Share News

Lateral entry: లేటరల్ ఎంట్రీపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం..

ABN , Publish Date - Aug 20 , 2024 | 02:53 PM

లేటరల్ ఎంట్రీ విధానం(Lateral entry system)పై కేంద్ర ప్రభుత్వం(Central govt) వెనక్కి తగ్గింది. వివిధ రంగాల నిపుణులకు ప్రభుత్వంలోని ఆయా విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించే పద్ధతినే లేటరల్ ఎంట్రీ అంటారు.

Lateral entry: లేటరల్ ఎంట్రీపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం..
Union Minister Jitendra Singh

ఢిల్లీ: లేటరల్ ఎంట్రీ విధానం(Lateral entry system)పై కేంద్ర ప్రభుత్వం(Central govt) వెనక్కి తగ్గింది. వివిధ రంగాల నిపుణులకు ప్రభుత్వంలోని ఆయా విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించే పద్ధతినే లేటరల్ ఎంట్రీ అంటారు. అయితే తాజాగా దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనకడుగు వేసింది. తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ యూపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు యూపీఎస్సీ(UPSC) ఛైర్మన్‌కు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాశారు.


లేటరల్ ఎంట్రీ విధానాన్ని 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కోసం వీరప్ప మొయిలీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు ఈ విధానాన్ని గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా వివిధ రంగాల నిపుణులకు ప్రభుత్వంలో ఆయా విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో భర్తీ చేయాల్సిన పదవుల్లో ఆయా రంగాల నిపుణులకు అవకాశం కల్పిస్తారు. వీరిని యూపీఎస్సీ నోటిఫికేషన్‍ ద్వారా భర్తీ చేస్తారు. అయితే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ పెద్దఎత్తున నియామకాలు చేయాలని ప్రయత్నించింది.


ఈ విధానాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మోదీ ప్రభుత్వం రిజర్వేషన్ల విధానానికి మంగళం పాడుతూ బ్యాక్ డోర్ ద్వారా నియామకాలు చేస్తోందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలతోపాటు అధికారపక్షంలోని పార్టీల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి వచ్చింది. దీంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ విధానం రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. సామాజిక న్యాయం విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని, లేటరల్ ఎంట్రీ నియామకాల్లో కూడా రిజర్వేషన్ల అవకాశాలను పరిశీలించాలని ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాల్సిందిగా కేంద్ర మంత్రి యూపీఎస్సీని ఆదేశించారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 20 , 2024 | 03:26 PM