Share News

Himachal Political Crisis: ఎమ్మెల్యేలతో హిమాచల్ ప్రదేశ్ సీఎం భేటీ..? ఎందుకంటే..?

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:27 AM

రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్‌ హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభానికి దారితీసింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనతో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు గురువారం నాడు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.

Himachal Political Crisis: ఎమ్మెల్యేలతో హిమాచల్ ప్రదేశ్ సీఎం భేటీ..? ఎందుకంటే..?

సిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్‌ హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh) రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ఆ వెంటనే మంత్రి విక్రమాదిత్య సింగ్ తన పదవీకి రాజీనామా చేయడం, వెనక్కి తీసుకోవడం చక చకా జరిగిపోయాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనతో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు (CM Sukhu) గురువారం నాడు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. అల్పహార విందుకు సభ్యులు అందరూ రావాలని సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యేలు చేజారకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మంత్రి విక్రమాదిత్య ధిక్కార స్వరం వినిపించడంతో కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, కర్ణాటక డిప్యూటీ సీఎం, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ను (DK Shiva Kumar) రంగంలోకి దింపింది.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 68 మంది సభ్యులు ఉన్నారు. మెజార్టీ మార్క్ 35 మంది సభ్యులు కాగా కాంగ్రెస్ పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఆరుగురు రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రతిపక్ష బీజేపీకి సభలో 25 మంది సభ్యుల బలం ఉంది. మరో మూడు చోట్ల ఇండిపెండెంట్లు గెలుపొందారు. రాజ్యసభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీని బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ ఓడించిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 29 , 2024 | 11:27 AM