Share News

BJP state president: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో..?

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:38 PM

రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మరెంత కాలం ప్రాణం ఉంటుందోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) ఎద్దేవా చేశారు. ప్యాలెస్‌ మైదానంలో బీజేపీ రాష్ట్ర ప్రత్యేక కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన విజయేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పాపాలలో మునిగిపోయిందని విమర్శించారు.

BJP state president: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో..?

- తారస్థాయికి అంతర్గతపోరు

- గ్యారెంటీల పేరుతో మోసం

- కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర

- సత్తా ఉంటే ఎన్నికలకు రండి: యడియూరప్ప సవాల్‌

బెంగళూరు: రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మరెంత కాలం ప్రాణం ఉంటుందోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) ఎద్దేవా చేశారు. ప్యాలెస్‌ మైదానంలో బీజేపీ రాష్ట్ర ప్రత్యేక కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన విజయేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పాపాలలో మునిగిపోయిందని విమర్శించారు. ప్రభుత్వానికి అస్తిరత వెంటాడుతోందన్నారు. అంతర్గత కలహాలు తారస్థాయికి చేరాయని అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం డీకే శివకుమార్‌(DK Shivakumar) ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఉపముఖ్యమంత్రి పదవుల కోసం ఏకంగా ఐదారుగురు బహిరంగంగానే మాట్లాడుతున్నారని అన్నారు.

ఇదికూడా చదవండి: Hero Darshan: హీరో దర్శన్‌ కస్టడీ మరో14 రోజులు పొడిగింపు


pandu2.2.jpg

ఇండియా కూటమి అబద్దాల ప్రచారంతో అధికారంలోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. అధికార దర్పంతో రాష్ట్రంలో 18-20 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారని గుర్తు చేశారు. గ్యారెంటీలతో మంచి చేస్తామని చెప్పుకుని అధికారంలోకి వచ్చి కాంగ్రెస్‌ అన్ని చార్జీలు పెంచేందుకు సిద్దమై సాధారణ కుటుంబీకులు జీనం సాగించే పరిస్థితి లేకుండా చేశారని విమర్శించారు. వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌లో రూ.187 కోట్ల అవినీతి చోటుచేసుకుందని పేర్కొన్నారు. ముడాలో ఏకంగా రూ.3వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని అన్నారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ హిందువులను అవమానించారని అన్నారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌ రాధామోహన్‌ దాస్‌ మాట్లాడుతూ 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమి చూశామని, ఏడాదిలోనే ప్రజలు బీజేపీ వైపే ఉన్నారనేది స్పష్టమైందని తెలిపారు.


ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుటుంబీకులు ముడా స్థలాల్లో భారీగా అవినీతికి పాల్పడ్డారని, సీఎం రాజీనామా కోరుతూ నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్‌నేత బీఎస్‌ యడియూరప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ- జేడీఎస్‌(BJP-JDS) కూటమి 19 లోక్‌సభ స్థానాలు గెలిచిందని, తద్వారా 142 అసెంబ్లీ స్థానాలలో విజయం బీజేపీ వైపే ఉన్నట్లు అన్నారు. సీఎం, డీసీఎం ఉండే 17 స్థానాలలో గెలుపు తమదే అన్నారు. గెలుస్తామనే సత్తా ఉంటే సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల వేళ తమ నుంచే కొన్ని తప్పిదాలు జరిగినందునే సీట్లు తగ్గాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. శాసనసభలో ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలపై పోరాటం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ, జిల్లా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 12:38 PM