Trending: మీ కక్కుర్తి తగలెయ్యా.. డబ్బు కోసం అన్నా చెల్లెళ్ల పెళ్లి.. కట్ చేస్తే..
ABN , Publish Date - Mar 18 , 2024 | 07:34 PM
పెళ్లంటే నూరేళ్ల పంట.. ఆ బంధం కలకాలం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. అందుకే ఎంత ఖర్చయినా వెనకాడకుండా ఘనంగా పెళ్లి చేసుకుంటుంటారు.
పెళ్లంటే నూరేళ్ల పంట.. ఆ బంధం కలకాలం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. అందుకే ఎంత ఖర్చయినా వెనకాడకుండా ఘనంగా పెళ్లి చేసుకుంటారు. కానీ కొన్ని కుటుంబాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కారణంగా పెళ్లి చేయడం గగనంగా మారుతుంది. అలాంటి వారి ఇబ్బందులు గమనించిన ప్రభుత్వాలు వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. అందులో భాగంగానే పేదలకు ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh) ప్రభుత్వం సామూహిక వివాహ పథకాన్ని అమలు చేస్తోంది. కానీ ఓ జంట మాత్రం ఈ పథకం ద్వారా వచ్చే ఆర్థిక సహాయాన్ని పొందేందుకు హేయమైన పనికి పాల్పడ్డారు. ఏకంగా అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీనిని సీరియస్ గా తీసుకున్న అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్గంజ్జిల్లాలోని లక్ష్మీపుర్ బ్లాక్లో మార్చి 5న ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం ద్వారా 38 నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులకు ఘనంగా పెళ్లి చేసింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా వచ్చే డబ్బు, కానుకలు పొందేందుకు ఓ మహిళ ఏకంగా తన సోదరుడినే పెళ్లి చేసుకుంది. సదరు మహిళకు ఏడాది క్రితమే వివాహం జరగగా ప్రస్తుతం ఆమె భర్త ఉపాధి కోసం వేరే ప్రాంతంలో ఉంటున్నారు.
గ్రామస్థుల సహాయంతో విషయం తెలుసుకున్న మహిళ భర్త నేరుగా లక్ష్మీపుర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అధికారులు వారి ఇంటికి వెళ్లి దర్యాప్తు చేశారు. ప్రభుత్వం తరఫున పొందిన వస్తువులన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు తెలిపారు. సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా పెళ్లి చేసుకున్న జంటలకు రూ.51వేలుతో పాటు మంగళసూత్రం, ట్రంకు పెట్టె, దుస్తులు తదితర కానుకలను అందిస్తోంది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.