BJP Third List: బీజేపీ మూడో జాబితా విడుదల.. తమిళిసై పోటీ చేస్తున్నది ఇక్కడి నుంచే..
ABN , Publish Date - Mar 21 , 2024 | 06:46 PM
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(BJP) తన అభ్యర్థుల మూడో జాబితాను(BJP Third List) విడుదల చేసింది. ఈ జాబితాలో కేవలం తమిళనాడుకు(Tamil Nadu) సంబంధించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది బీజేపీ. ఇటీవల తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసైని..
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(BJP) తన అభ్యర్థుల మూడో జాబితాను(BJP Third List) విడుదల చేసింది. ఈ జాబితాలో కేవలం తమిళనాడుకు(Tamil Nadu) సంబంధించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది బీజేపీ. ఇటీవల తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసైని.. చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. వినోజ్ పి సెల్వమ్‌ను చెన్నై సెంట్రల్, వెల్లూర్ - ఏ.సీ షణ్ముగం, కృష్ణగిరి - సి. నరసింహన్, నీలగిరి(ఎస్సీ) - ఎల్ మురుగన్, కోయంబత్తూర్ - కే. అన్నామలై. పెరంబలూర్ - టీఆర్. పారివేందర్, తూతుక్కుడి - నైనార్ నాగేంద్రన్, కన్నియకుమారి - పోన్ రాధాకృష్ణన్. మూడో జబితాలో మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులను ఖరారు చేసింది.
కాగా, బీజేపీ తన మొదటి జాబితాలో 194 మంది అభ్యర్థుల స్థానాలను ఖరారు చేయగా.. రెండో జాబితాలో 72 మంది పేర్లను ప్రకటించారు. ఇప్పుడు మూడో జాబితాగా 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ జాబితాలో తమిళనాడు రాష్ట్ర అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది బీజేపీ. మొత్తంగా ఇప్పటి వరకు 275 మంది పేర్లను బీజేపీ ఖరారు చేసింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370, ఎన్డీయే కూటమి 400 స్థానాలకు పైగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.