Share News

Amit Shah-Tamilisai: అమిత్ షా వార్నింగ్ ఇచ్చారా? క్లారిటీ ఇచ్చిన తమిళిసై..

ABN , Publish Date - Jun 14 , 2024 | 11:46 AM

తెలంగాణ మాజీ గవర్నర్(Telangana Ex Governor).. తమిళనాడు(Tamil Nadu) బీజేపీ(BJP) నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌కు(Tamilisai Soundararajan) కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) వార్నింగ్ ఇచ్చారా? తమిళనాట బీజేపీలో అంతర్గత కుమ్ములాట విషయంలో

Amit Shah-Tamilisai: అమిత్ షా వార్నింగ్ ఇచ్చారా? క్లారిటీ ఇచ్చిన తమిళిసై..
Amit Shah and Tamilisai Soundararajan

చెన్నై, జూన్ 14: తెలంగాణ మాజీ గవర్నర్(Telangana Ex Governor).. తమిళనాడు(Tamil Nadu) బీజేపీ(BJP) నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌కు(Tamilisai Soundararajan) కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) వార్నింగ్ ఇచ్చారా? తమిళనాట బీజేపీలో అంతర్గత కుమ్ములాట విషయంలో ఆమె తీరుపై సీరియస్ అయ్యారా? అంటే అవునంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. అలాంటిదేమీ లేదని తమిళిసై సౌందరరాజన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమిత్ షా తనకు సలహాలు, సూచనలు చేశారని అన్నారు.


వాస్తవానికి బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ మాజీ గవర్నర్ అయిన తమిళిసై సౌందరరాజన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే, వేదికపైకి తమిళిసై రాగా.. అమిత్ షా తన వద్దకు పిలిచి మాట్లాడారు. అమిత్ షా చేతి సంజ్ఞలు తమిళిసైకి ఏదో వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉంది. దీంతో ఆ సంభాషణకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.


ఈ నేపథ్యంలో స్పందించిన తమిళిసై.. ఆ వీడియోపై వివరణ ఇచ్చారు. అమిత్ షా తనతో ఏం మాట్లాడారో చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు తమిళిసై. ‘అమిత్ షా నాతో పోల్ పోస్ట్ ఫాలోఅప్స్ గురించి మాట్లాడారు. రాజకీయ పరమైన అంశాల్లో, నియోజకవర్గ పనుల విషయంలో శ్రద్ధ పెట్టాలని.. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ఎన్నికల్లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆరా తీశారు. రాజకీయంగా యాక్టీవ్‌గా ఉండాలని సూచించారు. సమయాభావం కారణంగా నేను వివరణ ఇవ్వలేకపోయాను. అవవసరపు ఊహాగానాలు తప్ప.. ఆ వీడియోలో ఏమీ లేదు’ అని తమిళిసై క్లారిటీ ఇచ్చారు.


కాగా, తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళి సై సౌందరరాజన్.. చెన్నై సౌత్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. డీఎంకేకు చెందిన తమిజాచి తంగపాండియన్ చేతిలో ఆమె ఓడిపోయారు. అయితే, తమిళనాడు బీజేపీలో అంతర్గత పోరు నడుస్తోందని.. అన్నామలై, తమిళిసైకి అస్సలు పడటం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా వార్నింగ్ ఇచ్చారనే ప్రచారం కూడా నడుస్తోంది. ఇదే విషయాన్ని తమిళిసైని మీడియా ప్రతినిథులు ప్రశ్నించగా.. ఆమె స్పందించేందుకు నిరాకరించారు. ఇంతలో వీడియో వైరల్ అవడంతో.. సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.

For More National News and Telugu News..

Updated Date - Jun 14 , 2024 | 11:46 AM