BJP: బీజేపీ నేత దారుణ హత్య.. ప్రతిచర్య ఉంటుందని సీఎం హెచ్చరిక..
ABN , Publish Date - Mar 02 , 2024 | 02:05 PM
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. మండలస్థాయి జిల్లా నాయకుడు తిరుపతి.. వివాహ వేడుకకు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. మండలస్థాయి జిల్లా నాయకుడు తిరుపతి.. వివాహ వేడుకకు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేశారు. ఈ ఘటన ( Crime News ) లో తిరుపతికి తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్నవారు వెంటనే అప్రమత్తమై చికిత్స కోసం బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ తిరుపతి ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ నేత మృతి వార్త తెలియగానే పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, స్థానికులు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
బీజాపూర్‌లో బీజేపీ నేత హత్యపై సీఎం విష్ణు దేవ్ సాయి సంతాపం వ్యక్తం చేశారు. ఇది నక్సలైట్ల పిరికిపంద చర్య అని అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. దర్యాప్తు చేస్తున్నామని, ఎవరి ద్వారా ఈ పని జరిగిందనేది తెలుసుకునేందుకు నిర్ధారిస్తున్నామని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ అన్నారు.
మరోవైపు.. నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న బస్తర్‌లో బీజేపీ నేతల హత్యలు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2023 ఫిబ్రవరి 5న నీలకంఠ్ కాకెమ్‌ను నక్సలైట్లు హతమార్చారు. 2023 ఫిబ్రవరి 10న సాగర్ సాహును మావోయిస్టులు హత్య చేశారు. 11 ఫిబ్రవరి 2023న నక్సలైట్ల ఆకస్మిక దాడిలో రాంధర్ అలామి మరణించారు. 2023 మార్చి 29న రామ్‌జీ దోడిని మావోయిస్టులు హత్య చేశారు. జూన్ 21, 2023న నక్సలైట్లు అర్జున్ కాకాను దారుణంగా హత్య చేయడం గమనార్హం.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.