West Bengal: బెంగాల్‌లో భారీగా పట్టుబడ్డ నగదు, మద్యం.. ఎంతంటే..?
ABN , Publish Date - Mar 31 , 2024 | 10:22 AM
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే ప్రలోభాల పర్వానికి తెరలేచింది. మద్యం, నగదు, కానుకలను తరలిస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో భారీగా నగదు పట్టుబడింది. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు రూ.140 కోట్ల విలువ గల నగదు, మద్యం, కానుకలు పట్టుబడ్డాయని ఎన్నికల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
పాట్నా: లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) షెడ్యూల్ వచ్చిన వెంటనే ప్రలోభాల పర్వానికి తెరలేచింది. మద్యం, నగదు, కానుకలను తరలిస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో భారీగా నగదు పట్టుబడింది. పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) ఇప్పటివరకు రూ.140 కోట్ల విలువ గల నగదు, మద్యం, కానుకలు పట్టుబడ్డాయని ఎన్నికల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
నగదు ఎంతంటే..?
‘రూ.7.87 కోట్ల నగదును శనివారం వరకు స్వాధీనం చేసుకున్నారు. 12.7 లక్షల లీటర్ల మద్యం సీజ్ చేశారు. దాని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.33.86 కోట్ల వరకు ఉంటుంది. 3.5 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాని విలువ రూ. 18.28 కోట్లు ఉంటుంది. రూ.27.32 కోట్ల విలువ గల బంగారం సీజ్ చేశారు. రూ.36 కోట్ల విలువ గల కానుకలను స్వాధీనం చేసుకున్నాం అని’ ఎన్నికల అధికారులు తెలిపారు.
మరిన్ని లోక్ సభ ఎన్నికల వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి:
BJP: ఓటింగ్ లేదు కౌంటింగ్ లేదు..ఎన్నికలకు ముందే 10 అసెంబ్లీ సీట్లు గెల్చుకున్న బీజేపీ