Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Jul 12 , 2024 | 10:59 AM

Telugu Latest News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మినిట్ టు మినిట్ తాజా వార్తలను ఇక సులభంగా తెలుసుకోవచ్చు. మీకోసమేు ప్రత్యేకంగా లైవ్ అప్‌డేట్స్ ప్లాట్‌ఫామ్.. సమస్త సమాచారం ఇక్కడే చూసేయండి.

Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-07-12T21:48:34+05:30

    యోధుల చరిత్ర చదివి, స్ఫూర్తిగా తీసుకున్నా: వెంకయ్య నాయుడు

    • విశాఖపట్టణం: పోరాటయోధులు, మహనీయుల చరిత్రలు చదివి, వాటిని స్పూర్తిగా తీసుకున్నా: వెంకయ్య నాయుడు

    • కార్యదీక్ష ఉంటే, కార్య దక్షత అదే వస్తుంది

    • రాజకీయాల్లో కష్టపడే మనస్తత్వం అవసరం, ఎదగాలంటే ఒదిగి ఉండాలనే లక్ష్యం కలిగి ఉండాలి

    • రాజకీయాల్లో సిద్ధాంతం తగ్గిపోతుంది- రాద్దాంతం పెరిగిపోతుంది

    • రాజకీయాల పట్ల గౌరవం తగ్గిపోతుంది

    • బూతులు మాట్లాడే వారికి ప్రజలు సమాధానం చెప్పారు. ఎన్నికల్లో క్రమంగా మార్పు వస్తోంది

    • ఒక్కో శాసనసభ స్థానానికి వందల కోట్లు ఖర్చుపెడుతున్నారు..?

    • సాగరతీరాన్ని చూస్తోంటే ఎంతో ఉత్సాహం. నాకుంది మిత్రసంపద. అది అన్నింటకన్నా మిన్న

    • విభజన వల్ల ఏపీ నష్టపోకూడదని ఎంతో జాగ్రత్త పడ్డాం

    • ఈ ప్రాంతానికి ప్రాజెక్టులు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం

    • ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు మన ప్రాంతానికి మేలు చేయాలనే తపన ఉండేది

  • 2024-07-12T21:42:46+05:30

    టీచర్లు మారాలి: ఎంపీ చామల కిరణ్

    • కొందరు టీచర్ల పద్ధతిని తప్పు పట్టిన ఎంపీ చామల కిరణ్

    • ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయాలంటే టీచర్ల సహకారం అవసరం

    • సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేసి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని చూస్తున్నారు.

    • టీచర్లు మాత్రం పట్టణాలకు దగ్గర్లో ఉంటామని అంటున్నారు

    • ప్రభుత్వానికి తోడ్పాటునందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిద్దడంలో టీచర్లు భాగస్వాములు కావాలి

  • 2024-07-12T21:34:37+05:30

    వెంకయ్య నాయుడు చలవే

    • విశాఖపట్టణం: రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఏ రకమైన నష్టం వస్తుందో గ్రహించి పలు ప్రతిపాదనలు పెట్టారు: మిజోరామ్ గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు

    • తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న వంటి యోధులవద్ద వెంకయ్య నాయుడు ప్రస్థానం ప్రారంభమైంది.

    • దేశంలో స్మార్ట్ సిటీలుగా ఎంపికైన మూడు నగరాల్లో విశాఖకు స్ధానం లభించిందంటే వెంకయ్యనాయుడు చలువే

    • గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలకు రూపకల్పన వెంకయ్యనాయుడు వల్లే జరిగింది.

  • 2024-07-12T21:13:13+05:30

    ఐఐటీ ఇంజినీర్లతో అధ్యయనం

    • అమరావతి: అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాల పటిష్టత తెలుసుకునేందుకు అధ్యయనం

    • ఐకానిక్ భవనాల ఫౌండేషన్ పటిష్టత నిర్దారణ కోసం ఐఐటీ చెన్నైకు బాధ్యతలు

    • ప్రజా ప్రతినిధులు,అధికారులు, ఉద్యోగుల క్వార్టర్లు పటిష్టత నిర్దారణ బాధ్యతలు ఐఐటీ హైదరాబాద్‌కు అప్పగింత

    • సీఆర్డీఏకు గతంలో పనిచేసిన 47 మంది కన్సల్టెంట్స్ వెనక్కి వెళ్ళిపోయారు

    • కొత్తగా టెండర్లు పిలిచి కన్సల్టెంట్లను నియమించుకోవాలి, సీఆర్డీఏకు సిబ్బంది కొరత ఉంది.

    • అమరావతికి సంబంధించిన నిర్ణయం సీఎం అధ్యక్షతన తీసుకుంటాం: మంత్రి నారాయణ

  • 2024-07-12T21:07:28+05:30

    • డ్రగ్స్ కంట్రోల్ చేయాలి: ఎమ్మెల్యే రాజా సింగ్

    • హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ చేయాలి: ఎమ్మెల్యే రాజా సింగ్

    • ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ క్రైమ్ కంట్రోల్ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కంట్రోల్ చేయాలి

    • డ్రగ్స్ కంట్రోల్ కోసం హీరో, హీరోయిన్లు ముందుకు రావాలి

    • చిరంజీవి మాదిరిగా హీరోలు, హీరోయిన్లు డ్రగ్స్ కంట్రోల్ కోసం కృషి చేయాలి

    • ట్విన్ సిటీస్‌లో అన్ని పబ్స్‌లో డ్రగ్స్ సప్లై జరుగుతుంది.

    • డ్రగ్స్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది

  • 2024-07-12T21:00:36+05:30

    కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే

    • హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి వరస షాక్‌లు

    • ఈ రోజు ప్రకాష్ గౌడ్.. రేపు అరికపూడి గాంధీ

    • సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్న గాంధీ

    • అరికపూడి గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీలోకి పలువురు కార్పొరేటర్లు

  • 2024-07-12T20:43:53+05:30

    వెంకయ్య నాయుడు క్లాసులు చెబితే బాగుంటుంది

    • విశాఖపట్టణం: కొత్తగా 88 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు.

    • కొత్త ఎమ్మెల్యేలు వెంకయ్యనాయుడు ప్రసంగాలు వింటే నాలెడ్జ్ వస్తోంది.

    • ఉత్తరాంధ్రకు ఆప్తుడుగా వెంకయ్య నాయుడు ఉన్నారు

    • వెంకయ్యకు ఏ మాత్రం అగౌరవం రాకుండా చూసుకుంటాను

    • తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ క్యాంపులు పెడతాం.‌

    • వారికి వెంకయ్యనాయుడు క్లాసులు ఇవ్వాలని కోరుతున్నాం

  • 2024-07-12T19:27:49+05:30

    కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే

    • హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోన్న చేరికలు

    • సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

    • జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి

    • సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అనుచరులు

  • 2024-07-12T19:22:10+05:30

    స్ఫూర్తిప్రదాత

    • విశాఖపట్టణం: క్రమశిక్షణకు మారుపేరు వెంకయ్యనాయుడు: హోం మంత్రి వంగలపూడి అనిత

    • వెంకయ్య నాయుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.

    • విద్యార్థి స్థాయి నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి వెళ్ళారు.

    • వెంకయ్యనాయుడు ప్రసంగాలు స్ఫూర్తిదాయకం, ఎందరికో ఆదర్శం.

  • 2024-07-12T19:12:49+05:30

    ఇంటింటికీ మంచినీరు అందించడమే లక్ష్యం

    • అమరావతి: ఇంటింటికీ మంచినీరు సరఫరా చేయడమే లక్ష్యం

    • తన నివాసంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

    • ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తాం

    • పాల్గొన్న పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రపంచ బ్యాంక్ జలవనరుల విభాగం సలహాదారు రమేష్, మాథ్యూస్ ముల్లికల్

  • 2024-07-12T18:29:20+05:30

    రైతు సోదరి నాగేంద్రమ్మకు సీఎం చంద్రబాబు అభినందనలు

    • అమరావతి: ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ 2024 అవార్డు

    • 2016-19 మధ్య 5 లక్షల ఎకరాల భూమి సేంద్రీయంగా మార్పు

    • APCNF రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తుంది.

    • వాతావరణ మార్పులకు తట్టుకుంటుంది. ఆరోగ్యకర, పోషక ఆహారాన్ని అందిస్తుంది

    • ACPNF తరపున అవార్డు అందుకున్న రైతు సోదరి నాగేంద్రమ్మను అభినందనలు: సీఎం చంద్రబాబు

  • 2024-07-12T18:19:25+05:30

    అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్

    • ఢిల్లీ: సీఎం కేజ్రీవాల్‌కు ఊరట

    • లిక్కర్ పాలసీ, ఈడీ కేసులో షరతులతో మధ్యంతర బెయిల్

    • బెయిల్ మీద బయటకి వచ్చాక సీఎం ఆఫీసు, సెక్రటేరియట్‌కు వెళ్లొద్దు: సుప్రీం కోర్టు

    • గవర్నమెంట్ అఫిషీయల్ ఫైల్స్ పై సంతకాలు పెట్టొద్దు

    • సంతకం పెట్టాల్సి వస్తే లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి

    • లిక్కర్ పాలసీ కేసులో తన పాత్ర గురించి ఎలాంటి కామెంట్స్ చేయకూడదు

    • లిక్కర్ పాలసీ కేసులో నిందితులు, సాక్ష్యులను కలువకూడదు.

  • 2024-07-12T18:12:01+05:30

    విశాఖలో వెంకయ్య నాయుడు ఆత్మీయ సమావేశం

    • విశాఖపట్టణం: రుషికొండ ఏ 1 కన్వెన్షన్ సెంటర్‌‌లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆత్మీయ సమావేశం

    • 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సమావేశం

    • పాల్గొన్న ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి వంగలపూడి అనిత తదితరులు

  • 2024-07-12T18:08:18+05:30

    తీరప్రాంత సమస్యలపై ఫోకస్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత కోత ప్రమాద నివారణపై ప్రత్యేక దృష్టి

    • తీర ప్రాంత నిర్వహణపై ఎన్‌సీసీఆర్ ప్రణాళిక విడుదల

    • తీర ప్రాంత నిర్వహణకు ఎన్‌సీసీఆర్, ఏపీసీజడ్ఎంఏల మధ్య అవగాహన ఒప్పందం

    • రాష్ట్రానికి 973 కిలోమీటర్లకుపైగా సుదీర్ఘ సముద్ర తీరం ఒక వరం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • తీర ప్రాంత సంరక్షణ, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది

    • రాష్ట్రంలో సముద్రపు కోత ఆందోళన కలిగిస్తోంది. కోత ప్రమాదాన్ని నివారించేoదుకు ప్రత్యేక దృష్టిసారించాం

    • ఇటీవల ఉప్పాడ తీరంలో కోతపై సమీక్షించి, నిపుణులతో చర్చించాం:డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • రాష్ట్రంలో తీరం వెంబడి కోత సమస్య ఎక్కడెక్కడ ఉంది, రక్షణ చర్యల గురించి అధ్యయనం చేయాలని ఆదేశాలు ఇచ్చాం

    • తీరప్రాంత నిర్వహణ ప్రణాళికను విడుదల చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

    • నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ నిపుణులతో ప్రణాళిక రూపొందించాం.

    • ఈ ప్రణాళిక తీర ప్రాంతంలో కోత, కెరటాల శక్తి తగ్గింపుతోపాటు కోత, కెరటాల తీవ్రత నుంచి వచ్చే ప్రమాదాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది

    • కొత్త ఓడ రేవులు, షిప్పింగ్ హార్బర్ల కోసం అనువైన ప్రదేశాలు ఎంచుకోవడానికి ఈ ప్రణాళిక దోహదపడుతుంది.

    • ఎస్‌సీసీఆర్, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మెనేజ్ మెంట్ అథారిటీల మధ్య ఒప్పందం.

  • 2024-07-12T17:41:13+05:30

    గుంతలు పూడ్చేందుకు రూ.300 కోట్లు..!!

    • అమరావతి: రోడ్లు భవనాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • గత ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు

    • గుంతలు పూడ్చేందుకు రూ.300 కోట్లు అవసరం

    • అత్యవసర పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం

    • రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై అధికారులు, ఐఐటీ ప్రొఫెసర్లతో సీఎం సమీక్ష

    • గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదు

    • వాహనదారులు, ప్రజలు ఐదేళ్లు నరకం చూశారు: సీఎం చంద్రబాబు

  • 2024-07-12T17:01:57+05:30

    ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు..

    • ఫోన్ టాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు మరొకసారి కోర్టులో చుక్కెదురు.

    • ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్ మరోసారి కొట్టివేసిన నాంపల్లి కోర్టు.

    • ఫోన్ టాపింగ్ వ్యవహారంలో నిందితులు వేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన నాంపల్లి క్రిమినల్ కోర్టు.

    • అరెస్టు చేసి వంద రోజులు అయినా చార్షీ‌షీట్ దాఖలు చేయాలని డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నిందితులు.

    • భుజంగరావు, రాధా కిషన్, తిరుపతన్న బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన కోర్టు.

    • ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు మ్యాండెటరీ బెయిల్ పిటిషన్ వేశారు.

    • పిటిషన్ దాఖలు చేసిన నలుగురు నిందితులు

    • A2 ప్రణీత్ రావు, A3 తిరుపతన్న, A4 భుజంగరావు, A5 రాధాకిషన్ రావు.

    • ఇప్పటివరకు పోలీసులు చార్జిషీట్ వేయలేక పోయారు: నిందితుల తరుపు న్యాయవాదులు

    • కేసు నమోదు, నిందితులను అరెస్ట్ చేసి వంద రోజులు దాటింది: నిందితుల తరపు న్యాయవాది

    • విచారణకు ముందు జడ్జి చాంబర్‌లోకి విచారణ అధికారులు వెళ్లారు:

    • చార్జిషీట్ వెనక్కు ఇచ్చినంత మాత్రానా వేయనట్టు కాదు: పోలీసుల తరపు న్యాయవాది

    • విచారణ కీలక దశలో ఉంది బెయిల్ ఇవ్వొద్దు: పోలీసులు

    • ఇరుపక్షాల వాదనలు పూర్తయిన నేపథ్యంలో బెయిల్‌ను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది.

  • 2024-07-12T16:52:23+05:30

    అంబానీ వారి పెళ్లి వేడుకలో జాన్ సీనా సందడి..

    అనంత్ అంబానీ(Anant Ambani), రాధిక మర్చంట్‌లు(radhika merchant) ఈరోజు వివాహం చేసుకోనున్నారు. లగ్న ముహూర్తం ప్రకారం ఈరోజు రాత్రి 9:30 గంటలకు వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు అనేక మంది ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ముంబై చేరుకుంటున్నారు. అంబానీ వారి పెళ్లి వేడుకకు.. డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ జాన్ సీనా కూడా వచ్చాడు. జాన్ సీనాను చూసిన మీడియా ఫోటోలు తీస్తుండగా.. ఇండియన్ స్టైల్‌లో నమస్కారం చెబుతూ చిరునవ్వులు చిందించాడు.

  • 2024-07-12T16:48:33+05:30

    ముగిసిన కురియన్ కమిటీ అభిప్రాయ సేకరణ

    • గురువారం నాడు 16 లోక్‌సభ అభ్యర్థుల అభిప్రాయం తీసుకున్న కురియన్ కమిటీ.

    • శుక్రవారం నాడు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీల అభిప్రాయం తీసుకున్న కమిటీ.

    • ఈనెల 21 ఏఐసీసీకి రిపోర్ట్ ఇవ్వనున్న కురియన్ కమిటీ.

  • 2024-07-12T16:46:35+05:30

    కేసీఆర్‌ను జైలుకు పంపడమే నా రెండో లక్ష్యం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    Komatireddy-Raj-Gopal-Reddy.jpg

    • నా ఏకైక లక్ష్యం నెరవేరింది.

    • ఇంకో లక్ష్యం కేసీఆర్‌ని జైలుకు పంపడమే.

    • బీఆర్ఎస్ సమాధి అయ్యింది.

    • తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.

    • బీఆర్ఎస్ కుటుంబ పార్టీ.

    • బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

    • అందరికి కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉంటది.

    • బీఆర్ఎస్‌లో ఎవ్వరూ ఉండరు.

    • హరీష్ రావు బీజేపీలోకి పోతాడు.

    • జగదీశ్ రెడ్డిని మేము చేర్చుకోము.

    • ఆయన జైలుకు పోయే వ్యక్తి.

    • జైలుకి పోయే వ్యక్తులను మేము చేర్చుకోము.

    • కురియన్ కమిటీని కలిశాను.

    • పార్లమెంట్ ఎన్నికలు ఏవిధంగా జరిగాయని అడిగారు.

    • భువనగిరి ఇంచార్జ్‌గా మెజారిటీతో గెలిపించానని చెప్పాను.

    • భువనగిరిలో బీజేపీ గెలుస్తుందని టాక్ ఉంది.

    • నేను ఇంచార్జ్‌గా వెళ్ళాక కాంగ్రెస్ వైపు మళ్లింది.

    • ఆరుగురు ఎమ్మెల్యేలు,ఒక అభ్యర్ది కలిసి కట్టుగా పని చేశాము.

    • రెండు లక్షల మెజారిటీ వచ్చిందని చెప్పాను.

  • 2024-07-12T16:36:10+05:30

    Watch Video: వావ్.. మౌంట్ ఎవరెస్ట్ ఇంత అందంగా ఉంటుందా..!

    Mount Everest: ఎవరెస్ట్ శిఖరం పేరు వినడమే కానీ.. చూసిన వాళ్లు, దానిని సమీపించిన వాళ్లు, ఆ పర్వతాన్ని అధిరోహించిన వాళ్లు చాలా స్వల్పం అని చెప్పొచ్చు. అయితే, తాజాగా చైనాకు చెందిన డ్రోన్‌.. ఎవరెస్ట్ పర్వతం మొత్తాన్ని చుట్టేసింది. ఎవరెస్ట్ పర్వతం ఎలా ఉంటుందో క్లియర్‌గా వీడియో తీసింది. DJI మావిక్ 3 డ్రోన్ సహాయంతో తీసిన ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఐకానిక్ బేస్ క్యాంప్, క్యాంప్ సైట్, ఖుంబూ ఐస్‌ఫపాల్, హిమానీనదాలు చూసేందుకు ఎంతో అంతంగా కనిపిస్తున్నాయి. ఈ ఫుటేజీలో పర్వతారోహకులు పర్వత్రంపైకి ఎక్కేవారు, దిగేవారు కూడా కనిపిస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. మౌంట్ ఎవరెస్ట్‌ అందాలను చూసేయండి.

  • 2024-07-12T16:11:19+05:30

    అమరావతి: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చన్నాయుడు..

    Atchennaidu.jpg

    • శుక్రవారం నాడు సచివాలయంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, డెయిరీ డెవలెప్మెంట్, మత్స్యశాఖామంత్రిగా భాద్యతలు స్వీకరించారు అచ్చన్నాయుడు.

    • ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు మంత్రి.

    • ఏపీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం.

    • రాష్ట్ర జనాభాలో 62శాతం మంది 3.02 కోట్ల మంది వ్యవసాయం, వ్యవసాయ అనుభంద రంగాలపై ఆధారపడి ఉన్నారు.

    • వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్ధక, డెయిరీ డెవలెప్మెంట్, మత్యశాఖలను నాకు సీఎం చంద్రబాబు నాయుడు అప్పగించారు.

    • ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం అయిన అత్యంత ప్రాధాన్యమైనదిగా తీసుకోవాల్సి ఉంటుంది.

    • 2019 నుండి 2024 వరకూ ఈ రాష్ట్రాన్ని పాలించారో ఆయన ఈ శాఖకు తాళం వేశాడు.

    • వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యం కలిగింది భూమి కాబట్టి భూసారాన్ని ప్రభుత్వం ఎప్పటి కప్పడు పరీక్ష చేయాలేదు.

    • గడచిన ఐదు సంవత్సారాల్లో ఒక్క భూసార పరీక్ష కూడా చేయలేదు.

    • విత్తనాలు లేవు, ఎరువులు లేవు, పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదు.

    • పంట అమ్ముకుంటే ఐదారు మాసాలకు డబ్బులు ఇవ్వలేదు.

    • ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీలోని ప్రతి రైతు ధైర్యంగా ఉంటాడు.

    • ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి.

    • సాధ్యమైనంత వరకూ ఆ సమస్యకు పరిష్కారం చూపుతాం.

    • 2014 నుండి 2019 వరకూ వ్యవసాయ అనుభంద రంగాలకు ఎలాంటి కార్యక్రమాలు చేశారో అవన్ని మరళా పునఃప్రారంభించమని సీఎం ఆదేశాలు ఇచ్చారు.

    • అందులో భాగంగానే మూడు డిపార్టమెంట్‌లలో ఆరు ఫైళ్లపై సంతకం చేశాను.

    • వ్యవసాయ శాఖలో మొదటిది పొలం పిలుస్తోంది.

    • ఈ కార్యక్రమాన్ని 23 వ తారీఖున రాష్ట్రం మొత్తం మీద ప్రారంభిస్తున్నాం.

    • ప్రతి మంగళవారం, బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ అనుభంద అధికారులు, ప్రజాప్రతినిధులు పొలాల దగ్గరకు వెళ్లి రైతులకు సాంకేతిక పరిజ్జానం అందించాలి.

    • ఖరీఫ్‌లో నాలుగు మాసాలు, రబీలో నాలుగు మాసాలు పాటు ఈ కార్యక్రమం ఉంటుంది.

    • రెండవ సంతకం రైతుకు వ్యక్తిగత యాంత్రీకరణ పరికరాలు అందిచడంపై చేశాం.

    • గత ఐదు సంవత్సారాల్లో యాంత్రీకరణ అనేమాటే ఈ రాష్ట్రంలో వినింపిచలేదు.

    • గతంలో టీడీపీ హయాంలో 3.24 లక్షల మంది రైతులకు రూ. 988 కోట్లు ఖర్చు పెట్టి వ్యక్తిగతంగా సబ్సిడీపై యాంత్రీకరణను ప్రోత్సహించాం.

    • ఈ ఐదేళ్లలో చివరకు కొడవలి పిడి కూడా ఇవ్వాలేదు.

  • 2024-07-12T16:05:21+05:30

    ఏబీన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. అప్కోలో అవినీతిపై స్పందించిన మంత్రి..

    • ఆప్కో చేనేతలో జరిగిన అక్రమాలపై స్పందించిన చేనేత జౌళి శాఖ మంత్రి సవిత.

    • జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నేతన్నలకు మరణ శాసనం రాశారు.

    • గత 5 సంవత్సరాలుగా ఆప్కో, చేనేతలో జరిగిన కుంభకోణంపై విచారణ చేపడుతాం.

    • ఆప్కో చేనేత కార్మికులను స్వలాభం కోసం నాశనం చేశారు.

    • ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు చేనేత కార్మికులు వలస వెళ్తున్నారు.

    • చేనేత రంగాన్ని రాష్ట్రంలో నిర్వీర్యం చేశారు.

    • జరిగిన అన్నింటిపైనా విచారణ జరిపిస్తాం.

    • నేతన్న నేస్తం పేరుతో వైసీపీ కార్యకర్తలకు నేతన్న నేస్తం ఇచ్చారు.

    • సబ్సిడీపై ముడిసరుకు పనిముట్లు ఇస్తున్నాం.

    • సొసైటీలను ఏర్పాటు చేసి చేనేత కార్మికులను ఆదుకుంటాం.

    • గత ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలకు పెద్ద పీటవేశారు.

    • తెలుగుదేశం ప్రభుత్వంలో అర్హులైన ప్రతి చేనేత కార్మికుడిని ఆదుకుంటాం.

  • 2024-07-12T16:02:47+05:30

    నాంపల్లి ఫైరింగ్ ఘటనపై పోలీసుల ప్రకటన..

    • సెంట్రల్ జోన్ డెకాయ్ బృందాలు నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించారు.

    • నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు.

    • వారు గొడ్డలి క్యారీ చేస్తున్నట్టు గుర్తించాము.

    • వారి వివరాలు తెలుసుకునేందుకు డెకాయి టీం వెళ్లిన సందర్భంలో నిందితులు పోలీసులపై దాడి చేశారు.

    • గొడ్డలి, రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు.

    • గొడ్డలి కిందపడేసి సరండర్ కావాలని పోలీసులు సూచించారు.

    • పోలీసుల హెచ్చరికలు పట్టించుకోని నిందితులు దాడికి యత్నించారు.

    • దీంతో సెల్ఫ్ డిఫెన్స్‌లో భాగంగానే కాల్పులు జరపాల్సి వచ్చింది.

    • ఏఆర్ కానిస్టేబుల్ కాల్పులు జరపటంతో రాజు అనే నిందితుడికి గాయమైంది.

    • రాజును చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించాము.

    • ఈ ఘటనకు ముందు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర ఒక దొంగతనం చేశారు.

    • ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న ప్యాసింజర్ నుండి డబ్బు కాజేశారు.

    • గతంలో వీరిపై పిక్ పాకెట్ కేసులు ఉన్నాయి.

  • 2024-07-12T16:00:30+05:30

    తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ బదిలీ.. కొత్త సీఈవో ఎవరంటే..

    • తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ బదిలీ.

    • కొత్త సీఈఓ గా సుదర్శన్ రెడ్డిని నియమకం.

    • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.

    • సీఈఓగా భాద్యతలు తీసుకున్న సుదర్శన్ రెడ్డి.

  • 2024-07-12T15:58:43+05:30

    సీఎం రేవంత్‌పై రఘనందనరావు విసుర్లు..

    • ఏడు నెలల్లో గులాబీ రంగు మూడు వర్ణాలు అయింది తప్ప.. పాలనలో మార్పు లేదన్న మెదక్ ఎంపీ.

    • రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోన్న కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు బుద్ది చెప్తాం.

    • పదవికి రాజీనామా చేస్తేనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటాం.

    • బీజేపీలో చేరటానికి చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు.

    • ఉప ఎన్నికకు సిద్దంగా ఉంటేనే చేర్చుకుంటామని టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలకు చెప్పినం.

    • ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్‌ను అరెస్ట్ చేయటానికి రేవంత్ సర్కార్ ఎందుకు భయపడుతోంది.

    • అవినీతికి పాల్పడిన సంబంధిత మంత్రులను అరెస్ట్ చేయటానికి మీనమేషాలు లెక్కిస్తోంది.

    • ఏడు నెలల్లో.. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, యూ ట్యాక్స్ రాజ్యమేలుతోంది.

    • ఎన్నికల హామీ మేరకు వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి.

    • రుణమాఫీ, రైతు భరోసా కోసం పోరాటం చేయాలని కార్యవర్గ సమావేశాల్లో తీర్మానించాం.

    • నిరుద్యోగ యువతకు అండగా ఉండాలని నిర్ణయించాం.

    • నిరుద్యోగులపై ప్రతిపక్షంలో ఒకమాట.. అధికారంలో వచ్చాక మరోమాట కాంగ్రెస్ మాట్లాడుతోంది.

    • ఓటమి భయంతోనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తోంది.

    • నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం.

    • నిరుద్యోగ భృతికి రూ. 4,116 లేవు కానీ.. సీఎం రేవంత్ నాలుగు లక్షల నెల జీతం తీసుకుంటున్నాడు.

    • దేశంలో ఎక్కువ నెల జీతం తీసుకుంటోన్న సీఎం‌ రేవంత్ రెడ్డి.

    • కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదు.

  • 2024-07-12T15:56:09+05:30

    ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదు: శ్రీధర్ బాబు

    • పార్టీలోకి వస్తాం అంటే వద్దంటారా ఎవరైనా.

    • ఫిరాయింపుల కోసం మేం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు.

    • బీఆర్ఎస్ లాగా మేం చేరికలు చేసుకోవడం లేదు.

    • అప్పుడు కేసీఆర్ మా ఎమ్మెల్యేలను భయపెట్టి చేర్చుకున్నారు.

    • ఇపుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తామంతట తామే కాంగ్రెస్‌లో చేరుతున్నారు.

    • ప్రజలకు సేవ చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు వస్తున్నారు.

    • బీఆర్ఎస్‌కు ఇపుడు మమల్ని అడిగే, మాట్లాడే నైతిక హక్కు లేదు.

    • బీఆర్ఎస్ పార్టీలో మిగిలే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరో వారే చెప్పాలి.

  • 2024-07-12T14:52:35+05:30

    సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ..

    • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరం.

    • విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివిధ పథకాలు ఆగిపోవడం విచారకరం.

    • అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా? అనే ఆందోళన బ్రాహ్మణ సామాజిక వర్గంలో నెలకొంది.

    • అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది.

    • దీంతో సంక్షేమ పరిషత్ ద్వారా అమలు చేసే పథకాలు నిలిచిపోయాయి.

    • ఇప్పటికైనా మీరు స్పందించి, ఎంతో మంది పేద బ్రాహ్మణులకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని కోరుతున్నాను.

  • 2024-07-12T14:50:11+05:30

    Giorgia Meloni: బైడెన్ ఆలస్యం.. ప్రధానమంత్రి జార్జియా మెలోని ఎక్స్‌ప్రెషన్ వైరల్..!

    ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని మరోసారి ప్రధాన వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వాషింగ్టన్‌లో నాటో శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా మూడవ రోజు సమావేశాలు ప్రారంభించేందుకు ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని సహా ఇతర దేశాధినేతలు వేదికపై ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆలస్యమవడంతో ఆయన కోసం ఎదురు చూస్తూ నిల్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మరో ఇద్దరు నాయకులతో కలిసి ఆమె నిల్చున్నారు. బైడెన్ ఆలస్యంపై ఆమె అసహనం ప్రదర్శించారు. కళ్లు తిప్పుతూ.. టైమ్ చూస్తూ విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • 2024-07-12T14:39:07+05:30

    కవితపై సీబీఐ కేసు.. రౌస్ అవెన్యూ కోర్టులో కీలక విచారణ..

    kavitha-mlc.jpg

    • ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశం, సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై విచారణ.

    • సీబీఐ చార్జ్ షీట్‌లో తప్పులున్నాయి.. కవిత తరపు న్యాయవాది

    • నితేష్ రానా.

    • తప్పులు లేవన్న సీబీఐ తరపు న్యాయవాది.

    • చార్జ్ షీట్‌లో తప్పులున్నాయన్న కోర్ట్ ఆర్డర్ ఫైల్ చేసారా? అని అడిగిన జడ్జి కావేరి భవేజా.

    • చార్జ్ షీట్‌లో తప్పులున్నాయన్న కోర్ట్ ఆర్డర్ ఫైల్ చేయాలన్న జడ్జి కావేరి భవేజా.

    • కోర్ట్ ఆర్డర్ అప్‌లోడ్ కాలేదన్న కవిత తరపు న్యాయవాది నితేష్ రానా.

    • తదుపరి విచారణ జూలై 22 కి వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు.

    • డిఫాల్ట్ బెయిల్, చార్జ్ షీట్‌లో తప్పులపై విచారణ జరిగేంత వరకు చార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయిదా వేయాలన్న కవిత తరపు న్యాయవాది నితేష్ రానా.

    • చార్జ్ షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశం, కవిత డిఫాల్ట్ బెయిల్‌కి సంబందం లేదన్న సీబీఐ తరపు న్యాయవాది.

    • చార్జ్ షీట్ పూర్తిగా లేదని వాదించడం లేదు.. తప్పుగా ఉందని చెబుతున్నానన్న నితేష్ రానా.

  • 2024-07-12T14:33:14+05:30

    జులై 17 నుంచి రొట్టెల పండుగ

    kotamreddy.jpg

    • నెల్లూరు: ప్రపంచ ప్రఖ్యాత బారాషహీద్ దర్గాలో జులై 17వ తేది నుంచి రొట్టెల పండుగ ప్రారంభం కానుంది.

    • గతంలో రొట్టెల పండుగని రాష్ర్ట పండుగగా ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం.

    • బారాషహీద్ దర్గా, రొట్టెల పండుగ ఏర్పాట్లని పరిశీలించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

    • ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్..

    • రొట్టెల పండుగకి దేశ విదేశాల నుంచి కులమతాలకి అతీతంగా లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.

    • ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.

    • బారాషహీద్ దర్గా వ్యక్తిగతంగా నాకూ చాలా విశ్వాసం.

    • దర్గా అభివృద్దికి గతంలో దివంగత ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి చేసిన కృషి మాటల్లో చెప్పలేం.

  • 2024-07-12T14:28:58+05:30

    జగన్‌పై వైఎస్ షర్మిల మాస్ సెటైర్లు..

    ys sharmila-jagan.jpg

    • విజయవాడ: అన్న జగన్ పై చెల్లెలు షర్మిల సెటైర్లు.

    • వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ.

    • రాజశేఖర్ రెడ్డికి వైసీపీ జగన్‌కి ఎటువంటి సంబంధం లేదు.

    • వైసీపీ పార్టీ బీజేపీకి తొత్తులుగా పని చేశారు.

    • వైసీపీ.. బీజేపీకి తోక పార్టీ.

    • రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి రోజున జగన్ ఏం చేశారు.

    • ఇడుపులపాయలో కూడా 5నిముషాలు మాత్రమే ఉన్నారు.

    • సొంత తండ్రికి జయంతి సభ ఎలా చేయాలి.

    • సిద్ధం సభకి కోట్ల రూపాయలు ఖర్చు చేసారు.

    • కనీసం రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏం చేశారు?

    • మీరు రాజశేఖర్ రెడ్డి వారసులా?

    • బీజేపీ వారు లోక్ సభ స్పీకర్ పదవికి, మణిపూర్ జరిగిన ఘటనలకి సైతం వైసీపీ వత్తాసు పలికింది.

    • వైసీపీపై ఉన్న కోపంతో రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు కొందరు ధ్వంసం చేస్తున్నారు.

    • వైసీపీకి రాజశేఖర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు.

  • 2024-07-12T14:24:47+05:30

    వైసీపీకి మరో బిగ్ షాక్..

    YSRCP Big Shock.jpg

    • పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీకి మరో కట్టి షాక్.

    • పులిచెర్ల మండలం జడ్పీటీసీతో సహా నలుగురు ఎంపీటీసీలు, పదిమంది సర్పంచులు వైసీపీ పార్టీకి పదవులకు రాజీనామా.

    • రాజీనామాను జిల్లా అధికారులకు అందించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచులు.

    • పులిచెర్ల మండలం జడ్పీటీసీ సభ్యుడు మురళీ వైసీపీకి, జడ్పీ సభ్యత్వానికి రాజీనామా.

    • మురళితో పాటు మండలంలోని పదిమంది సర్పంచులు, నలుగురు ఎంపీటీసీలు రాజీనామా.

  • 2024-07-12T14:17:34+05:30

    ఉదయం బెయిల్.. మధ్యాహ్నం జైల్.. కేజ్రీవాల్‌కు బిగ్ షాక్..

    Delhi-High-Court-Kejriwal-B.jpg

    • ఢిల్లీ లిక్కర్ పాలసి సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.

    • జూలై 25 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు.

    • ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్.

    • అయితే, శుక్రవారం ఉదయం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఈడీ మనీలాండరింగ్ కేసులో మాత్రమే సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.

    • ఇప్పుడు సీబీఐ కేసులో కస్టడీని పొడిగించారు.

  • 2024-07-12T13:10:06+05:30

    నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కామెంట్స్..

    • జగన్ పాలనలో ముచ్చుమర్రిలో గంజాయి దొరికితే సిద్దార్ధ రెడ్డి పట్టించుకో లేదు.

    • ముచ్చుమర్రిలో చిన్నారి మృతి చెంది ఆరు రోజులు అయింది. ఇంత వరకు బాధిత కుటుంబంతో సిద్దార్ధ రెడ్డి మాట్లాడ లేదు.

    • సిద్దార్ధ రెడ్డి నేరం చేసిన వారిని పరామర్శించడానికి వెళ్తున్నారు.

    • వాసంతి మృతిపై విచారణ చేపడుతున్న పోలీసులను తన వెంట తిప్పుకుని.. యూట్యూబ్ రేటింగ్ పెంచుకునేందుకు దర్యాప్తునకు ఆటంకం కలిగించేందుకు సిద్దార్ధ రెడ్డి ముచ్చుమర్రి వెళ్తున్నాడు.

  • 2024-07-12T13:03:32+05:30

    వైసీపీ నేతల్లా దౌర్జన్యాలు చేయలేదు: ఎంపీ సీఎం రమేష్

    CM-Ramesh.jpg

    • అనకాపల్లి ఎంపీగా ఎన్నికై కడపకు రావడం ఆనందంగా ఉంది.

    • రాయలసీమ నుంచి వచ్చి ఎలా రాజకీయాలు చేస్తారని వైసీపీ నేతలు ప్రశించారు.

    • విజయమ్మ ఓటమి పాలయ్యారు మీరెంత అంటూ అపహాస్యం చేశారు.

    • విమర్శకుల నోరు మూయించేలా అనకాపల్లి ప్రజలు నన్ను గెలిపించి వారికి బుద్ది చెప్పారు.

    • వైసీపీ నేతల్లా దౌర్జన్యాలు చేయలేదు.

    • కడప జిల్లాకు ఉన్న మంచి పేరు చేడగొట్టారు.

    • మంచి పాలన అందించి కడప జిల్లాకు మంచి పేరు తెస్తాం.

    • అనకాపల్లితో పాటు సొంత జిల్లా కడపను మర్చిపోను.

    • కడప జిల్లా వాసుల రుణం తీర్చుకుంటా.

    • అనకాపల్లిలో ఉన్నా కడపను అశ్రద్ధ వహించేది లేదు.

    • పేదలకు ఇళ్ళు కట్టాలని వైసీపీకి లేదు.

    • మొదటి నుంచి నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు డబ్బులు గుంజారు.

    • కడప స్టీల్ ప్లాంట్ కోసం కృషి చేస్తా.

    • మొన్ననే స్టీల్ ప్లాంట్ విషయంపై చంద్రబాబుతో చర్చించాం.

    • యుద్ధప్రాతిపదికన స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తాం.

    • జగన్ స్థలం మార్చారే తప్ప స్టీల్ ప్లాంట్ సాధించిందేమి లేదు.

  • 2024-07-12T13:00:30+05:30

    కేసీఆరే ఆ పని చేస్తున్నారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్..

    Bandi Sanjay Kumar.jpg

    • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు.

    • స్వయంగా కేసీఆర్.. సొంత ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి పంపుతున్నారు.

    • తెలంగాణ ప్రజల ఏకైక గ్యారంటీ నరేంద్ర మోదీ.

    • అవినీతి నుంచి బయట పడేందుకు కేసీఆర్ కాంగ్రెస్‌కు సహకరిస్తున్నాడు.

    • సెక్యూరిటీ లేకుండా.. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని సవాల్.

    • నిరుద్యోగులను పోలీసుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేస్తోంది.

    • రాహుల్ గాంధీని సొంత పార్టీ వారే ప్రధాని అభ్యర్థిగా అంగీకరించలేదు.

    • రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు పెద్ద పీఠ.

    • బీజేపీ కార్యకర్తల గెలుపే రాష్ట్ర బీజేపీ నాయకత్వం లక్ష్యం.

    • కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీతో తెలంగాణ ప్రజలు మోసపోయారు.

    • కాంగ్రెస్‌ను ప్రజలు వ్యతిరేకించారనటానికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిదర్శనం.

    • తెలంగాణ ప్రజాప్రతినిధులు సైతం నరేంద్ర మోదీ మాత్రమే గ్యారంటీ అంటున్నారు.

    • ధర్మం, తెలంగాణ పేదల కోసం పోరాడేది బీజేపీ మాత్రమే.

    • బీజేపీ కార్యకర్తల పోరాటం వలనే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8సీట్లు.

    • రైతులను మోసం చేసే విషయంలో.. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుంది.

  • 2024-07-12T12:50:00+05:30

    తనపై కేసు.. స్పందించిన సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్..

    • రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు మేరకు తనపై నమోదు చేసిన FIR పై సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ స్పందించారు.

    • ‘సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి.. సాక్షాత్తూ సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను’ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

  • 2024-07-12T12:48:05+05:30

    బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ నేత సీరియస్ వార్నింగ్..

    • బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి యోగిశ్వర్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

    • శ్రీధర్ బాబుపై అనవసరపు ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులారా ఖబడ్దార్.

    • శ్రీధర్ బాబుపై మంథని బీఆర్ఎస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.

    • శ్రీధర్ బాబు ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారు.

    • బీఆర్ఎస్ అవినీతిలో పుట్టమదు పాత్ర ఉంది.

    • మంథనిలో పుట్టమధును ఎవరు పట్టించుకోవడం లేదనే హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టాడు.

    • శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు ఉంటే చూపెట్టాలి.

  • 2024-07-12T12:44:33+05:30

    సింహం స్వీట్ వార్నింగ్.. వీడియో చూస్తే అవాక్కే...

    జూ సందర్శకులు ఒక్కోసారి అతి చేస్తుంటారు. అది వారి ప్రాణాలమీదకు తీసుకువస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. కొందరు సందర్శకులు జూలో సింహ వద్దకు వెళ్లారు. సింహం ఉన్న కేజ్ వద్దకు వెళ్లి.. ఫోటోలో దించుతున్నారు. ఓ వ్యక్తి మాత్రం ఏకంగా సింహం ఉన్న కేజ్ ఫెన్సింగ్ లోపలికి చేయి పెట్టి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అయితే, ఇది గమనించిన సింహం.. అనూహ్యంగా అతనిపై ఎటాక్ చేయకుండా.. స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. సింహం తన పంజాతో అతని చేయిని తడుముతూ.. చేయి లోపలికి పెట్టొద్దన్నట్లుగా వార్నింగ్ ఇచ్చింది. అతని చేయిని బయటకు నెట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

  • 2024-07-12T12:32:34+05:30

    పెద్దమనసు చాటుకున్న సీఎం చంద్రబాబు.. కాన్వాయ్ ఆపి మరీ..

    Chandrababu-2.jpg

    • ఉండవల్లి నివాసం నుంచి సెక్రటేరియట్‌కు వెళ్తూ జనాన్ని చూసి కాన్వాయ్ ఆపిన సీఎం చంద్రబాబు.

    • నివాసం నుంచి కాన్వాయ్ బయటకు వచ్చిన వెంటనే రోడ్డుపై వినతి పత్రాలతో నిలబడిన జనం.

    • వారిని కారులో నుంచి చూసిన చంద్రబాబు.

    • ముందుకు వెళ్తూ కాన్వాయ్‌లో తన కార్ ఆపివేయించిన చంద్రబాబు.

    • అందరి వద్ద వినతి పత్రాలు తీసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం.

    • సమస్యలను పరిష్కరిస్తానని చెప్పిన చంద్రబాబు.

    • పార్టీ ఆఫీస్‌లో వినతి పత్రాలు తీసుకునేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశామని అక్కడకు వెళ్లి కూడా ఇవ్వొచ్చని చెప్పిన సీఎం.

    • సీఎం చంద్రబాబు కాన్వాయ్ ఆపి వినతి పత్రం తీసుకోవడంతో సంతోషం వ్యక్తం చేసిన సివేరి సోము భార్య.

    • నక్సల్స్ చేతిలో హతమైన సివేరి సోము భార్యను పలకరించిన సీఎం.

    • సోము భార్య ఇచ్చావతి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు.

    • సోము కొడుకు చదువు బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చిన సీఎం.

    • వైసీపీ గూండాల దాడిలో సర్వస్వం కోల్పోయాన్న అరకులోయ సర్పంచ్.

    • సర్పంచ్ శ్రీనివాస్ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు.

  • 2024-07-12T12:24:08+05:30

    రఘురామ రిటర్న్ గిఫ్ట్.. జగన్‌కు బిగ్ షాక్..

    • గుంటూరు: ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు ఫిర్యాదు మేరకు మాజీ సీఎం జగన్, ఐపిఎస్‌లు సునీల్ కుమార్, సీతారామంజనేయులు, విజయ్ పాల్‌ల పై కేసు నమోదు.

    • జిజిహెచ్ సూపరిండెంట్ డాక్టర్ ప్రభావతిపై కూడా కేసు నమోదు.

    • జూన్ 10 న గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన రఘురామ.

    • తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌పై విచారణ చేయాలని ఫిర్యాదు చేసిన రఘురామ.

    • రఘురామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నగరం పాలెం పోలీసులు.

  • 2024-07-12T12:20:41+05:30

    చెత్త నుంచి సంపద సృష్టించాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    Pawan-Kalyan.jpg

    • సాలిడ్ అండ్ లిక్విడ్ మేనేజ్మెంట్‌పై అవగాహన పెంచుకోవాలి.

    • మన జీవితంలో చెత్త ఒక భాగంగా మారింది.

    • మన దేశం నదులు, సంప్రదాయాలకు విలువ ఇస్తాం.

    • పూజలకు విలువ ఇస్తాం.. కానీ నదుల సంరక్షణకు చర్యలు తీసుకోం.

    • పంట కాలువలను డంపింగ్ యార్డులుగా మారుస్తున్నారు.

    • ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు.

    • గోవులు ఈ‌ప్లాస్టిక్ కవర్లు తిని చనిపోతున్నాయి.

    • గోవులను పూజిస్తాం.. ‌వాటి బాగు కూడా‌ చూడాలి.

    • శ్రీనివాస్ గారు 20 ఏళ్లుగా వీటిపై అధ్యయనం చేశారు.

    • మనకి పనికిరాని వస్తువులతో మరో సంపద సృష్టింవచ్చు.

    • చెత్తను ఊడ్చి పడేయటం‌వరకే.. తరువాత ఏమిటి అని ఆలోచన చేయడం‌లేదు.

    • పిఠాపురంలో తొలుత ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాం.

    • రోజుకు రెండు సార్లు చెత్త కలెక్ట్ చేసి.. కొత్త సంపద సృష్టిస్తాం.

    • ప్రజలు కూడా దీనికి బాధ్యత తీసుకుని సహకరించాలి

    • పైలెట్ ప్రాజెక్టుగా పిఠాపురంలో అన్ని‌కాలనీల్లో అమలు చేస్తాం.

    • మాస్టర్ ట్రైనర్స్‌ను ముందు రెడీ చేసి..‌ వాళ్ల ద్వారా రాష్ట్రం మొత్తం శిక్షణ ఇస్తాం.

    • ఇది వ్యక్తితో మొదలైనా.. వ్యవస్థ మొత్తం అమలు చేయాలి.

    • నా పార్టీ ఆఫీస్, నా క్యాంపు ఆఫీస్, నా నియోజకవర్గంలో నేను మొదలు పెడతా.

    • పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కూడా కొన్ని మార్పులు తీసుకువస్తాం.

    • పంచాయతీల ద్వారా మోటివేషన్ తీసుకువస్తాం.

    • 101 గ్రామ పంచాయతీల్లో చెత్తతో రూ. 2600 కోట్లు ఆదాయం సమకూరింది.

    • రెండున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి.

    • స్వచ్చాంధ్ర ద్వారా దీనిని ప్రజల్లోకి తీసుకెళతాం.

    • ప్రజలంతా దీనిపై అవగాహన పెంచుకోవాలి.

    • చెత్త ద్వారా వచ్చే సంపదను ఆయా కార్మికులకు కేటాయిస్తాం.

    • బ్లీచింగ్ పౌడర్‌కే పంచాయతీల్లో డబ్బులు లేని పరిస్థితి.

    • పంచాయతీకి నిధుల సమకూర్చే సవాల్‌ను స్వీకరించి ముందుకు సాగుతాం.

    • గ్రామాల్లో రోడ్డు వెంట కొబ్బరి చెట్లు పెంచడం ద్వారా కొంత ఆదాయం సమకూర్చుకుంటాం.

    • పంచాయతీలను అనేక కారణాలతో నిర్వీర్యం చేశారు.

    • సమూలంగా ప్రక్షాళన జరగాలి, స్వయం సమృద్దిగా పంచాయతీలు ఎదగాలి.

    • అల్లావుద్దీన్ అద్భుత దీపంలా అన్ని పరిష్కారాలు ఒకేసారి అయిపోవు.

    • ఈ ప్రాజెక్టును ముందు అమలు చేసి.. ఫలితాల చూసి.. అన్ని‌చోట్ల అమలు చేస్తాం.

    • దీనికి కమిట్‌మెంట్ ఉండే లీడర్ షిప్ ఉంటేనే ఇది సాధ్యం.

    • పిఠాపురంలో 54 పంచాయతీల్లో మేము చేసేది చేయగా.. ఎన్ఆర్ఐలు ముందుకు వస్తే వారి సాయం తీసుకుంటాం.

    • సర్వీస్ అంటే ఎవరూ రారు.. చెత్తతో సంపద వస్తుంది అంటేనే ముందుకు వస్తారు.

    • అన్ని అనర్ధాలకు ఒకే ఐఏఎస్ కారణం.

    • ఏ సమీక్ష చేసినా.. ఆయనే మూల కారణం అంటున్నారు.

    • ఆయన ఇప్పుడు సర్వీసులో లేరు... ఎవరిని బాధ్యులను‌ చేయాలి, నిధులు ఎలా రికవరీ చేయాలి.

    • కేవలం కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.

    • గత ప్రభుత్వం పంచాయతీ లకు రాష్ట్ర వాటా ఇవ్వలేదు.

    • కేంద్రం కూడా నమ్మకం పోయి నిధులు ఆపేశారు.

    • 70+30 నిధులు ఇస్తే పని అయ్యేది.. అది జరగలేదు.

    • రకరకాల పేర్లు చెప్పి నిధులు మొత్తం మళ్లించారు.

    • ముందు ఖర్చు పెట్టండి, తరువాత బిల్లు ఇస్తాం అని నమ్మబలికారు.

    • డబ్బులు వచ్చినా.. రోడ్లు వేసిన కాంట్రాక్టర్‌లకు గత ప్రభుత్వం ఇవ్వలేదు.

    • అన్ని వ్యవస్థల్లో, పథకాల్లో ఇటువంటి ఛాలెంజ్‌లు ఉన్నాయి.

    • వీటిని పెట్టుకుని వెంటనే అన్నీ‌ చేయాలంటే మాకు సాధ్యం కాదు కదా.

    • ఒక్కోకటి సరి చేసుకుంటూ, ప్రణాళిక బద్దంగా ముందుకు వెళుతున్నాం.

  • 2024-07-12T12:06:44+05:30

    ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు..

    danam.jpg

    • త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కాబోతోంది.

    • ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే.

    • బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీ లాగా నడిపాడు.

    • కేసీఆర్‌ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయిట్మెంట్ కూడా దొరికేది కాదు.

    • ఒకవేల దొరికినా, గంటల తరబడి వైట్ చేయించేవారు.

    • కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది.

    • అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు.

    • బీఆర్ఎస్‌పై నమ్మకం లేకనే ఎమ్మేల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు.

    • బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారు.

    • విలువ లేని చోట ఉండలేక కాంగ్రెస్‌లో చేరుతున్నారు.

    • కాంగ్రెస్‌లో అందరికి విలువ ఉంటుంది.

    • గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డవలప్మెంట్ ఫండ్ ఉండేది.

    • బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం అంటే అసలు ఫండే లేదు.

    • బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారు.

    • దోచుకున్న వారి వివరాలు త్వరలో బయట పెడతాను.

    • 10 ఏళ్లలో కేటీఆర్ బినామిలు వేల కోట్లు దండుకున్నారు.

    • త్వరలో సాక్షాలతో బయటపెడుతా.

    • ఎమ్మెల్యేలను కాపాడుకోడానికి ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామని మేకపోతు గంభీరం చూపిస్తున్నారు.

    • సొంత కుటుంబ సభ్యురాలు కవిత జైల్లో ఉంటే ఆమెను బయటకు తీసుకురాకుండా రాజకీయం చేస్తున్నారు.

  • 2024-07-12T11:52:27+05:30

    బీజేపీలో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం?

    brs.jpg

    • కమలం గూటికి నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు!

    • ఢిల్లీలో బీజేపి పెద్దలతో కేటీఆర్, హరీశ్ విలీనం ఒప్పందంపై బీఆర్ఎస్ చర్ఛ.

    • బీఆర్ఎస్ నుండి ప్రస్తుతం రాజ్యసభలో నలుగురు సభ్యులు.

    • బీ. పార్థసారథి రెడ్డి, డీ. దామోదర్ రావు , కేఆర్. సురేశ్ రెడ్డి, వద్ధిరాజు రవిచంద్ర.

    • కాంగ్రెస్ నుండి రాజ్యసభలో రేణుకా చౌధరి, అనిల్ కుమార్ యాదవ్.

    • కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు చేరకుండా బీఆర్ఎస్ ఎత్తుగడ.

    • కాంగ్రెస్‌లో చేరిన ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

    • మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఒకట్రెండు రోజుల్లో చేరిక.

  • 2024-07-12T11:48:58+05:30

    హైదరాబాద్: ఆ అల్లం తింటున్నారా? ఇది చూడండి..

    Adulterated-Ginger-Garlic-P.jpg

    • నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీ పై సైబరాబాద్ SOT పోలీసుల దాడి.

    • 15 లక్షల విలువ గల 7.3 టన్నుల పేస్ట్ స్వాదీనం.

    • బుద్వేల్ లోని గ్రీన్ సిటీ లో గోప్యంగా అప్న ఎంటర్ప్రైసెస్ అనే పేరు పై ఫ్యాక్టరీనీ నిర్వహిస్తున్న అమీర్ నిజాన్ అనే వ్యక్తి.

    • అక్రమంగా సింథటిక్ కలర్స్, యాసిడ్స్ మరియు కెమికల్ వాటర్ వాడుతున్నట్లు నిర్ధారణ.

    • ఫుడ్ సేఫ్టీ అధికారి పరీక్షలు జరుపుతున్నట్లు సమాచారం.

  • 2024-07-12T11:48:12+05:30

    ఫోన్ టాపింగ్ కేసులో నిందితుల మ్యాండేటరీ బెయిల్ పిటిషన్

    • పిటిషన్ దాఖలుచేసిన నలుగురు నిందితులు

    • A2 ప్రణీత్ రావు, A3 తిరుపతన్న, A4 భుజంగరావు, A5 రాధాకిషన్ రావు.

    • ఇప్పటివరకు పోలీసులు చార్జిషీట్ వేయలేక పోయారు.. నిందితుల తరుపు న్యాయవాదులు

    • కేసు నమోదు, నిందితులను అరెస్ట్ చేసి 100రోజులు దాటింది

    • విచారణకు ముందు జడ్జి చాంబర్ లోకి విచారణ అధికారులు వెళ్లారు

    • చార్జిషీట్ వెనక్కు ఇచ్చినంత మాత్రాన వేయనట్టు కాదు.. పోలీసులళతరుపు న్యాయవాది

    • విచారణ కీలక దశలో ఉంది బెయిల్ ఇవ్వొద్దన్న పోలీసులు

    • ఇరుపక్షాల వాదనలు పూర్తి , నేడు బెయిల్ పిటీషన్స్ పై తీర్పు.

  • 2024-07-12T11:46:02+05:30

    బెజవాడ నీటిపారుదల అభివృద్ది సంస్థ కార్పొరేషన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

    • బెజవాడ నీటిపారుదల అభివృద్ది సంస్థ కార్పొరేషన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.

    • నిన్న అర్థరాత్రి కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులకి ఫిర్యాదు.

    • మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది.

    • ప్రమాదంలో కాలిపోయిన రికార్డులు, ఫైల్స్, కంప్యూటర్స్.

    • ఉద్దేశపూర్వకంగా చేశారా లేక ప్రమాదమా అనే కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు.

    • రంగంలోకి దిగిన క్లూస్ టీమ్

    • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ కార్యాలయం మేనేజర్ లక్ష్మి కామెంట్స్.

    • రాత్రి ఏం జరిగిందో మాకు కూడా తెలియదు.

    • అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఉదయం తెలుసుకున్నాము.

    • రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ, శ్రీకాకుళం, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, కడప, కర్నూలు, విజయనగరం మొత్తం 8 బ్రాంచ్‌లు ఉన్నాయి.

    • అన్నిటికీ హెడ్ క్వార్టర్స్ విజయవాడలోనే ఉంది.

    • ఇక్కడినుంచి ట్రాన్సాక్షన్స్, జరుగుతాయి.

    • డేటా అంతా ఇక్కడే ఉంటుంది.

    • ఇక్కడ మొత్తం 36 మంది ఉద్యోగస్తులు ఉన్నాము.

    • 24 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్, 12 మంది రెగ్యులర్ ఎంప్లాయిస్ ఉన్నాము.

    • షార్ట్ సర్క్యూట్ కారణం తరచూ లిఫ్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.

    • రికార్డులు, కంప్యూటర్లు, ఏసీలు, ఫైల్స్ మొత్తం పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

    • రాత్రికి రాత్రి మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

  • 2024-07-12T11:42:33+05:30

    తల్లికి వందనం పథకంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు..

    • విశాఖ: తల్లికి వందనం పథకంపై మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు.

    • తల్లికి వందనం పథకంపై విద్యార్థి తల్లిదండ్రులో అనుమానం ఉంది.

    • మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల అందరికీ తల్లి వందనం పథకం ఇవ్వాలి.

    • ఎన్నికల ముందు టిడిపి నేత, ప్రస్తుత మంత్రి రామానాయుడు ఇంట్లో ఎంత మంది ఉంటే.. అంత మందికి రూ. 15 వేలు ఇస్తామని చెప్పిన వీడియోను చూపిన గుడివాడ అమర్.

    • సూపర్ సిక్స్ ఎటు వెళ్ళిపోయిందో.. తల్లికి వందనంపై చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిల బెట్టుకోవాలి.

  • 2024-07-12T11:39:53+05:30

    విజయవాడ: మెరుపు సమ్మెకు దిగిన జూడాలు..

    • వైద్యులపై దాడిని నిరసిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుపు సమ్మెకు దిగిన జుడాలు.

    • తమకు రక్షణ కల్పించే వరకు విధులకు హాజరుకామంటున్న జుడాలు.

    • నిన్న గడ్టి మందు తాగి వచ్చిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.

    • డాక్టర్ నిర్లక్ష్యం కారణమంటూ మృతుని బంధువుల వైద్యులపై దాడికి యత్నం.

    • సూపరింటెండెంట్‌కు చెప్పినా పట్టించుకోలేదంటూ జుడాల ఆవేదన.

    • నేటి నుంచి విధులు బహిష్కరించి నిరసనలు చేపట్టిన జుడాలు.

    • తమకు రక్షణ కల్పించాలి, ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్.

  • 2024-07-12T11:34:47+05:30

    రైలు ఢీకొని విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచిన గజరాజు..

    అస్సాంలో ఘోర ప్రమాదం జరిగింది. జాగిరోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతున్న ఏనుగును ట్రైన్ గుద్దేసింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏనుగు.. పడుతూ లేస్తూ.. అక్కడే ప్రాణాలు విడిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. హృదయవిదాకరమైన ఈ దృశ్యం చూసి నెటిజన్లు కన్నీరు పెట్టుకుంటున్నారు. వన్య ప్రాణుల సంరక్షణ కోసం రైల్వే శాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

  • 2024-07-12T11:03:10+05:30

    కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు..

    • ఢిల్లీ లిక్కర్ ఈడీ మనీలాండరింగ్ కేసులో మాత్రమే సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం.

    • ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అక్రమం అని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసినట్టు తెలిపిన జస్టిస్ సంజీవ్ కన్నా ధర్మాసనం.

    • గత నెల 27వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన సిబిఐ.

    • ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సీఎం కేజ్రివాల్.

  • 2024-07-12T10:56:56+05:30

    గేమ్ స్టార్ట్.. ఐపీఎస్ పి.వి సునీల్ కుమార్‌పై కేసు నమోదు..

    • గుంటూరు: ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్ కుమార్ పై కేసు నమోదు.

    • పి.వి.సునీల్ కుమార్ పై కేసు నమోదు చేసిన నగరంపాలెం పోలీసులు.

    • రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.

    • గతంలో సీఐడీ డీజీగా పనిచేసిన పి.వి.సునీల్ కుమార్.

    • గుంటూరులో కస్టడీకి తీసుకున్న సమయంలో చిత్ర హింసలు పెట్టాడని ఫిర్యాదు.

    • కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు.

    • ఐపీఎస్‍ అధికారి సునీల్ కుమార్, తదితరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు.