Share News

Kangana Ranaut: కంగనా రనౌత్‌కు కాంగ్రెస్ వార్నింగ్

ABN , Publish Date - Sep 23 , 2024 | 05:52 PM

కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రుణాలు తీసుకుని ఆ సొమ్మును సోనియాగాంధీకి సమర్పిస్తోందంటూ కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది.

Kangana Ranaut: కంగనా రనౌత్‌కు కాంగ్రెస్ వార్నింగ్

సిమ్లా: బీజేపీ ఫైర్‌బ్రాండ్‌గా తరచు వివాదాస్పద వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో చిక్కుకుంటున్న ఆ పార్టీ మండి నియోజకవర్గం ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఈసారి కాంగ్రెస్ (Congress) పార్టీ ఆగ్రహానికి గురైంది. కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రుణాలు తీసుకుని ఆ సొమ్మును సోనియాగాంధీకి సమర్పిస్తోందంటూ కంగన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ఈ ఆరోపణలను కంగన రుజువు చేయాలని, లేదంటే సోనియాగాంధీకి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ సవాలు విరిసారు. చేసిన ఆరోపణలకు రుజువులు చూపకుంటే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

Rahul Gandhi: దేశంలో విద్వేషం, హింసను వ్యాప్తి చేస్తున్న బీజేపీ-ఆర్ఎస్ఎస్


''సోనియాగాంధీపై కంగనా చేసిన వ్యాఖ్యలు ఆమె తెలివితక్కువ తనాన్ని చాటుతున్నాయి. కనీసం ఒక్క రూపాయి అయినా దారి మళ్లించినట్టు కంగనా నిరూపించాలి. లేదంటే ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు సోనియాగాంధీకి క్షమాపణ చెప్పాలి. లేదంటే మాత్రం పరువునష్టం కేసు వేస్తాం'' అని విక్రమాదిత్య సింగ్ స్పష్టం చేశారు. కంగనా రనౌత్ తన 'ఎమర్జెన్సీ' సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడకపోవడంతో బాధలో ఉన్నందునే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని కూడా వ్యంగ్యోక్తులు గుప్పించారు.


Read More National News and Latest Telugu News

Also Read: Narendra Modi: యూఎస్‌లో మరో రెండు భారతీయ రాయబార కార్యాలయాలు ఏర్పాటు

Updated Date - Sep 23 , 2024 | 05:52 PM