Share News

Civils Mains: లైబ్రరీలు క్లోజ్.. తప్పని ఇబ్బందులు

ABN , Publish Date - Aug 03 , 2024 | 01:31 PM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మెయిన్స్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో ఒక్కటే టెన్షన్. సరిగ్గా మరో 48 రోజుల్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులకు ఇది కీలక సమయం.. చాలా మంది విద్యార్థులు చాలా డిస్టర్బ్‌గా ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రావూస్ కోచింగ్ సెంటర్ బేస్ మెంట్‌లోకి భారీగా వర్షపునీరు చేరి, అక్కడ ఉన్న ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.

Civils Mains: లైబ్రరీలు క్లోజ్.. తప్పని ఇబ్బందులు
Civil Service Mains Exam

ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మెయిన్స్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో ఒక్కటే టెన్షన్. సరిగ్గా మరో 48 రోజుల్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులకు ఇది కీలక సమయం.. చాలా మంది విద్యార్థులు చాలా డిస్టర్బ్‌గా ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రావూస్ కోచింగ్ సెంటర్ బేస్ మెంట్‌లోకి భారీగా వర్షపునీరు చేరి, అక్కడ ఉన్న ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. మిగతా కోచింగ్ సెంటర్లను పరిశీలించి, బేస్ మెంట్లలో లైబ్రరీ ఉన్నవాటిని అధికారులు మూసివేశారు. దీంతో విద్యార్థులు చదువుకోవడం ఇబ్బందిగా మారింది.


లైబ్రరీలు క్లోజ్

భారీ వర్షాలతో రాజిందర్ నగర్, ముఖర్జీ నగర్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఆయా చోట్ల ఉన్న మిగతా కోచింగ్ సెంటర్లను గుర్తించి అధికారులు చర్యలు తీసుకున్నారు. బేస్ మెంట్లలో లైబ్రరీ ఉంటే క్లోజ్ చేశారు. దాంతో విద్యార్థులు చదువుకోవడం వీలు పడటం లేదు. మరోవైపు ముగ్గురు విద్యార్థులు చనిపోవడంతో ఆందోళనలు మిన్నంటాయి. దాంతో కూడా మెయిన్స్ కోసం ప్రిపేరయ్యే స్టూడెంట్స్‌ను ఇబ్బంది కలిగిస్తోంది.


సివిల్స్ ఇలా..

సివిల్స్ పరీక్షల్లో తొలుత ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే.. మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్‌లో మొత్తం 1750 మార్కులు ఉంటాయి. మెయిన్స్ క్వాలిఫై అయితే.. ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకు 275 మార్కులు ఉంటాయి. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఐదురోజులు సివిల్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.


విద్యార్థుల ఇబ్బందులు

‘రావూస్ కోచింగ్ సెంటర్‌లోకి వర్షపునీరు వచ్చినప్పటి నంచి నా ప్రిపరేషన్‌కు డిస్టర్బ్ కలిగింది. మెయిన్స్ కోసం నిర్దేశిత సమయం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. లైబ్రరీ లేకపోవడం వల్ల అలా చేయడం వీలు పడటం లేదు అని’ ప్రవీణ్ అనే అభ్యర్థి వాపోయాడు.


పెరిగిన ఫీజు

‘గతంలో లైబ్రరీ ఫీజు రూ.2 వేలు ఉండేది. రావూస్ ఘటన తర్వాత కొన్ని లైబ్రరీలు మూసివేశారు. దీంతో మిగతా లైబ్రరీలు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. రూ.6 వేల వరకు అడుగుతున్నారు. నా కోచింగ్ సెంటర్ లైబ్రరీ ఇప్పటికీ తెరవడం లేదు. అందులో నా బుక్స్, నోట్స్ ఉన్నాయి. పుస్తకాల పీడీఎఫ్ తీసుకొని ప్రిపరేషన్ చేస్తున్నా అని’ మరో అభ్యర్థి అనురాగ్ వివరించారు.

Updated Date - Aug 03 , 2024 | 01:31 PM