేట మేజిస్ట్రేట్‌ కోర్టులో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో డీఎంకే ఫైల్స్‌ 3ని విడుదల చేసేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. ఇదే విషయంపై అన్నామలై మాట్లాడుతూ, ఇప్పటివరకు డీఎంకే ఫైల్స్‌, 1, 2 విడుదల చేశామని త్వరలో డీఎంకే ఫైల్స్‌ 3 రూపంలో విడుదల చేస్తామన్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో వీటిని తమ ప్రధాన ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకోవాలని ఆయన భావిస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?

ఈవార్తను కూడా చదవండి: తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్‌

ఈవార్తను కూడా చదవండి: సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్‌!

ఈవార్తను కూడా చదవండి: ఆన్‌లైన్‌లో భద్రాద్రి ముక్కోటి దర్శన టికెట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 11 , 2024 | 10:53 AM