Share News

Chennai: స్టాలిన్‌ తలచుకుంటే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి..

ABN , Publish Date - Aug 10 , 2024 | 11:32 AM

ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) మనసు పెడితే ఉదయనిధి ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) అవుతారని డీఎంకే సీనియర్‌ నేత, కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి(RS Bharti) నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

Chennai: స్టాలిన్‌ తలచుకుంటే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి..

- ఆర్‌.ఎస్. భారతి నర్మగర్భ వ్యాఖ్యలు

చెన్నై: ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) మనసు పెడితే ఉదయనిధి ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) అవుతారని డీఎంకే సీనియర్‌ నేత, కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి(RS Bharti) నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ పాలనలో ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధిని(Udayanidhini) నియమించాలంటూ ఆ పార్టీకి చెందిన అనేక మంది నేతలు స్టాలిన్‌ను కోరుతున్న విషయం తెలిసిందే. అయితే ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని సిఫార్సులు వచ్చిన మాట నిజమేనని, కానీ, అవి ఫలించలేదని స్టాలిన్‌ తన మనసులో మాట చెప్పకనే చెప్పేశారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్‌ నేతల్లో ఒకరైన ఆర్‌ఎస్‌ భారతి ఈ అంశంపై స్పందిస్తూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధిని నియమించడానికి పలువురు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు.

ఇదికూడా చదవండి: Chennai: వచ్చే నెలలో తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన..


తనలాంటి సీనియర్లే ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని కోరుతున్నామన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ మనసుపెడితే ఉదయనిధి స్టాలిన్‌ ఉప ముఖ్యమంత్రి కావడం పెద్ద విషయం కాదన్నారు. సినీ హీరో విజయ్‌ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ మహానాడుకు తిరుచ్చిలో స్థలం ఇవ్వకుండా డీఎంకే సీనియర్‌ నేత కేఎన్‌ నెహ్రూ అడ్డుపడుతున్నారంటూ సాగుతున్న ప్రచారం సరికాదన్నారు. డీఎంకే ఏ ఒక్కరికీ భయపడదన్నారు. ఎంజీఆర్‌, జయలలిత వంటి వారికే భయపడలేదని, ఇపుడు విజయ్‌ పార్టీని చూసి భయపడతామా అని ప్రశ్నించారు. తమ దారిలో మేం వెళుతున్నామని ఆర్‌ఎస్‌ భారతి వ్యాఖ్యానించారు.

nani3.2.jpg


.......................................................................

ఈ వార్తను కూడా చదవండి:

........................................................................

Chennai: వచ్చే నెలలో తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన..

- రెండు వందే భారత్‌ రైళ్లు ప్రారంభం

- అదే రోజు రామేశ్వరం వంతెన కూడా

చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) వచ్చే నెలలో రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో తిరిగే రెండు వందే భారత్‌ రైళ్లతోపాటు రామేశ్వరం - పాంబన్‌(Rameshwaram - Pamban) వంతెనను కూడా ఆయన ప్రారంభించనున్నారు. అయితే ప్రధాన పర్యటన అధికారికంగా ఖరారు కావాల్సి వుంది. చెన్నై - నాగర్‌కోయిల్‌, మదురై-బెంగళూరు మధ్య కొత్తగా వందేభారత్‌(Vande Bharat) రైళ్లను నడపాలని దక్షిణ రైల్వే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన తుది విడత పనులు కూడా పూర్తయ్యాయి. నిజానికి జూన్‌లోనే ఈ రెండు రైళ్లను ప్రధాని ప్రారంభించాల్సివుంది.


కానీ కోల్‌కతలో సంభవించిన ఘోర రైలు ప్రమా దం, చెన్నై - తాంబరం - మదురై మార్గంలో రైల్వే పనుల్లో జాప్యం కారణంగా ఆ రెండు సర్వీసులు ప్రారంభం కాలేకపోయాయి. అయితే ఇప్పుడు అన్నీ సద్దుమణగడంతో ఈ రెండు రైళ్లను నడపాలని దక్షిణరైల్వే నిర్ణయించింది. దీంతో పాటు మరో 8 మార్గాల్లోనూ వందేభారత్‌ సేవలు అందనున్నాయి. ఐసీఎఫ్‏లో ఇప్పటికే 70 వందేభారత్‌ రైళ్లు సిద్ధమవ్వగా, ఇందులో 51 రైళ్లు పరుగులు పెడుతున్నాయి. 9 రైళ్లను అత్యవసర సేవలకు వుంచగా, మరో 10 వందే భారత్‌ రైళ్లు పట్టాలెక్కేందుకు ఎదురు చూస్తున్నాయి.


అందులో రెండు రైళ్లు వచ్చే నెల చెన్నై - నాగర్‌కోయిల్‌, మదురై - బెంగళూరు(Chennai - Nagercoil, Madurai - Bangalore) మధ్య పరుగులు పెట్టనున్నాయి. వాటిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. పాంబన్‌-రామేశ్వరం మార్గంలో వంతెన పనులు పూర్తి కావచ్చాయి. దానిని కూడా సెప్టెంబరులో ప్రారంభించేందుకు దక్షిణరైల్వే సన్నాహాలు చేస్తోంది. వందేభారత్‌ రైళ్లను, పాంబన్‌ వంతెనను కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రా రంభిస్తారని రైల్వే అధికారులు తెలిపారు. అయి తే ఏ వేదిక నుంచి వాటిని ప్రారంభిస్తారన్నది ఇంకా ఖరారు కాలేదని వారు పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 10 , 2024 | 11:32 AM